“బాబుకు” అలర్జీ…
రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న అంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్మ దురద (అలర్జి) సమస్యతో బాధపడుతున్నట్టు సమాచారం అందుతోంది. ఇదే విషయాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు.
రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న అంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్మ దురద (అలర్జి) సమస్యతో బాధపడుతున్నట్టు సమాచారం అందుతోంది. ఇదే విషయాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా రాజమండ్రి కేంద్ర కారాగారం కేవలం కొన్ని రోజులుగానే వార్తల్లోకి ఎక్కుతోంది? దోమల మూలంగా ఒక ఖైదీ చనిపోవడం, ఖైదీల మధ్య గొడవలు తలెత్తడం వంటి ఘటనలు ఈ మధ్యనే ఎందుకు జరుగుతున్నాయి. ఇలా గతంలో కూడా జరిగినా ఆ సమాచారం బయటకు పొక్కలేదా ? మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండడంతో ప్రతీ ఒక్కరిలో ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జైలులో జరుగుతున్న సంఘటనలపై అక్కడ విధులు…
సిఐడి అధికారులు ఆరున్నర గంటల పాటు ఇన్నర్ రింగ్ రోడ్డుతో సంబంధం లేని 50 ప్రశ్నలు అడిగారని, ఇందులో 49 ప్రశ్నలు గూగుల్‌లో వెతికితే వచ్చేవి ఉన్నాయని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. సీఐడీ విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మీరు ఏం చేస్తుంటారు? హెరిటేజ్‌లో పని చేసినప్పుడు మీ హోదా ఏంటి? ప్రభుత్వంలో మీరు ఏ బాధ్యతలు నిర్వహించారు? ఇటువంటి గూగుల్ లో దొరికేవన్నీ తనని విచారణాధికారులు అడిగారని తెలుపారు….
అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ తెలుగు రాష్ట్రాల్లో ‘‘కాంతితో క్రాంతి’’ కార్యక్రమాన్ని చేపట్టింది. వివిధ జిల్లాల్లో పలువురు సంఘీభావం తెలిపారు. రాజమండ్రి లో నిర్వహించిన కార్యక్రమంలో నారా భువనేశ్వరి ప్రమిదలు వెలిగించి నిరసన లో పాల్గొన్నారు. ఆమెతో పాటు స్థానిక మహిళలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము సైతం బాబు కోసం, బాబుతో మేము అంటూ మహిళలు నినాదాలు చేశారు. తెలంగాణలో టిడిపి శ్రేణులు, సినీ దర్శకులు రాఘవేంద్ర రావు, నందమూరి రామకృష్ణ…
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ రాజకీయ పార్టీల పొత్తుల వ్యవహారం గందరగోళంగా మారుతోంది. పెద్ద పార్టీలతో చేతులు కలుపుతున్న పార్టీల వ్యూహాలు సామాన్యులకు అంతు పట్టడం లేదు. గత ఎన్నికలలో అంటకాగిన పార్టీలు ఈ సారి ఎడమొహం పెడమొహంగా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ శత్రువులుగా మారాయి. తెలంగాణ, అంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రాలో బిజెపితో కలిసి తిరిగిన జనసేన ఈ సారి రూటు మార్చింది. మొన్నటి వరకు…
అంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వింత పోకడలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక పార్టీ పై మరో పార్టీ అడ్డూఅదుపూ లేని ఆరోపణలకు దిగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో రాయలసీమ శైలిలో, మరికొన్ని సార్లు బెజవాడ తరహాలో ప్రసంగాలు సాగుతుంటే, ఇంకొన్ని సభల్లో ఏకంగా సినిమా డైలాగులను మరిపించే విధంగా మాటల తూటాలు పేలుతున్నాయి. తెలుగుదేశం నేతలపై మంత్రి రోజా చేస్తున్న ఘాటైన విమర్శలకు అదే స్థాయిలో రోజాపై టిడిపి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో…
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ చేపట్టిన “మోత మోగిద్దాం” కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలతో కలిసి నారా బ్రాహ్మిణి సైతం గంట మోగించి, ఈల శబ్దం చేశారు. ఆంధ్రా, తెలంగాణా ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో టిడిపి శ్రేణులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.
ఆంధ్రప్రదేశ్ లో కురు క్షేత్ర యుద్ధం జరగబోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నిరుపేదల వైపు నిలబడిన ప్రభుత్వానికి, పేదలను వంచించిన గత ప్రభుత్వానికి మధ్య యుద్ధం ఉంటుందని తెలిపారు. పేదలకు, పెత్తందారులకూ మధ్య యుద్ధం జరగనుందని పేర్కొన్నారు.అమరావతి పేరుతో స్కామ్, స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, నీరు-చెట్టు పేరుతో దోపీడీ చేసిన వారితో యుద్ధం జరగబోతుందని జగన్ అన్నారు. విజయవాడలో వరుసగా అయిదో ఏడాది వాహన మిత్ర నిధులను జగన్ విడుదల…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ? చంద్రబాబు అరెస్టు అనంతరం రాజమండ్రి జైలులో ఆయన్ని కలిసి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నట్టు ప్రకటించిన పవన్ ఎక్కడ ఉన్నారు? పార్టీ శ్రేణులతో బిజీగా ఉన్నారా? లేక సినిమా షూటింగుల్లో మునిగి పోయారా ? ఏ విషయం తెలియక “సేన” సైన్యం సందిగ్ధంలో ఉంది. వచ్చే నెలలో అయన వారాహి యాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో తెలుగదేశం పార్టీ పొత్తుకు సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు అనే విషయం చర్చనీయాంశంగా మారింది. టిడిపితో పొత్తు…
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి కొత్త కార్యక్రమానికి రంగం సిద్దం చేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు ఓదార్పు, ప్రజా సంకల్ప యాత్రల పేరుతో జనంలోకి వెళ్ళిన అయన ఈ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అయితే , ఈ సారి రాబోయే ఎన్నికల్లో జనంలోకి వెళ్లేందుకు అయన కొత్త పందాని అవలంభిచనున్నారు. వైసిపి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యక్రమాలను చూపుతూ ప్రజా…
ఆంధ్రప్రదేశ్ లో తెలుగదేశం, జనసేన మధ్య పొడపొచ్చలు వచ్చినట్టు కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు రిమాండ్ తో రాజమండ్రి కేంద్ర కారాగారానికి వెళ్ళగానే హుటహుటీన బాబుని జైలులో కలిసి వచ్చే ఎన్నికలలో టిడిపితో పొత్తు పెట్టుకుంటున్నట్టు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన సరళి మారిందా అనే సందేహం తలెత్తుతోంది. సుమారు 15 రోజులుగా చంద్రబాబుకు సంబంధించి పవన్ నుంచి ఒక్క ప్రకటన కూడా వెలుగు చూడక పోవడంతో ఆయా పార్టీ శ్రేణులు సందిగ్ధంలో పడ్డాయి.ఇటు బాబు…
ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న విద్వేష పూరిత రాజకీయాల గతంలో ఎప్పుడూ లేవని బ్రాహ్మణి ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జనసేన నాయకులు, పలు నియోజవర్గాల ఇంచార్జ్ లు నారా బ్రాహ్మణిని కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ రాష్ట్రంలో పరిస్థితులు రోజురోజుకూదిగజారుతున్నాయని, రాక్షస పాలనపై ఉమ్మడం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ, ఎవరూ చూడలేదని అన్నారు. చంద్రబాబుపై కేసు విషయంలో అన్ని డాక్యుమెంట్లు,…
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు, ఆసక్తికర కొత్త కొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి. మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీతో అంటకాగిన జనసేన చంద్రబాబు జైలులో ఉండగానే తెలుగుదేశంతో పొత్తు ఖరార చేసుకుంది. ఇదే సందర్భంలో బిజెపితోనూ సఖ్యతగా మెలుగుతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడం రాజకీయ పరిశీలకులను ఆలోచనల్లో పడేసింది. దీంతో తెలుగుదేశం, జనసేన కలసి ఎన్నికల బరిలోకి దిగితే…
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించి కొందరు ప్రముఖులు, రాజకీయ నేతలు స్పందించక పోవడం విస్మయం కలిగిస్తోంది. జాతీయ స్థాయిలో కొందరు నాయకులు ఆయనను ఏదో రూపంలో పరామర్శిస్తుంటే అయన దగ్గర పనిచేసిన అనేక మంది స్పందించక పోవడం చర్చనీయాంశంగా మారింది. మమత బెనర్జీ, అఖిలేష్, రజినీ కాంత్ వంటి వారు తమ సానుభూతి తెలిపారు. కానీ, ఆయనతో అంటకాగిన తెలుగు రాష్ట్రాల నేతలు మాత్రం ఎలాంటి ప్రకటన చేయక…
కక్షసాధింపు చర్యల్లో భాగంగానే విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడుని ప్రిజనరీ, సైకో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జైలు పాలు చేశాడని టీడీపీ అంగన్ వాడీ, డ్వాక్రా సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత వ్యాఖ్యానించారు.చంద్రబాబుని జైలుకు పంపారన్నజైలుకి పంపాలన్న ఏకైక లక్ష్యం తొ చేయని తప్పుకి ఆయన్ని అరెస్టు చేశారని ఆరోపించారు. సీబీఐ, ఈడీ సహా 38 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ రెడ్డే నాలుగేళ్లుగా కోర్టులకు హాజుకాకుండా తప్పించుకుంటున్నాడన్నారు. బాబాయ్ హత్యకేసు, కోడికత్తి…