president
శీతాకాలం”అతిధి”రాక..!
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిదికి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రానున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పొలీసులు తెలిపారు.ఈ నెల 18న సాయంత్రం 6:25 గంటలకు రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో హకీంపేట వైమానిక దళ శిక్షణ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలోకి 7 గంటలకు వస్తారు. ఆయా మార్గాల్లో రాష్ట్రపతి కాన్వాయ్‌కు సంబంధించి అధికారులు రిహార్సల్ నిర్వహించారు. సైబరాబాద్ సీపీ ఏకే మహంతి ఈ…
“రేవంత్” అనే నేను…
తెలంగాణ ఉద్యమ పార్టీ ధాటికి ఉనికి కోల్పోయిందనుకున్న చారిత్రిక కాంగ్రెస్ పార్టీకి తన యువ రక్తంతో జవసత్వాలు పోసి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అంటూ ఉరూరా చాటిన రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికైయ్యారు. అధిష్టానం ఆలోచనల మేరకు మూడు రోజుల పాటు ఉత్కంటభరితంగా సాగిన అధిష్టాన ఓడిపోత కార్యక్రమంలో చివరకు యువనేతనే ముఖ్యమంత్రి పదవి వరించింది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లుగా ఉన్న అనేక మంది డిల్లీలో జరిగిన మంతనాల్లో ఎన్ని ఎత్తులు వేసినా…
పుట్టపర్తికి రాష్ట్రపతి…
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 22వ తేదీ శ్రీసత్య సాయి జిల్లా పుట్టపర్తి సందర్శించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ వీడియో సమావేశం ద్వారా సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 22న మధ్యాహ్నం 12.30 గం.లకు బెంగుళూరు నుండి భారత వాయుసేన విమానంలో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి చేరుకుని అక్కడి…
ఈ సారి కాంగ్రెస్…
సినీ నటి, మాజీ ఎం.పి. విజయ శాంతి ఈ సారి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. తగిన ప్రాధాన్యత దక్కడంలేదని భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
సమాచార కమిషనర్”సమారియా”…
సీనియర్ ఐఏఎస్ అధికారి హీరాలాల్ సమారియా భారత సమాచార ముఖ్య కమిషనర్ గా నియమితులైయ్యారు. ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టారు. సమారియా సింగరేణి డైరెక్టర్ గా పనిచేశారు. విద్యుత్ రంగంలో ప్రస్తుత సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వంలో కార్మిక శాఖ విభాగంలో పని చేసి అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. రాజస్థాన్ రాష్ట్రం భారత్ పూర్ కి చెందినా హీరాలాల్ సమారియా ఉమ్మడి రాష్ట్రం లోని…
“మేడి”పాపం కేసీఅర్ దే…
కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ ప్రమాదానికి కేసీఆర్ కుటుంబమే కారణమని, కాళేశ్వరం అవినీతిలో మొదటి దోషి కేసీఆర్ కుటుంబమే అని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం పై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఈ బ్యారేజి ద్వారా లక్ష కోట్లను కేసీఆర్, కాంట్రాక్టర్లు దోచుకున్నారన్నారు. నాణ్యత లోపం వల్ల మెడిగడ్డ ప్రమాదం జరిగిందనీ, కేంద్ర హోంమంత్రి, గవర్నర్ ,ఎన్నికల కమిషన్ మేడిగడ్డ పై విచారణకి ఆదేశించాలనీ డిమాండ్…
“ఉత్తమ”అవార్డులు…
డిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన 69 వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తమ నటునిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా అలియాభట్ అవార్డులు అందుకున్నారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ చేతుల మీదుగా ఈ అవార్డులు అందజేశారు.
హెచ్‌సీఏలో సందడి షురూ..
ప్రతిష్టాత్మకమైన అదేవిధంగా వివాదాస్పదమైన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు, అతడి ప్యానెల్ సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు. ఉప్పల్ స్టేడియంలో నామినేషన్లు సమర్పించిన అనంతరం జగన్‌మోహన్ రావు తమ ప్యానెల్ పేరును ప్రకటించారు. యూనైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానెల్ నుంచి అధ్యక్షుడిగా జగన్‌మోహన్ రావు, ఉపాధ్యక్షుడిగా పి.శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా ఆర్. హరినారాయణ, సహాయ కార్యదర్శిగా నోయల్ డేవిడ్ (మాజీ క్రికెటర్), కోశాధికారిగా సి.జె శ్రీనివాస్,…
దిల్లీలో “పెద్దన్న”…
జి -20 సదస్సులో పాల్గొనేందకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దేశ రాజధాని ఢిల్లీ కి చేరుకున్నారు.
సభకు గ్రౌండ్ ఇవ్వరా…
ఈ నెల 16,17 తేదీలలో హైదరాబాద్ లో జరగబోయే సీడబ్ల్యూసీ సమావేశాలు, బహిరంగ సభ నేపథ్యంలో హాజరయ్యే జాతీయ నాయకుల భద్రత కల్పించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు డీజీపీ అంజనీ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 16, 17న తాజ్ కృష్ణలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతాయన్నారు. 17న విజయ భేరి బహిరంగ సభను నిర్వహిస్తున్నామని, దీనికి సంబంధించి భద్రతను అందించాలని డీజీపీని…
ముస్తాబైన రాజధాని…
జీ.20 శిఖరాగ్ర సమావేశాలకు దేశ రాజధాని డిల్లీ సర్వాంగసుందరంగా ముస్తాబైంది. ఈ 18 వ జీ.20 సదస్సుకు ఆతిధ్యం ఇస్తున్న భారత్ అతిధుల కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రగతి మైదానంలోని భారత్ అంతర్జాతీయ ప్రదర్శన సమావేశ మందిరం (ఐ.ఇ.సి.సి.)లో శని, ఆదివారాలలో ఈ సమావేశాలు జరుగుతాయి. ఇప్పటికే అంతర్జాతీయ ప్రతినిధుల రాకతో రాజధాని కళకళలాడుతోంది. ఈ రాత్రికి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దిల్లికి చేరుకుంటారు. కేంద్ర విదేశాంగ శాఖ…
జైలుకి ట్రంప్…
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చరిత్ర సృష్టించారు. ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారనే ఆరోపణల్లో ఆయన జార్జియాలోని ఫుల్టన్ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోయారు. ఆ దేశ చరిత్రలో మగ్‌షాట్ తీయించుకొన్న తొలి మాజీ అధ్యక్షుడిగా నిలిచారు. ఆయనకు ఖైదీ నంబర్ పి.01135809 కేటాయించారు. ఈ సందర్భంగా పోలీసు రికార్డుల కోసం ఆయన ఫొటో (మగ్‌షాట్) కూడా తీశారు. ఆయనపై డజనుకు పైగా ఆరోపణలున్నాయి.పోలీసులు నమోదు చేసిన రికార్డుల ప్రకారం ట్రంప్ ఎత్తు 6.3 అడుగులు. 97…
- 1
- 2