“పొత్తు”అంటే చెప్పుతో కొట్టండి…
బీజేపీ కార్యకర్తలారా, ఇకపై ఎవరైనా బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు ఉంటుందని చెప్పే వాళ్లను చెప్పుతో కొట్టండి అంటూ బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. తాండూరులో కేంద్రమంత్రితో కలిసి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించిన సంజయ్ పొత్తుపై మీడియాకు పదే పదే లీకులిచ్చే ఫాల్తు రాజకీయ నాయకులను సైతం చెప్పులతో కొట్టాలని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం నడుస్తోందన్నారు. అందులో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని…