4th cf

నా నాలుగో పెళ్ళాం “జగన్”…

ప్రజా సమస్యల పై పోరాడాల్సిన రాజకీయ పార్టీ నేతలు వ్యక్తిగత వ్యవహారాలను తెరపైకి తీసుకురావడం వింతగా కనిపిస్తోంది. అదీ ఏదో చిన్నా చితకా సరదా వ్యాఖ్యలు కాదు.. ఏకంగా పెళ్ళిళ్ళు, పెళ్ళాల వరకు వెళ్ళడం రాజకీయ పరిపక్వత లోపాన్ని ఎత్తిచూపుతున్నాయి. సరిగ్గా ఇదే తంతు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ వైఎస్ జగన్ సారధ్యంలోని అధికార పార్టీ వైసీపీకి, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనెలా ఉంది. ముఖ్యమంత్రి జగన్…

Read Full News
IMG 20240228 WA0144

“టోల్”టెండర్ల పై విచారణ…

హైదరాబాద్ చుట్టూ నిర్మించిన అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండి పడేలా తక్కువ రేటుకు టెండర్లు కట్టబెట్టిన తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస రేట్ నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారని హెచ్ఎండీఏ అధికారులను ప్రశ్నించారు. అందులో ఎవరెవరి ప్రమేయముంది. ఏయే సంస్థలున్నాయి, ఎవరెవరు బాధ్యులెవరో అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రి…

Read Full News
tamil telug

తెలంగాణ భాష మహా మాధుర్యం..

“తెలంగాణ భాష అంటేనే క్లాసిక్ భాష” అని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. తెలంగాణ భాష మాట్లాడు తున్నప్పుడు చాలా ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. తెలుగు భాష, సంస్కృతి అంతటా వ్యాప్తి చెందాలని ఆకాంక్షించారు. రవీంద్ర భారతిలో జ‌రిగిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 16వ స్నాతకోత్సవంలో గవర్నర్‌ పాల్గొన్నారు. పలు కోర్సుల్లో పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి పట్టాలు అంద జేశారు. అనంత‌రం ఆమె మాట్లాడుతూ, తెలుగు భాషను ఇతర భాషలు మాట్లాడే ప్రజలందరికీ నేర్పించాలని…

Read Full News
IMG 20240228 WA0026

Great movement…

It was a very special moment for me to hand over wings to the four Indian astronaut-designates. They reflect the hopes, aspirations and optimism of 140 crore Indians said prime minister Narendra modi. India is proud of Group Captain Prasanth Balakrishnan Nair, Group Captain Ajit Krishnan, Group Captain Angad Pratap and Wing Commander Shubhanshu Shukla.

Read Full News
IMG 20240228 WA0007

“ఆరు”అమలు ఖాయం…

ప్రభుత్వాన్నికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సరే ఇచ్చిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పేద ప్రజలకు మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాలను రాష్ట్ర సచివాలయంలో ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వల్ల పథకాల ప్రారంభ వేదికను చేవేళ్ల నుంచి సచివాలయానికి మార్చినట్లు చెప్పారు. ‘‘కట్టెల పొయ్యి నుంచి మహిళలకు విముక్తి…

Read Full News
IMG 20240225 WA0007

ఛైర్మన్…

తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ గా సీనియర్ పాత్రికేయులు కె. శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. రెండు సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. గతంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు పదవిలో అల్లం నారాయణ కొనసాగారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో ఆయన రాజీనామ చేశారు. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో ఈ పదవిలో శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు.

Read Full News
24 c

24 అంటే 40-జనసేన “సినిమా” లెక్కలు…!

ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న శాసన సభ, లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి చేతులు కలిపిన తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఉత్కంఠకు తెరపడింది. రెండు పార్టీల మధ్య జరిగిన ఒప్పందంలో అక్కడున్న మొత్తం 175 నియోజక వర్గాలలో జనసేన కేవలం 24 స్థానాల్లోనే పోటీ చేయనుంది. అదేవిధంగా మూడు లోక్ సబ్ నియోజక వర్గాలలో “సేన” అభ్యర్ధులు బరిలోకి దిగుతారు. అయితే, ఇక్కడే “సైనికుల్లో” నిరాశ తలెత్తింది. అధికారమే లక్ష్యంగా, మార్పే…

Read Full News
IMG 20240223 WA0085 1

జాగిలాలది నిస్వార్థ ప్రేమ..

ఏ రకమైన షరతులు లేని నిస్వార్థ ప్రేమకు జాగిలాలు చక్కని నిదర్శనమని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్తా అన్నారు. మొయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ(ఐఐటిఏ)లో 23 వ పోలీసు జాగిలాల పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. ఈ కార్యక్రమంలో డిజిపి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాగిలాలు ఆప్యాయతకు, ప్రేమకు ప్రతీకలుగా అభివర్ణించారు. పోలీసులు దర్యాప్తు చేసి ఛేదించిన కేసులలో జాగిలాల పాత్ర కీలకమని అన్నారు….

Read Full News
Screenshot 20240223 173858 WhatsApp

27న మరో “రెండు”…

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా రూ.500కే గ్యాస్ సిలెండ‌ర్, తెల్ల‌ రేష‌న్ కార్డు ఉన్న ప్ర‌తి పేద‌వానికి 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ ఇచ్చే కార్య‌క్ర‌మాన్ని ఈ నెల 27వ తేదీన ప్రారంభించ‌నున్న‌ట్లు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజ‌రవుతార‌ని ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు. రాష్ట్రంలో ఉన్న చిక్కుముడులు విప్పుతూ, ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తున్నామ‌ని, ఇప్ప‌టికే మ‌హిళ‌ల‌కు ఉచిత…

Read Full News
IMG 20240217 WA0009

“కట్” చేస్తే..సస్పెండ్..

విద్యుత్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కుట్రలను సహించేది లేదని, రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్తును ప్రభుత్వం సరఫరా చేస్తోందని, ప్రభుత్వం తరఫున ఎక్కడా విద్యుత్తు కోతలను విధించటం లేదని సీఎం స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా…

Read Full News
IMG 20240221 WA0056

రాహుల్ తో ఎన్నారైలు…

వరంగల్ లోక్ సభ టికెట్ ఆశిస్తున్న అమెరికన్ ఎన్నారై చింత ప్రవీణ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసి యాత్రకు సంఘీభావం తెలిపారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని రాయబరేలీలో భారత్ జోడో న్యాయ యాత్రలో రాహుల్ ని కలిశారు. ‘నేను “ద్వేషం” యొక్క మార్కెట్‌లో “ప్రేమ” దుకాణాన్ని తెరుస్తున్నాను’, హక్కుల కోసం పోరాటం చెయ్ అని ప్రవీణ్ ను ఈ సందర్భంగా రాహుల్ ప్రోత్సహించారు. అమెరికా, యూకే, కెనడా, జర్మనీ, సింగపూర్ నుంచి వచ్చిన ఇండియన్ ఓవర్సీస్…

Read Full News
sanjy on brs

“పొత్తు”అంటే చెప్పుతో కొట్టండి…

బీజేపీ కార్యకర్తలారా, ఇకపై ఎవరైనా బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు ఉంటుందని చెప్పే వాళ్లను చెప్పుతో కొట్టండి అంటూ బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. తాండూరులో కేంద్రమంత్రితో కలిసి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించిన సంజయ్ పొత్తుపై మీడియాకు పదే పదే లీకులిచ్చే ఫాల్తు రాజకీయ నాయకులను సైతం చెప్పులతో కొట్టాలని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం నడుస్తోందన్నారు. అందులో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని…

Read Full News