నీరా”జ‌నాలు”

IMG 20240704 WA0025

పొట్టి క్రికెట్ లో జ‌గ‌జ్జేత‌లుగా నిలిచి స్వ‌దేశంలో అడుగు పెట్టిన భార‌త జ‌ట్టుకు అపూర్వ స్వాగ‌తం ల‌భిస్తోంది. ఓపెన్ టాప్ బ‌స్సులో విక్ట‌రీ ప‌రేడ్ క‌న్నుల పండువ‌గా సాగుతోంది. అశేష‌మైన అభిమానులు దారి పొడ‌వునా నీరాజ‌నాలు ప‌లుకుతూ ‘జ‌య‌హో టీమ్ ఇండియా’ నినాదాల‌తో భార‌త క్రికెటర్ల మీద‌ అభినంద‌ల వ‌ర్షం కురుపిస్తున్నారు. మువ్వ‌న్నెల జెండాలు చేత‌బూని ‘ఈ విజ‌యం చారాత్రాత్మ‌కం’ అంటూ రోహిత్ సేన ఘ‌న‌త‌ను కీర్తిస్తున్నారు..అనుకున్న స‌మ‌యం కంటే ఆల‌స్యంగా ప‌రేడ్ మొద‌లైనా స‌రే కొంచెం కూడా అల‌స‌ట లేకుండా ‘ఇండియా.. ఇండియా’.. ‘కోహ్లీ.. కోహ్లీ’.. ‘రోహిత్.. రోహిత్’.. నినాదాల‌తో మ‌రైన్ డ్రైవ్‌కు జోష్ తెస్తున్నారు. అభిమానుల మ‌ద్ద‌తు, ప్రేమ‌కు ఫిదా అయిపోయిన భార‌త ఆట‌గాళ్లు వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీని చూపిస్తూ అంద‌రికీ అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్నారు.

IMG 20240704 WA0026

భారీ భ‌ద్ర‌త న‌డుమ..

ఇసుకేస్తే రాల‌నంత‌ మంది జ‌నంతో టీమిండియా విజ‌యోత్స‌వ ర్యాలీ వాంఖ‌డే స్టేడియం వైపు వెళ్తోంది. దారి కిరువైపులా సైన్యంలా నిల‌బ‌డిన ఫ్యాన్స్ క్రికెట‌ర్లను కెమెరాలో బంధిస్తూ.. సెల్ఫీలు దిగుతూ ఫ్యాన్స్ మురిసి పోతున్నారు. ముంబై పోలీసుల భారీ భ‌ద్ర‌త న‌డుమ ర్యాలీ ప్ర‌శాంతంగా సాగుతోంది. వాంఖ‌డే స్టేడియానికి చేరుకున్నాక అక్క‌డ భార‌త క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ప్రపంచ కప్ విజేత‌ల‌ను ఘ‌నంగా స‌త్క‌రించ‌నుంది. అంతేకాదు, ముందుగా ప్ర‌క‌టించిన రూ. 125 కోట్ల ప్రైజ్‌ మ‌నీ ని కూడా ఈ మైదానం వేదిక‌గా వేలాది మంది ఫ్యాన్స్ చూస్తుండ‌గా చాంపియ‌న్ల‌కు అంద‌జేసే అవ‌కాశ‌ముంది. ఈ కార్య‌క్రమంలో క్రికెట్ దిగ్గ‌జాలు స‌చిన్ టెండూల్క‌ర్, ర‌వి శాస్త్రి, సునీల్ గ‌వాస్క‌ర్ తదితరులు హాజరు కానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *