బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల బాధలను పట్టించుకోలేద కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రజల సొమ్ము దోచుకున్నారని, ఆరోపించారు. శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు. పేపర్ లీకులు జరుగుతుంటే పిల్లల తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతంగా ఉందన్నారు. బిడ్డల భవిష్యత్ పై వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందా అని ప్రజలను ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ నేతలకు వందల ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు ఉన్నాయని, కేసీఆర్ అధికారం కోసమే పాకులడుతున్నాడని వ్యాఖ్యానించారు. ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని, పండిన పంటకు సరిపడా ఆదాయం రాకుండా చేస్తోందని ప్రియాంక అన్నారు. ప్రధాని మోడీకి కేసీఆర్, ఓవైసీ ఒకరికొకరు మంచి సన్నిహితులని, సీఎం కేసీఆర్‌కు ప్రధాని మోడీ సాయం చేశారని, అందుకే నల్ల రైతు చట్టాలు, జీఎస్టీ, నోట్ల రద్దుకు బీఆర్‌ఎస్ ఎంపీలు బీజేపీకి మద్దతు పలికిందని దుయ్యబట్టారు. తెలంగాణలో కేసీఆర్ సీఎంగా ఉండాలని మోడీ అనుకుంటున్నారని, కానీ, మోడీ తీరు మారనంత వరకు రాహుల్ పోరాడుతూనే ఉంటాడన్నారు. కారు నాలుగు టైర్లలో గాలి తీసేశాం కాబట్టి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ప్రియాంక చెప్పారు.