గతంలో టోల్ ప్లాజాల దగ్గర వాహనదారులు మాన్యువల్‌గా టోల్ ఛార్జీలు చెల్లించే వారు, తర్వాత ఆటోమెటిక్‌గా టోల్ ఛార్జీలు వసూలు చేసే ఫాస్టాగ్‌ను ప్రవేశపెట్టారు.ఇప్పుడు దీని స్థానంలో కేంద్రం కొత్తగా జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్‌ను తీసుకొస్తోంది. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్‌ను వాహనదారులు రీఛార్జ్ చేయాలి, తగినంత క్యాష్ బ్యాలెన్స్ ఉండాలి. ప్రతిసారీ ఇలాంటి తలనొప్పులు లేకుండా, ఫాస్టాగ్‌ల నుంచి జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్‌కి మారాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల హైవే ప్రయాణం మరింత వేగంగా, సాఫీగా మారనుంది. ఫాస్టాగ్‌లు అనేవి ఎలక్ట్రానిక్ స్టిక్కర్లు. వీటితో టోల్ ప్లాజాల వద్ద ఆగకుండా వాహనదారులు టోల్ ఛార్జీలు చెల్లించవచ్చు. ట్రాఫిక్ రద్దీ, వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి 2016 లో వీటిని ప్రవేశపెట్టారు. అయితే, ఇప్పటికీ లో బ్యాలెన్స్ అలర్ట్స్, సాంకేతిక లోపాలు వంటి కొన్ని సమస్యలను వాహనదారులు ఎదుర్కొంటున్నారు. వీటికి పరిష్కారంగా జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్ తీసుకు రావాలని కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీ.
ప్రస్తుతం దీనిని ముంబై లోని అటల్ సేతు వంటి కొన్ని రహదారులపై పరీక్షిస్తున్నారు. ప్రత్యేక కెమెరాలతో కదిలే వాహనాల నంబర్ ప్లేట్లను స్కాన్ చేయడం ద్వారా ఇది పని చేస్తుంది. ఆ కెమెరాలు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ ( ఎ.ఎన్.అర్.పి.) టెక్నాలజీతో పని చేస్తాయి. ఈ సిస్టమ్‌లో వెహికిల్ రిజిస్ట్రేషన్‌కు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నుంచి టోల్ చెల్లింపు డెబిట్ అవుతుంది.
జీపీఎస్ఆ ధారిత టోల్ సిస్టమ్ ఫాస్టాగ్‌ల కంటే అనేక ప్రయోజనాలు ఉన్నట్టు తెలుస్తోంది. జీపీఎస్ టోల్ కలెక్షన్ సిస్టమ్ అందుబాటు లోకి వస్తే ప్లాజాల వద్ద వాహనాల వేగాన్ని తగ్గించాల్సిన లేదా ఆపాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల ప్రయాణ సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. ఇది ఫాస్టాగ్స్‌ను రీఛార్జ్ చేయడం లేదా తగినంత బ్యాలెన్స్ గురించి ఆందోళన చెందడం వంటి ఇబ్బందులను తొలగిస్తుంది. దీనివల్ల యూజర్ ఎక్స్పీరియన్స్ మెరుగు పడుతుంది. ఎలాంటి అంతరాయం లేకుండా వాహనాలు కంటిన్యూగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి పోవచ్చు. దీంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురు కావు. జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్ ఫాస్టాగ్స్‌ను పూర్తిగా భర్తీ చేసే అవకాశం లేదు. ప్రధాన అంటే జాతీయ రహదారులతో ప్రారంభించి క్రమంగా అన్ని ప్రాంతాల్లో దీనిని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే, ఇది వచ్చినంత మాత్రాన ఫాస్టాగ్‌లు నిరుపయోగంగా మారవు. వీటిని చిన్న రహదారులపై లేదా బ్యాకప్ ఆప్షన్ గా భవిష్యత్తులో కూడా ఉపయోగించవచ్చు. వచ్చే ఏప్రిల్ నెలలో జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్‌ను దేశ వ్యాప్తంగా ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పైలట్ ప్రాజెక్ట్‌ల విజయం, డేటా భద్రత వంటి సమస్యలను పరిష్కరించాక ఈ సిస్టమ్‌ను వెంటనే అమల్లోకి తీసుకు రావచ్చు.