revant nitin

గడ్గరీ తో….

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధిల్లీలో భేటి అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు అభివృద్ధి, రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా గుర్తింపు సహా పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణ లోని 15 రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా హైదరాబాద్ శ్రీశైలం ఫోర్ లైన్ ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాదు…

Read Full News
jagan rk

“ఆళ్ల”మళ్ళీ…

జగన్ పై కొండంత కోపం, వైకాపా పై చిర్రుబుర్రులు ఆడుతూ షర్మిలా సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీలో చేరిన మంగళగిరి శాసన సభ్యులు ఆళ్ల రామకృష్ణ రెడ్డి తిరిగి గోడకు తగిలిన బంతిలా వైసీపీ గొడుగు కిందకు చేరారు. అనేక రకాల నాటకీయ పరిణామాల మధ్య గత నెలలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఆయన తాజాగా జగన్ ని కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే, టిక్కెట్టు ముఖ్యం కాదని, మంగళగిరి స్థానం ముఖ్యమని అక్కడ వైసీపీ ఎవర్ని…

Read Full News
medarm hli

“గద్దెల” వద్దకు హెలీకాప్టర్..

మేడారం జాతర…ఇది తెలంగాణ “కుంభమేళా” గా ప్రత్యేక గుర్తింపు ఉంది. వన దేవతలను గద్దెల దగ్గకు తీసుకొచ్చి ప్రతిష్టించడం నుంచి మొదలుకొని మళ్ళీ వన ప్రవేశం చేయించడం వరకు అన్నీ ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారమే జరుగుతుంది. ఒకప్పుడు ఎడ్ల బండ్లతో జరిగిన జాతర ఇప్పుడు హెలీకాప్టర్ స్థాయికి చేరుకుంది. ఈసారి కూడా మేడారం భక్తులకు హెలీకాప్టర్ సేవలు అందుబాటు లోకి వచ్చాయి.ఈ నెల 21 నుంచి 25 వరకు హనుమకొండ నుంచి హెలికాప్టర్ సేవలు ఏర్పాటు…

Read Full News
revnth amrapl

త్వరగా చేయండి….

మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై నానక్ రామ్ గూడ లోని హెచ్ఎండీఏ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, వీలైనంత తొందరగా మూసీ నది శుద్ధి ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ ఉండేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అధికారులకు పని విభజన చేసి, సరైన…

Read Full News
IMG 20240217 WA0028

“పీచు”కు మంగళం..!

పిల్లలను, యువతను చవులురించే పీచు మిఠాయి అమ్మకాలపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో పీచు మిఠాయి విక్రయాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పీచు మిఠాయిలో క్యాన్సర్ కారక రసాయనాలను వాడుతున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి ఎం.సుబ్రమణియన్ తెలిపారు.ఎవరైనా ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా పీచు మిఠాయి విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Read Full News
IMG 20240217 WA0021

వెల్లికి”కెమెరా”కాపలా…

మార్కెట్లో వెల్లిపాయల ధరలు విపరీతంగా పెరిగాయి. అల్లం,వెల్లుల్లి ధరలు వింటేనే ఘాటు నషాళానికి ఎక్కుతోంది.ప్రస్తుతం వెల్లుల్లి కిలో ధర 500 రూపాయల దగ్గర కొండెక్కి కూర్చొని సామాన్యులను వెక్కిరిస్తోంది. అటు అల్లం కూడా కిలో 300 నుంచి 350 రూపాయలకి చేరింది. దీంతో ఈ పంట పొలాల పై దొంగల కన్ను పడింది. కొన్ని చోట్ల దుండగులు ఎత్తుకెళ్తున్నారు. దీంతో పంటను కాపాడుకోవడం కోసం రైతులు పొలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఉల్లి పంటకు పేరుగాంచిన…

Read Full News
IMG 20240217 WA0019

దూసుకెళ్లిన “ఎఫ్‌14”..

జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. వాతావరణ ఉపగ్రహం ఇన్‌శాట్‌-3డీఎస్‌ ను మోసుకెళ్లే జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 14 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. తిరుపతి జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌లో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. గతంలో ప్రయోగించిన ఇన్‌శాట్‌-3డీ, ఇన్‌శాట్‌-3డీఆర్‌ ఉపగ్రహాలకు కొనసాగింపు గానే ఇన్‌శాట్‌-3డీఎస్‌ని పంపుతున్నట్లు ఇస్రో వెల్లడించింది. సుమారు 2,275 కిలోల బరువైన ఇన్‌శాట్‌-3డీఎస్‌ ఉపగ్రహంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్ లు ఉన్నాయి. ఈ పేలోడ్ లు వాతావరణ అంచనా,…

Read Full News
IMG 20240216 WA0033

రైతులపై”కర్ణా”అస్త్రం..

కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ)కి చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌తో ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చిన పంజాబ్‌ రైతులపై పోలీసులు ‘సోనిక్‌ ఆయుధాల’ను ప్రయోగించారు. ఒకే దిశలో కర్ణభేరీలు పగిలేలా శబ్దాలను విడుదల చేయడం సోనిక్‌ ఆయుధాల ప్రత్యేకత. లాంగ్‌ రేంజ్‌ అకూస్టిక్‌ డివైజ్‌(ఎల్‌ఆర్‌ఏడీ)గా పిలిచే సోనిక్‌ ఆయుధాలను సాధారణంగా సముద్రపు దొంగలకు హెచ్చరికలు జారీ చేయడానికి వినియోగిస్తుంటారు. కొన్ని దేశాల్లో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు వాడుతున్నారు. అమెరికా సైన్యం అమ్ముల పొదిలో 2000 సంవత్సరం నుంచే సోనిక్‌ ఆయుధాలుండగా 2013లో ఢిల్లీ…

Read Full News
IMG 20240216 WA0018

అలాంటిది ఏమీ లేదు…

”రాజధాని ఫైల్స్” సినిమా రిలీజ్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. రాజధాని ఫైల్స్ విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్‌లు, రికార్డ్‌లు సక్రమం గానే ఉన్నాయని కోర్టు చెప్పింది. అయితే, ఈ చిత్రం విడుదలను నిలిపి వేయాలంటూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా నిన్న కోర్టు స్టే విధించింది. మరోసారి శుక్రవారం విచారణకు రాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అక్కడి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా సినిమా ఉందని పిటిషన్…

Read Full News
jayaprada3

అరెస్టుకు రంగం..

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదను అరెస్టు చేయాలంటూ ఉత్తరప్రదేశ్ లోని రాంపుర్ ప్రజా ప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల వారెంట్ జారీ చేసింది. 2019 లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆమెపై రెండు కేసులు నమోదు కాగా, వాటికి సంబంధించి ఆరు సార్లు జయప్రదకు కోర్టు నోటీసులు జారీ చేసింది. అయినా, విచారణకు ఆమె గైర్హాజరు కావడంతో కోర్టు తీవ్రంగా పరిగణించింది. దీంతో, ఆమెను అరెస్ట్ చేసి ఈ నెల 27న న్యాయస్థానం ముందు హాజరు…

Read Full News
judgs

ఆ మార్గం తప్పు…

ఎలక్టోరల్ బాండ్స్ స్కీం పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ స్కీం ప్రాథమిక హక్కులను హరిస్తుందని 5 గురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెల్లడించింది. ఎలక్టోరల్ బాండ్స్ ను రద్దు చేయాలని ధర్మాసనం తీర్పుఇచ్చింది. విరాళాలు ఇచ్చే దాతల వివరాలు గోప్యంగా ఉంచటం సరైన పద్ధతి కాదని తెలిపింది. అలాగే ఇది సమాచార హక్కు చట్టం ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం ఒకరకంగా క్విడ్…

Read Full News
gulf modi

ఒప్పందాలు సరే.. కార్మికుల సంగతి…

ప్రధాని నరేంద్ర మోదీ  రెండు రోజులు అబుదాబిలో పర్యటించిన సందర్భంగా యూఏఈ దేశంతో ఎనిమిది వ్యాపార  ఒప్పందాలు చేసుకున్నారు, కానీ  గల్ఫ్ కార్మికుల సంక్షేమం గురించి మాత్రం పట్టించుకోలేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, ఎన్నారై సెల్ చైర్మన్, అంబాసిడర్ బి.ఎం. వినోద్ కుమార్, కన్వీనర్ మంద భీంరెడ్డి వ్యాఖ్యానించారు. గల్ఫ్ దేశాలలో 88 లక్షల మంది వలస కార్మికులు నివసిస్తున్నారని, వారికి కేంద్ర ప్రభుత్వం సామాజిక భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. గల్ఫ్ దేశాల అభివృద్ధిలో పాలుపంచుకుంటూ స్వదేశానికి అత్యధిక…

Read Full News
rajiv revnth

రాజీవ్ విగ్రహం…

బి.ఆర్.అంబేద్కర్ సచివాలయం ఎదురుగా ఉన్న స్థలంలో భారతరత్న, మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన  చేశారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సోనియా గాంధీని ఆహ్వానిచానున్నట్టు రేవంత్ తెలిపారు.

Read Full News