IMG 20240530 WA0030

మోడీ విద్వేషం…

ప్రధాని నరేంద్ర మోదీపై మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో విపక్షాలను లేదా ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని విద్వేషపూరిత, అనుచిత ప్రసంగాలతో ప్రధాని కార్యాలయం హుందాతనాన్ని తగ్గించారని ధ్వజమెత్తారు. లోక్‌సభ తుది దశ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో పంజాబ్‌ ఓటర్లకు ఓ లేఖ రాసిన మాజీ మన్మోహన్ మోడీ విభజన వాదాన్ని ప్రోత్సహించే ప్రసంగాలు చేశారని మండిపడ్డారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీని తుంగలో…

Read Full News
IMG 20240530 WA0013

ట్రాంప్ సరసన మస్క్..

ఈ సారి అమెరికా ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్‌ గెలిస్తే వైట్‌హౌస్‌లోకి మస్క్‌టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ను సలహాదారుడిగా నియమించుకోవాలని ట్రంప్‌ యోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందితే అడ్వైజర్‌ హోదాలో ఆయనను వైట్‌హౌస్‌కు ఆహ్వానించాలని నిర్ణయించారని విశ్వసనీయ వర్గాల ద్వారా వార్తలు బయటకు పొక్కుతున్నాయి. కానీ , దీనిపై ట్రాంప్ వైపు నుంచి ఎలాంటి ప్రకటన వెలువడ లేదు. అయితే, ట్రంప్‌, మస్క్‌ మాత్రం ఇప్పటికే పలు అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

Read Full News
IMG 20240530 WA0014

“చల్లని” కబురు…

దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు వినిపించింది. దేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అయిన నైరుతి రుతుపవనాలు (Southwest monsoon) దేశ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించినట్లు తెలిపింది. ఇవి గురువారం ఉదయం కేరళ (Kerala)ను తాకాయని ఐఎండీ (IMD) అధికారికంగా వెల్లడించింది. లక్షద్వీప్, కేరళలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే మూడు లేదా నాలుగు రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే…

Read Full News
IMG 20240527 WA0031

మళ్లీ ఉక్కపోత..

నైరుతి రుతుపవనాలు వచ్చే వరకు ఆంధ్ర ప్రదేశ్ లో వేడి, ఉక్కపోత కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు మరింత గరిష్టంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. బంగాళా ఖాతంలో తుఫాను ఏర్పడితే వర్షాలు కురిసి వాతావరణం చల్లబడు తుందని భావించారు. కానీ, “రెమాల్” తుఫాను బంగ్లాదేశ్ వైపు వెళ్లిపోవడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తెలంగాణ లోనూ జూన్ 1వ తేదీ వరకు పొడి వాతావరణం…

Read Full News
IMG 20240527 WA0030

కొత్త “గుర్తు” కోసం…

తెలంగాణా రాష్ట్ర అధికార చిహ్నాన్ని మార్చే ప్రయత్నాన్ని ప్రభుత్వం ముమ్మరం చేసింది. చిహ్నం మార్పు పై చిత్రకారుడు రుద్ర రాజేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. హైదరాబాద్ లో సోమవారం పలు నమూనాలను రేవంత్‌ పరిశీలించారు. తుది నమూనాపై పలు సూచనలు చేశారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ ఉత్సవాల నేపథ్యంలో పలు మార్పులకు కసరత్తు చేస్తోంది. ఆ రోజు కొత్త చిహ్నం ప్రకటించే అవకాశం ఉంది.

Read Full News
IMG 20240527 WA0026

బెదిరింపు…

దేశంలో ఇటీవల బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా, ముంబై లోని తాజ్ హోటల్, ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో, అప్రమత్తమైన పోలీసులు ఆయా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించగా అనుమానాస్పదంగా ఏమీ కనిపించక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ కాల్ ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చినట్టు గుర్తించారు. ఆ నిందుతుడి కోసం గాలిస్తున్నట్లు పోలిసులు తెలిపారు.

Read Full News
IMG 20240527 WA0029

ఏర్పాట్ల “పరేడ్”…

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లను సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పరిశీలించారు. కార్యక్రమం నిర్వహించనున్న పరేడ్ గ్రౌడ్స్ ను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. సభాప్రాంగణం లో ఇబ్బందులు లేకుండా కార్యక్రమం సజావుగా సాగేందుకు అన్ని శాఖల అధికారలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. స్టేజ్ ఏర్పాట్లు, బారికేడింగ్, సభాప్రాంగణంలో విధ్యుత్, మంచినీటి సరఫరా, మైక్ సిస్టం, ఎల్ ఇ డి స్ర్కీన్ ల ఏర్పాట్ల వివరాలను ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు….

Read Full News
gjrt fore

“డెత్ జోన్”..

గుజరాత్ రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వేసవి సెలవు దినాలలో ఆడుకోవడానికి, సేద తిరడానికి సాయం కాల సమయంలో గేమ్ జోన్ లోకి ఉల్లాసంగా వెళ్ళిన చిన్నారులు, వారి తల్లి దండ్రులు అగ్ని కీలలలో బూడిదగా మారారు. నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి నడుపుతున్న రాజ్‌కోట్ లోని టి. ఆర్. పి. గేమింగ్ జోన్‌ శనివారం “డెత్ జోన్” గా మారింది. ఈ భారీ అగ్నిప్రమాదంలో 35 మంది వరకు సజీవ దహనం అయ్యారు. అనేక…

Read Full News
rvnth tpt

తెలంగాణా మండపం…

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వ సహకారంతో ఉభయ తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి సాధించేలా వంతు కృషి చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారిని రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించి మనవడి మొక్కులు తీర్చుకున్నారు. వారికి ఆలయ అధికారుల స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేష వసంత సత్కరించారు. శ్రీవారి జ్ఞాపికను అందజేశారు. ఆలయం వెలుపల రేవంత్ రెడ్డి మీడియాతో…

Read Full News
bjp wrong cf

గుడిని కూల్చడం సాధ్యమా…?

నాలుగు వందల స్థానాలు గెలుస్తామని ఢంకా బజాయించి మరీ ప్రచారం చేస్తున్న భారతీయ జనతా పార్టీ అధినేతల మాటల్లో అవేశం కనిపించడం ఆశ్చర్య పరుస్తోంది. దేశంలో మూడో దశ పోలింగ్ పూర్తీ అయిన తర్వాత నరేంద్ర మోడీ, అమిత్ షా, ఆధిత్యనాథ్ లాంటి భాజాపా నేతల ప్రసంగాల్లో ఉహించని మార్పు కనిపిస్తోంది. ఈ నేతలు “ఇండియా కూటమి” పైనా, ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ మీద విసురుతున్న ఘాటైన విమర్శనాస్త్రాలు రాజకీయ పరిశీలకులను ఆలోచనల్లో పడేస్తున్నాయి….

Read Full News
IMG 20240520 WA0004

దుర్మరణం…

ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్- అబ్దొల్లహియన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రమాదంలో హెలికాప్టర్ లో ఉన్న వారంతా మృతి చెందారు. ఇరాన్, అజర్ బైజాన్ సరిహద్దుల్లో నిర్మించిన కిజ్ కలాసీ, ఖొదా ఫరీన్ అనే రెండు డ్యామ్‌ లను ఇబ్రహీం రైసీ ప్రారంభించారు. ఆ తర్వాత తబ్రిజ్ నగరానికి బయలు దేరారు. అప్పుడే హెలికాప్టర్ ప్రమాదానికి…

Read Full News
amit suprim c

“సుప్రీమ్”ని ప్రశ్నించే ధైర్యమా…

ఎనిమిది, తొమ్మిదేళ్ళ కిందటి వరకు దేశ ప్రజలకు ఎవరో కూడా తెలియని వ్యక్తి ఈ రోజు న్యాయ వ్యవస్థను తప్పుపట్టే స్థాయికి చేరారు. ప్రజా స్వామ్య దేశం అందులోనూ పదేళ్లుగా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నామన్న ఒకే ఒక ధైర్యంతో అధికారం,  పార్టీ బలం చూసుకొని షా  అదుపు లేకుండా మాట్లాడడం విస్మయానికి గురి చేస్తోంది. కేంద్రంలో బాధ్యత గల పదవిలో అంటూ దేశ ప్రధానికి కుడి భుజంగా పేరున్న అమిత్ షా ఏకంగా సుప్రీం కోర్టు ఆదేశాలు,…

Read Full News
IMG 20240516 WA0004

‘కులం’ తర్వాతే “పంచాయతీ”

రాష్ర్టంలో కుల గణన పూర్తి చేసి, బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ్ డిమాండ్ చేశారు. జూన్ నెలాఖరులో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటామన్నారని, బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలు పెడితే పచ్పి మోసగాడుగా రేవంత్ ను ప్రజలు భావిస్తారని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాసాని పేర్కొన్నారు. కుల గణన చేపట్టి, కులాల…

Read Full News
swaraj

ముమ్మర ప్రచారం..

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రతిష్టాత్మకమైన చేవెళ్ల పా నియోజకవర్గ పరిధిలో జై స్వరాజ్ పార్టీ అభ్యర్థి సుగురు శ్రీనివాస్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆయన వారం రోజులుగా పార్టీ కార్యకర్తలతో ప్రచార రథం పై గ్రామ గ్రామం తిరుగుతూ ఓట్లు అభ్యర్ధిస్తున్నారు. జై స్వరాజ్ పార్టీ ఆశయాలను, లక్ష్యాన్ని ప్రజలకు వువరిస్తున్నారు. పెన్ను గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు.

Read Full News