babu

కొంత ఊరట…

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కి ఏపి హై కోర్టులో కొంత ఉరట కనిపించింది.చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఆయన్ని ఈ నెల 18 వ తేదీ వరకు కస్టడీకి తీసుకోవద్దని సీఐడీని ఆదేశిందింది. అదేవిధంగా చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణ కూడా ఈనెల 19కి వాయిదా వేసింది. తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను…

Read More
IMG 20230902 WA0003

ఆ పనికి మసాజ్ ముసుగు…

హైదరాబాద్ లోని బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ లో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాలను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని స్పాలు, మసాజ్ సెంటర్ల పై యాంటీ ట్రాఫికింగ్ సెల్ స్పెషల్ బృందాలు మెరుపు దాడులకు దిగాయి. సీసీఎస్ టీమ్‌తో కలిసి బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్‌లో యాంటీ ట్రాఫికింగ్ సెల్ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది..శనివారం బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ లో స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు, క్రాస్ మసాజ్ లకు పాల్పడుతున్నట్లు…

Read More
aparna

నటి ఆత్మహత్య…

ప్రముఖ మలయాళ నటి అపర్ణా నాయర్‌ మృతి చెందారు. ఆమె తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం రాత్రి 7.03 గంటల సమయంలో అపర్ణ ఆత్మహత్యకు పాల్పడింది. అపర్ణా నాయర్‌ కరమన సమీపంలో ఉన్న తన ఇంట్లోని గదిలో ఉరి వేసుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు ఆమెను ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ప్రయివేటు ఆసుపత్రి నుంచే తమకు సమాచారం అందిందని పోలీసులు…

Read More
Screenshot 20230821 223229 Gallery

“నారాయణ” వేధిస్తున్నాడు…

ఆంధ్ర ప్రదేశ్ లో మాజీ మంత్రి , నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ తమ్ముడి భార్య ప్రియ మరో వీడియో లీక్ చేశారు. బావ నారాయణ, భర్త సుబ్రహ్మణ్యం మానసికంగా వేధిస్తున్నారని, ఇంటికి కరెంట్, వాటర్ సరఫరా లేకుండా చేస్తున్నారని వాపోయారు.. అలాగే కొన్ని పత్రాలపై భర్త దొంగ సంతకాలు పెట్టారని, క్యాన్సర్ తో బాధపడుతున్న కారణంగా విజయవాడ వరకు రాలేకపోతున్నట్టు , ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ వస్తే ఈ మేరకు ఫిర్యాదు చేయనున్నట్టు…

Read More
IMG 20230817 WA0034

“చిలుక” దొంగ….

ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ లో రామచిలుకలను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.135 చిలుకలను ఒక డబ్బాలో కుక్కి బస్సు స్టేపిని ఉండే చోట దాచిపెట్టాడు. బస్సు నుంచి వచ్చే వేడికి కొన్ని, గాలి అందక మరికొన్ని కలిపి మొత్తం 125 చిలుకలు ప్రాణం విదిచాయి.

Read More
IMG 20230817 WA0032

కడుపులో “కత్తెర”….

ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. స్వప్న అనే మహిళ ప్రసవం కోసం పెద్దాసుపత్రికి వెళితే, ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపులో కత్తెరను మరిచారు. బాధితరాలికి  కడుపు నొప్పి రావడంతో వైద్యుల నిర్వాకం బయట పడింది. స్వప్న కు తీవ్ర కడుపు నొప్పి కలగడంతో స్కాన్ చేయగా అసలు విషయం బయటపడింది. దీంతో మరోసారి ఆపరేషన్ చేసి కత్తెరను బయటకు తీశారు. దీనిపై హాస్పిటల్ సూపరింటెండెంట్ శశిధర్ ని ప్రశ్నించగా కడుపులో కత్తెర మరచిపోయిన విషయం నిజమేననిచెప్పారు….

Read More
Screenshot 20230817 123721 Video Player

“పోర్టు”లో పోరు….

ఆంధ్రప్రదేశ్ లోని గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేపట్టిన ఆందోళనలో పలువురు పోలీసులు, కార్మికులకు గాయాలయ్యాయి. పోర్టులోకి చొచ్చుకెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాటలో 10 మంది పోలీసులు సహా పలువురు కార్మికులు గాయపడ్డారు.

Read More
Screenshot 20230814 121737 WhatsApp 1

అలా జరిగింది…

సరదా కోసం సముద్రంలోకి వెళ్లి మునిగిపోతున్న ఇద్దరు యువకుల ప్రాణాలను పోలీసులు కాపాడారు. కర్నూలు జిల్లాకి చెందిన పుల్లేటి మహేష్, గోగుల రమణ తోటి యాత్రికులతో కలిసి బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన పెద్ద అలల తాకిడికి సముద్రంలోకి వెళ్ళి పోయారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది, మెరైన్ సిబ్బంది వెంటనే స్పందించి కానిస్టేబుల్ గణేష్, ఎం. వెంకటేశ్వర్లు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సముద్రంలోకి…

Read More
Screenshot 20230814 102558 Gallery

చిక్కిన “చిరుత”…

తిరుమల నడక దారిలో చిన్నారి లక్షితను చంపిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. రెండు రోజుల క్రితం చిన్నారి లక్షితను దాడి చేసి హతమార్చిన చిరుతను ట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ఆ పరిసరాల్లో బోనులు ఏర్పాటు చేయగా ఆదివారం అర్ధరాత్రి చిరుత ఓ బోనులో చిక్కినట్లు అధికారులు వెల్లడించారు.

Read More
Screenshot 2023 08 13 113730

గుండెపోటుతో…

హైదరాబాద్ నగర శివార్లలోని ఆటో నగర్ హ్యుందాయ్ షోరూం లో విషాదం చోటుచేసుకుంది. షోరూంలోని వాహన సర్వీసింగ్ విభాగంలో కారు రిపేర్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన ఓ మెకానిక్ అక్కడిక్కడే మృతి చెందాడు. అబ్దుల్లాపూర్ మెట్టు మండలం కొహెడకు చెందిన జంగారెడ్డి (36) ప్రతిరోజూ మాదిరిగానే షోరూంకి వచ్చి వాహనాల మెకానిక్ పనులు మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా ఓ వాహనాన్ని పరిశీలిస్తున్న జంగారెడ్డి అకస్మాత్తుగా కిందపడిపోయి కాసేపటికి చనిపోయాడు. ఒక్కసారిగా తీవ్రమైన గుండె నొప్పికి గురికావడం వల్ల ఇలా జరిగిందని…

Read More
jp c

దగ్ధం…

చందానగర్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గంగారం జేపి సినిమాస్ లో మంటలు చెలరేగాయి. అతి వేగంగా మంటలు వ్యాపించడంతో థియేటర్ లోని ఐదు స్క్రీన్ లలో పర్నిచర్, స్క్రీన్లు. ఇతర సామాగ్రి కాలిపోయాయి. మూడు ఫైర్ ఇంజన్ల లతో మంటలను అదుపుచేశారు. ఈ సినిమా హాలుకి అగ్నిమాపక శాఖ నుంచి సరైన అనుమతి లేదని తెలుస్తోంది.

Read More
Screenshot 2023 08 11 153928

జయప్రదకు జైలు…!

సినీ నటి, మాజీ ఎం.పి. జయప్రదకు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే, చెన్నైలోని అన్నా రోడ్ లో  జయప్రదకు ఒక సినిమా హాలు ఉంది. ఆ సినిమా హాలు నిర్వహణ బాధ్యతలను ఆమె సోదరుడు  రాజబాబు, అతని స్నేహితుడు రామ్ కుమార్ చూస్తుంటారు. అయితే, సిబ్బందికి జీత భత్యాలు, పి.ఎఫ్., ఇఎస్ఐ, వంటి ఇతర సదుపాయాలను సరిగా కల్పించాడంలేదని రిటైర్ అయిన ఒక ఉద్యోగి కార్మిక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు….

Read More
gold

ఎలా సాధ్యం…

ఎంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసినా, ఎన్ని రకాల స్కానింగ్ పరికరాలు అందుబాటులోకి తెచ్చినా అక్రమార్కుల ఆగడాలు మాత్రం అదుపు కావడం లేదు. శంషాబాద్ విమానాశ్రయంలో తాజాగా పట్టుకున్న బంగారమే ఉదాహరణ. దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుండి కస్టమ్స్ అధికారులు కిలోన్నరకు పైగా బంగారం స్వాధీనం చేసుకుకున్నారు.పట్టుపడ్డ వ్యక్తులు చాకచక్యంగా దుస్తుల్లో బంగారాన్ని అమర్చుకొని దర్జాగా విమానం దిగారు. కానీ, తనిఖీ ప్రాంతం వద్ద కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కారు. వీళ్ళ నుంచి…

Read More
nia

ఎన్ఐఏ సోదాలు…

కరీంనగర్‌లో, ఆదిలాబాద్‌లో ఎన్‌ఐఏ దాడులు జరుపుతోంది. నిషేధిత సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే సమాచారంతో ఈ దాదులు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ లో గురువారం తెల్లవారు జామున జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు చేపట్టింది.. నగరంలోని హుస్సేనీ కూరలో [ప్రాంతంలో స్థానిక పోలీసులతో కలిసి ఎన్ఐఏ సోదాలు చేసింది. తబ్రేజ్‌ అనే వ్యక్తికి పాపులర్ పార్టీ ఆఫ్ ఇండియా (పి ఎఫ్ ఐ) అనే నిషేధిత సంస్థతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఆ వ్యక్తి ఇంట్లో తనిఖీలు జరిపింది….

Read More
jitendr

హోం మంత్రితో జితేందర్ ….

సినియర్ పోలీసు అధికారి జితేందర్ హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీని కలిశారు. రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న జితేందర్ డైరెక్టర్ జనరల్ గా పదోన్నతి పొందిన సందర్భంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి ఆయనను అభినందించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను చేరాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, పోలీస్ సిబ్బందికి మార్గ నిర్దేశం చేయాలని సూచించారు.

Read More