jagana police c

“ఖాకీ” అంటే త్యాగనిరతి…

పోలీసులు వేసుకునే ఖాకీ డ్రెస్ అంటేనే త్యాగనిరతికి నిలువెత్తు సాక్ష్యం అనీ, పోలీస్‌ అంటే అధికారం మాత్రమే కాదనీ, సమాజంలో అతను ఒక బాధ్యత గల వ్యక్తీ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. నేరం వేగంగా తన రూపాన్ని మార్చుకుంటున్న ఈ యుగంలో అంతకుమించిన వేగాన్ని అందుకుంటేనే పోలీసింగ్‌కు మరింత విలువ పెరుగుతుందన్నారు. జన రక్షణ…

Read More
poce commo

“ధీరుల”కు నివాళి రోజు…

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్నిపురస్కరించుకొని శనివారం హైదారాబాద్ గోషామహల్ స్టేడియం లో పోలీస్ ఫ్లాగ్ డే జరుగుతుంది. ఉదయం 8 .45 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఫ్లాగ్ డే కార్యక్రమంలో డీజీపీ అంజనీ కుమార్ పాల్గొంటారు. ఉంటుంది. ఈ సంవత్సరం దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమర పోలీసులకు నివాళులు అర్పిస్తారు. సీనియర్ పోలీస్ అధికారులు, పదవీ విరమణ పొందిన పోలీసాధికారులు, పోలీసు అమరుల కుటుంబాలుఈ కార్యక్రంలో పాల్గొంటాయి.

Read More
dgp batukamma

పోలీసుల బతుకమ్మ…

తెలంగాణ డీజీపీ కార్యాలయంలో బతుకమ్మ ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. కార్యాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ బతుకమ్మ పండగకు డీజీపీ అంజనీ కుమార్,అడిషనల్ డీజీ సౌమ్య మిశ్రా, అభిలాష బిస్ట్, సంజయ్ కుమార్ జైన్, ఐ.జి రమేష్ రెడ్డి, ముఖ్య పరిపాలనాధికారి నవానీత తోసహా పలువురు పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఒక చోట చేర్చి ఉద్యోగులు, వారి పిల్లలు, చిన్నారులతో ఆటపాటలతో సంబరాలు చేసారు. దాండియా, బతుకమ్మ ఆటపాటల…

Read More
betting raja

బెట్టింగ్ రాజా సస్పెండ్…..

డ్రీమ్ 11 బెట్టింగ్ లో 1.5 కోట్ల రూపాయలు గెలుచుకున్న మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఎస్సై సోమనాథ్ సస్పెండ్ అయ్యారు. ఆన్ లైన్ లో బెట్టింగ్ చేసిన ఎస్.ఐ. ఇంత పెద్ద మొత్తం గెలిచారనే వార్త బయటకు గుప్పుమనడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో అనుమతి లేకుండా బెట్టింగ్ కు పాల్పడడం, మీడియా ఎదుట పోలీస్ యూనిఫామ్ లో మాట్లాడటం వంటివి నిబంధనలకు విరుద్ధమని విచారణాధికారి పేర్కొన్నారు. దీంతో సోమనాథ్ పై చర్యలు తీసుకున్నట్లు పుణే…

Read More

తరలుతున్న డబ్బు…

నిన్న నల్గొండ జిల్లాలో మూడు కోట్ల రూపాయల నగదు దొరకగా ఈ రోజు కరీంనగర్ జిల్లాలో మరో రెండు కోట్ల రూపాయల నగదు పట్టుపడింది. అనేక చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ డబ్బు ప్రవాహం ఆగడంలేదు. నగదు స్వదినంపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్.సుబ్బరాయుడు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర  అసెంబ్లీ ఎన్నికల నియమావళి  అమలులో ఉన్నందున జిల్లాలో అక్రమంగా డబ్బు, మద్యం, ఇతరములను  నిరోధించుటకు పలు చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు  ఎప్పటికప్పుడు వాహన తనిఖీలు…

Read More
Screenshot 20231015 211154 Gallery

ఎవరి డబ్బు….

నల్గొండ జిల్లా వాడపల్లి అంతరాష్ట్ర చెక్ పోస్టు వద్ద పోలీసుల 3.04 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.అయితే ఈ మొత్తం ఎవరికి చెందిందనేది తెలియాల్సి ఉంది.

Read More
Screenshot 20230909 091951 WhatsApp

“బాబు”గదికి ఏ.సి….

రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న అంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరోగ్య సమస్యలకు సంబంధించి వైద్యులు అందజేసిన కీలక నివేదిక అయన కుటుంబ సభ్యులను, పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.బాబు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు రాజమండ్రి ప్రభుత్వ వైద్యుల జైలు అధికారులకు అందజేసిన మెడికల్ రిపోర్ట్ బయటకు పొక్కడం పలురకాల వదంతులకు దారి తీసింది. చంద్రబాబుకి చర్మ సంబంధ సమస్యలు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది.చేతులు,…

Read More
babu 2

“బాబుకు” అలర్జీ…

రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న అంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్మ దురద (అలర్జి) సమస్యతో బాధపడుతున్నట్టు సమాచారం అందుతోంది. ఇదే విషయాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు.

Read More
babu 1

ముందస్తు బెయిల్….

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైకోర్టులో కొంత ఊరట లభించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు నాయుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీన్ని విచారించిన హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సోమవారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవ ద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లా అంగళ్లు అల్లర్ల కేసులోనూ గురువారం వరకు…

Read More
Screenshot 20231011 140656 WhatsApp

స్ట్రీట్ ఫైట్….

అంబెడ్కర్ కోనసీమ జిల్లాలో నడి రోడ్డు పై స్టూడెంట్స్ గ్యాంగ్ వార్ కలకలం రేపింది. అమలాపురం ఎస్. కె. బి.అర్.కాలేజీ లో డిగ్రీ విద్యార్థులు ఘర్షణకు దిగారు. బిఎ, బి కామ్ గ్రూపుల మధ్య గొడవ తలెత్తి గ్రూపులుగా విడిపోయి రోడ్డు పై కొట్టుకున్నారు. 5వ తేదీన జరిగిన ఫేర్వెల్ పార్టీలో ఒక పాట విషయంలో వివాదం తలెత్తింది.మంగళవారం సాయంత్రం కొంతమంది కావాలని మళ్ళీ గొడవకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. రెండు గ్రూపుల విద్యార్థులను ని అదుపులోకి…

Read More
3.5 crore

ఎన్నికల పొగతో “కట్టల’ పాములు….!

తెలంగాణాలో ఎన్నికల పొగ రాజుకోవడంతో “కట్టల” పాములు బయటకు వస్తున్నాయి. భాగ్యనగరం నలు చెరగులా బస్తాల కొద్ది నల్లదనం, అటుపట్టని హవాల సొమ్ము నాట్యం చేస్తోంది. ఎన్నికల నియమావళి వచ్చిందో లేదో ఒక చోటు నుంచి మరో చోటుకు తరలుతున్న డబ్బు మూటలు పోలీసులకు తనిఖిల్లో చిక్కుతున్నాయి. రంగా రెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భారత్ గార్డెన్స్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా కారులో 6.55లక్షల రూపాయలు తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇక బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3లో…

Read More
lokes cid 1

గూగుల్‌లో వెతికితే సరిపోయేది…

సిఐడి అధికారులు ఆరున్నర గంటల పాటు ఇన్నర్ రింగ్ రోడ్డుతో సంబంధం లేని 50 ప్రశ్నలు అడిగార‌ని, ఇందులో 49 ప్ర‌శ్న‌లు గూగుల్‌లో వెతికితే వ‌చ్చేవి ఉన్నాయ‌ని టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ చెప్పారు. సీఐడీ విచార‌ణ అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ మీరు ఏం చేస్తుంటారు? హెరిటేజ్‌లో పని చేసినప్పుడు మీ హోదా ఏంటి? ప్రభుత్వంలో మీరు ఏ బాధ్యతలు నిర్వహించారు? ఇటువంటి గూగుల్ లో దొరికేవ‌న్నీ త‌న‌ని విచార‌ణాధికారులు అడిగార‌ని తెలుపారు….

Read More
shrada ranbir

“బెట్టింగ్” సమన్లు…

మహా దేవ బెట్టింగ్ యాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి శ్రద్దా కపూర్ కు  ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్  సమన్లు జారీ చేసింది. ఈ యాప్ కేసులో నటుడు రణ్ బీర్ కపూర్ , హాస్య నటుడు కపిల్ శర్మ, నటీమణులు హ్యుమా ఖురేషి, హీనా ఖాన్ కూ ఈడి నుండీ సమన్లు జారీ అయ్యాయి.  హవాలా కార్యకలాపాలకు పాల్పడుతున్న  మహ దేవ్ యాప్ ప్రమోటర్లు సౌరబ్ చంద్ర శేఖర్, రవి ఉప్పల్ పై ఈడి కేసు నమోదు చేసిన…

Read More
Screenshot 20231006 225206 WhatsApp

ప్రమాదం…

హైదరాబాద్ లోని కెపిహెచ్‌బి మెట్రో స్టేషన్ సమీపంలో అగ్నిప్రమాదం సభవించింది. ఓ ఫర్నీచర్ షాపులో దట్టమైన పొగలతో మంటలు చెలరేగాయి. సమచారం అందుకున్న. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలు అర్పుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read More
IMG 20230924 WA0003

శ్రీవారి బస్సు చోరీ…

చిన్నా, చితక సామాన్లు ఎత్తుకుపోతే ఏం లాభం అనుకున్నారేమో అందుకే తిరుపతిలో దొంగలు ఏకంగా బస్సునే దొంగిలించారు. అదీ ఏడుకొండల స్వామి దర్శనానికి భక్తులను తీసుకువెళ్ళే తిరుమల శ్రీవారి ఉచిత ఎలక్ట్రికల్ బస్సు కావడం గమనార్హం. తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ బస్సును చోరీ చేశారు. ఈ ఎలక్ట్రికల్ బస్సు ఖరీదు సుమారు 2 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. చోరీ విషయాన్ని గుర్తించిన వెంటనే జిపిఎస్…

Read More