“కమలాని”కి ఎదురుదెబ్బ…!

rjasan CFF

దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రాభవం తగ్గుతోందా?, లౌకిక రాజ్యంలో కేవలం హిందుత్వ నినాదం బెడిసి కొడుతుందా? ప్రజా సమస్యల ముందు భాజపా హిందుత్వ పాచిక పారడం లేదా? గత ఎన్నికల్లో గుడ్డిలో మెల్లగా వికసించిన కమలం క్రమంగా వాడి పోతోందా? గ్రామ స్థాయిలో కషాయం రంగు వెలిచి పోతోందా? మొన్న రాజస్థాన్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, వాటి ఫలితాలు ఇలాంటి అనేక ప్రశ్నలకు తెర లేపుతున్నాయి. బిజెపి అగ్ర నేతలు దీన్ని సులువుగా తీసుకుంటున్నప్పటికీ, రాజకీయ పరిశీలకులు, మేధావుల విశ్లేషణలు మాత్రం పార్టీ భవిష్యత్తుని శంకిస్తున్నాయి.

rajasthan panchayat

రాజస్థాన్ రాష్ట్రంలో బిజెపి అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ హోరమైన పరాజయాన్ని చవిచూసింది. సాధారణంగా ఇలాంటి ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీనే తిరుగులేని ఆధిపత్యం చూపుతుంది. దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇదే తరహా ఫలితాలే కనిపిస్తాయి. ఉదాహరణకు ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో వెల్లడైన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే నిదర్శనం. తెలుగుదేశం, భాజపా, జనసేన పార్టీల కూటమి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నాయి. అటు కేంద్రం లోనూ, ఇటు రాజస్థాన్ లోనూ అధికారంలో ఉన్న భాజపా “స్థానిక” బలంలోఎందుకు చతికిల పడిందనేది చర్చకు దారి తీసింది. పాత రికార్డుల ప్రకారం రాజస్థాన్ లో దాదాపు 36 ఏళ్ల తర్వాత ఏకపక్ష ఫలితాలు వెల్లడైనట్టు తెలుస్తోంది. అధికార బిజెపికి చెందిన శాసన సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాల్లోనూ కాంగ్రెస్ విజయ దుందుభి మోగించడం గమనించదగ్గ విషయం.37 జిల్లా పరిషత్ లలో కాంగ్రెస్ 25 పరిషత్ లను కైవసం చేసుకుంది. కేవలం 9 జిల్లాలతో అధికార బిజెపి సర్దుకుపోయింది. 7,471 పంచాయతీ సమితి స్థానాల్లో కాంగ్రెస్ 3,727 స్థానాలు, బీజేపీ 2,207 స్థానాలు గెలుచుకున్నాయి. జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికల్లో  1,072 స్థానాల్లో కాంగ్రెస్ 672 స్థానాలు, బీజేపీ 314 స్థానాలు దక్కించుకున్నాయి. బిజెపి సీనియర్ నాయకులు, వారి కుటుంబ సభ్యులు కూడా ఓడి పోయారు.  మంత్రులు ఛగన్ లాల్ ఘనీ, గణపత్ సింగ్ రాథోడ్‌లతో పాటు పిండ్వారాలో బీజేపీ నేత కిరణ్ రాజ్‌ పురోహిత్ కోడలు పూజా పురోహిత్, శివగంజ్‌లో గ్రామ సర్పంచ్ లలితా కున్వర్, సిరోహిలో  మండల అధ్యక్షుడు హార్దిక్ దేవాసి భార్య కవితా కుమారి ఓడిపోవడం రాష్ట్రంలో భాజపా పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు

బెడిసి కొట్టిన “కాషాయ”వ్యూహం…!

హిందూ సామాజిక వర్గం అధికంగా ఉన్న రాజస్థాన్ రాష్ట్రంలో “హిందుత్వ” నినాదంతో ముందుకు వెళ్తున్న భాజపాకి ఆ రాష్ట్రంలో ఎదురు గాలులు వీచడం  ఆశ్చర్యం కలిగించే అంశం. అయితే, స్థానిక ఎన్నికల్లో  వెనుకంజ వేయడానికి  ఆ పార్టీ నేతల వైఫల్యమా లేదంటే పేపర్ బ్యాలెట్ ప్రభావమా అనే కొత్త రకం చర్చకు తావు తీసింది. ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ నాయకత్వంలోని భాజపా ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అనేక జిల్లాల్లో నేతలు క్షేత్ర స్థాయిలో కషాయ దళాన్ని పట్టించుకోక పోవడం కూడా స్థానిక ఎన్నికల్లో ఓడిపోవలసి వచ్చిందని సాక్షాత్తు భాజపా నేతలే వెల్లడించడం గమనార్హం. ఇదిలాఉంటే, భాజపా పరిపాలన పై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లడం ఫలితంగానే ఆ పార్టీ ఘోర పరాజయం పాలైందని విపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి దిగింది. అంతేకాదు, పేపర్ బ్యాలెట్ మూలంగా మోడీ పాచిక పారలేదని పేర్కొంటోంది. రాజస్థాన్ లో ఓటమిని భాజపా అధినాయకత్వం క్షుణ్ణంగా సమీక్షిస్తోంది. 2021 ఎన్నికల్లో గెలుపు, ఈ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను బేరీజు వేస్తోంది. అదేవిధంగా  ఈ ఎన్నికల ఫలితాలను, జనం కోరుకుంటున్న మార్పును దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ సైతం వ్యూహరచన చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *