Google Vice President Chandrasekhar Thota paid a courtesy call on the Telangana Chief Minister Revanth Reddy on Thursday at the CMs residence. Chandrasekhar discussed with the CM about the investments in Telangana State and expressed to work together with the government. Chandrasekhar told the chief minister about Artificial Intelligence is transform every sector and excited to partner to develop a digitization agenda for Telangana in farming, education, health and have deep technology and expertise to bring quality service to serve the needs of the Telangana citizens. Revanth Reddy also discussed on road safety improvements possible using Google Maps and Google Earth platforms. Ministers D. Sridhar Babu, Komatireddy Venkat Reddy, were present in the meeting.

కలిసి పని చేద్దాం… “గూగుల్“
గూగుల్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట గురువారం సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులపై చంద్రశేఖర్ ముఖ్యమంత్రితో చర్చించి ప్రభుత్వంతో కలిసి పనిచేయండనికి తమ సంసిద్ధతను వ్యక్తం చేసారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుందని, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలలో తెలంగాణ కోసం డిజిటలైజేషన్ ఎజెండాను అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావడంతోపాటు తెలంగాణ పౌరుల అవసరాలను తీర్చడానికి నాణ్యమైన సేవలను అందించడానికి విస్తృత సాంకేతికత, నైపుణ్యం తమతో ఉందని చంద్రశేఖర్ ముఖ్యమంత్రికి వివరించారు. గూగుల్ మ్యాప్స్ , గూగుల్ ఎర్త్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి సాధ్యమయ్యే రహదారి భద్రత పై కూడా ముఖ్యమంత్రి చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు డి.శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు
