IMG 20240311 WA0001

భాజపా లోకి…

తెలంగాణలో భారాసకు మరో ఎదురు దెబ్బ తగిలింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో పలువురు సీనియర్‌ నేతలు భాజపా గూటికి చేరారు. మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌ మాజీ ఎంపీలు సీతారాం నాయక్‌, గోడం నగేశ్‌, హుజూర్‌ నగర్‌, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యేలు శానంపూడి సైది రెడ్డి, జలగం వెంకట్రావు ఢిల్లీలో తరుణ్‌ చుగ్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నేతలు లక్ష్మణ్‌, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read Full News
chanakyam c

అంతుపట్టని”బాబు”చాణక్యం..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతోంది? ఒకప్పుడు జాతీయ రాజకీయాలను శాసించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాణక్యం ఎక్కడ దాచుకుంది? నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న”బాబు” కేవలం దశాబ్ద కాలంగా రాజకీయ తెరపై కనిపిస్తున్న అమిత్ షా కోసం ఎందుకు పడిగాపులు కాశారు? బాబు ఎన్.డి.ఏ. కన్వీనర్ గా  ఉన్నప్పుడు అసలు ఏం జరిగింది? ఆ పర్యవసానమే ప్రస్తుత ఫలితమా?  ఇలాంటి అనేక ప్రశ్నలకు ఆంధ్రా రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయి రాజకీయ…

Read Full News
IMG 20240310 WA0011

మిస్ వరల్డ్ “చెక్”…

ఈ సారి ప్రపంచ సుందరి-2024 కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ సుందరి కైవసం చేసుకుంది. ఆ దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రిస్టినా పిస్కోవా ఈ కిరీటాన్ని అందుకున్నారు. ముంబయి వేదికగా అట్టహాసంగా జరిగిన  వేడుకలో 112 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. టాప్-4లో క్రిస్టినా పిస్కోవా (చెక్ రిపబ్లిక్), యాస్మిన్ అజైటౌన్ (లెబనాన్), అచే అబ్రహాంస్ (ట్రినిడాడ్ అండ్ టుబాగో), లీసాగో చోంబో (బోట్స్వానా)లు నిలిచారు. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన పోటీలో కిరీటం…

Read Full News
IMG 20240308 WA0058

పాత బస్తీకి మెట్రో….

హైదరాబాద్ పాత బస్తీకి మెట్రో రైల్ పరుగు పెట్టనుంది. అఫ్జల్ గంజ్ ఎంబీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు 5.5 కిలో మీటర్ల మేర మెట్రో నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సుమారు 2వేల కోట్ల రూపాయల వ్యయంతో ఈ మెట్రో పనులు చేపడుతున్నారు. దీంతో పాత నగరం ప్రజలకు మెట్రో అందుబాటులోకి రానుంది. శంకుస్థాపన కార్యక్రమంలో ఎం.ఐ.ఎం. నేత, ఎం.పీ అససుద్దిన్ ఓవైసీ సహా పలువురు పాల్గొన్నారు.

Read Full News
brslrs cf

భారాస శాపమే ఎల్.ఆర్.ఎస్.

భారత రాష్ట్ర సమితి (భారాస) నేతలు ఇంకా ప్రత్యేక తెలంగాణ వాదాన్ని మరచిపోయినట్టు లేరు. తెలంగాణా ఏర్పడి పదేళ్ళయినా, అప్పటి నుంచి మొన్నటి వరకు అధికారం చెలాయించిన విషయాన్ని విస్మరించి ఇంకా ఉద్యమ సమయంలోని ఆలోచనలతో ప్రవర్తించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దశబ్ధం కిందటే  ప్రత్యేక తెలంగాణా ఏర్పడిందని, ఆ  రాష్ట్రంలో ఉంటున్నామనే విషయం తెలిసి కూడా అప్పట్లో రాజశేర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల హయాంలో తెలంగాణా కోసం వ్యవహరించినట్టు ఇప్పటి బి.అర్.ఎస్. నేతలు…

Read Full News
brslrs p 1

అంతే దేన్నైనా వ్యతిరేకిస్తామ్….!

తెలంగాణా రాష్ట్రంలో అధికార పక్షం పై కొద్ది రోజులుగా విపక్షం చేస్తున్న దాడి వెనుక వాస్తవాలు ఏమిటి? “ఈగల్ న్యూస్” ప్రత్యేక విశ్లేషణాత్మక కథనం… మీ కోసం..త్వరలో…

Read Full News
bahujan c

“దొర” గడీలోకి బహుజనులు…!

రాజకీయ ప్రత్యర్ధులు, రాజకీయ శత్రువులను గడీ దరిదాపుల్లోకి కూడా రానివ్వని గులాబీ దళపతి ఎత్తుగడల్లో మార్పునకు కారణం ఏమిటి? మొన్నటి ఎన్నికల వరకు ఒంటెత్తులతో తిరుగులేని అధికారం చెలాయించిన కేసీఆర్ ఆలోచనా విధానాన్ని ఎలా మార్చుకున్నారు? ఎన్నికల ఫలితాల తర్వాత ఫాం హౌస్ లో ఏలాంటి వ్యూహా రచనలు జరిగాయి? శాసన సభ ఎన్నికలలో ఘోర పరాజయం చవి చూసిన భారత రాష్ట్ర సమితి మనుగడ కోసం కేసీఆర్ మెట్లు దిగక తప్పడం లేదా? మొన్నటి వరకు…

Read Full News
IMG 20240304 WA0026

ఆర్ ఆర్ ఆర్….

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆదిలాబాద్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్న సీఎం నేరుగా ఫిల్మ్ సిటీకి వెళ్లారు. గంటకుపైగా రామోజీతో వివిధ అంశాలను చర్చించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్న తీరు, మారిన ప్రజాపాలన విధానాలపైనా మాట్లాడుకున్నారు. అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ సమకాలీన రాజకీయ పరిస్థితులను చర్చలు జరిపారు. లౌకికవాదాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీలు…

Read Full News
ali

నంద్యాల నుంచి”అలీ”..?

ఆంధ్రప్రదేశ్ లో జరగనున్నలోక్ సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులను ఖరారు చేసే కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. తాజాగా నంద్యాల, విజయనగరం, అమలాపురం, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను నిర్ణయించినట్టు తెలుస్తోంది. వీటిలో నంద్యాల స్థానాన్ని హాస్యనటుడు అలీ లేదా ఇక్బాల్ కు ఇచ్చే సూచనలు ఉన్నట్టు బలంగా వినిపిస్తోంది. అదేవిధంగా అనకాపల్లిలో గుడివాడ అమర్నాథ్, అమలాపురంలో ఎలీజా, విజయనగరానికి సిట్టింగ్ ఎంపీ చంద్రశేఖర్ పేర్లు ఖరారైనట్టు సమాచారం.

Read Full News
drug lishi

సస్పెన్స్….

రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో నిందితురాలిగా ఉన్న నటి లిషి ఎక్కడున్నారనేది ప్రశ్నార్ధకంగా మారింది. కేసు వెలుగు చూసిన నాటి నుంచి ఈ నటి తెరవెనక్కి వెళ్ళిపోవడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక, లిషి కనిపించడం లేదని ఆమె సోదరి కుషిత పోలీసులకు ఫిర్యాదు చేయడం అంతుపట్టకుండా ఉంది.

Read Full News