IMG 20240403 WA0024

ఆదుకొనే బాధ్యత …

గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గల్ఫ్ జెఏసీ బృందం కృతజ్ఞతలు తెలిపింది.గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు గల్ఫ్ దేశాలలో మృతి చెందిన వలస కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపును ప్రారంభం చేసినందుకు తెలంగాణ గల్ఫ్ కార్మికుల ఐక్య కార్యాచరణ సమితి (గల్ఫ్ జెఏసి) బృందం ముఖ్యమంత్రిని కలిసి హర్షం వ్యక్తం చేసింది. ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం ఏర్పడిన వంద…

Read More
dandplaym c

ప్రభుత్వంలో “దండుపాళ్యం”ముఠా…!

గత పదేళ్ళుగా భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పాలనలో సాగిన తెర వెనుక భాగోతాలు ఒక్కోక్కటిగా వెలుగు చూడడం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. శాసన సభ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన గులాబీ దళం ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఎంతోకొంత లబ్ధి పొందేందుకు నానా తంటాలు పడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టే వరకు కాళేశ్వరం, ధరణి వంటి అంశాలలో లోసుగుల వ్యవహారాలు మాత్రమే బయటకు పొక్కాయి. కానీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు…

Read More
IMG 20240331 WA0004

కాంగ్రెస్ లోకి ” కడియం”..

భారత రాష్ట్ర సమితి నేత కడియం శ్రీహరి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఏఐసీసీ ఇంచార్జి దీపాదాస్ మున్షీ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో శ్రీహరి సహా అయన కుమార్తె కావ్య కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చకున్నారు.

Read More
del jail c

ఢిల్లీ”పీఠాని”కి గురి -“జైలు”తో సరి…!

పదేళ్లుగా తెలంగాణా రాష్ట్రం పై తిరుగులేని అధికారాన్ని చెలాయించిన భారత రాష్ట్ర సమితి మరికొంత కాలంలోనే జాడ లేకుండా పోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకప్పటి మందీ మార్భలాన్ని చూసుకొని ఆ పార్టీ అధినేత చంద్రశేఖర్ రావు ఆయన అనుచరగణం ఏకంగా ఢిల్లీ పీఠం పైనే కన్ను వేసింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఉద్యమ పార్టీగా జనంలో నాటుకు పోయిన తెలంగాణా రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ని కాస్తా అనూహ్య రీతిలో భారత రాష్ట్ర సమితి (భారాస)గా…

Read More
revnth krisnredy scaled

రేవంత్ తో…

సినీ నిర్మాత అచ్చిరెడ్డి, సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.

Read More
break c

ప్రజలపై అక్కసు-ప్రభుత్వం పై”కుట్ర”

ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో సత్తా చూపేందుకు ఎన్ని హామీలైనా గుప్పించవచ్చు. ప్రత్యర్థి పార్టీ పై రాజకీయ విమర్శలూ చేయొచ్చు. కొన్నేళ్ల కిందట వరకు ఎన్నికల తెరపై ఇదే తంతు కనిపించేది. రానురానూ అది కాస్తా వ్యక్తిగత వ్యవహారాల్లోకి వెళ్ళింది. దశాబ్ద కాలంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజా సమస్యల ముచ్చట పక్కనపెట్టి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం సర్వ సాధారణమైంది. ఎన్నికల్లో గెలిచిన పార్టీనీ, దాని నాయకులను ఓడిన నేతలు శత్రువులుగా చూడడం పరిపాటైంది. అధికార…

Read More
IMG 20240308 WA0058

పాత బస్తీకి మెట్రో….

హైదరాబాద్ పాత బస్తీకి మెట్రో రైల్ పరుగు పెట్టనుంది. అఫ్జల్ గంజ్ ఎంబీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు 5.5 కిలో మీటర్ల మేర మెట్రో నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సుమారు 2వేల కోట్ల రూపాయల వ్యయంతో ఈ మెట్రో పనులు చేపడుతున్నారు. దీంతో పాత నగరం ప్రజలకు మెట్రో అందుబాటులోకి రానుంది. శంకుస్థాపన కార్యక్రమంలో ఎం.ఐ.ఎం. నేత, ఎం.పీ అససుద్దిన్ ఓవైసీ సహా పలువురు పాల్గొన్నారు.

Read More
IMG 20240304 WA0026 scaled

ఆర్ ఆర్ ఆర్….

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆదిలాబాద్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్న సీఎం నేరుగా ఫిల్మ్ సిటీకి వెళ్లారు. గంటకుపైగా రామోజీతో వివిధ అంశాలను చర్చించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్న తీరు, మారిన ప్రజాపాలన విధానాలపైనా మాట్లాడుకున్నారు. అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ సమకాలీన రాజకీయ పరిస్థితులను చర్చలు జరిపారు. లౌకికవాదాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీలు…

Read More
IMG 20240228 WA0144 scaled

“టోల్”టెండర్ల పై విచారణ…

హైదరాబాద్ చుట్టూ నిర్మించిన అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండి పడేలా తక్కువ రేటుకు టెండర్లు కట్టబెట్టిన తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస రేట్ నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారని హెచ్ఎండీఏ అధికారులను ప్రశ్నించారు. అందులో ఎవరెవరి ప్రమేయముంది. ఏయే సంస్థలున్నాయి, ఎవరెవరు బాధ్యులెవరో అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రి…

Read More
IMG 20240228 WA0007

“ఆరు”అమలు ఖాయం…

ప్రభుత్వాన్నికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సరే ఇచ్చిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పేద ప్రజలకు మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాలను రాష్ట్ర సచివాలయంలో ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వల్ల పథకాల ప్రారంభ వేదికను చేవేళ్ల నుంచి సచివాలయానికి మార్చినట్లు చెప్పారు. ‘‘కట్టెల పొయ్యి నుంచి మహిళలకు విముక్తి…

Read More
Screenshot 20240223 173858 WhatsApp

27న మరో “రెండు”…

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా రూ.500కే గ్యాస్ సిలెండ‌ర్, తెల్ల‌ రేష‌న్ కార్డు ఉన్న ప్ర‌తి పేద‌వానికి 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ ఇచ్చే కార్య‌క్ర‌మాన్ని ఈ నెల 27వ తేదీన ప్రారంభించ‌నున్న‌ట్లు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజ‌రవుతార‌ని ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు. రాష్ట్రంలో ఉన్న చిక్కుముడులు విప్పుతూ, ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తున్నామ‌ని, ఇప్ప‌టికే మ‌హిళ‌ల‌కు ఉచిత…

Read More
IMG 20240217 WA0009

“కట్” చేస్తే..సస్పెండ్..

విద్యుత్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కుట్రలను సహించేది లేదని, రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్తును ప్రభుత్వం సరఫరా చేస్తోందని, ప్రభుత్వం తరఫున ఎక్కడా విద్యుత్తు కోతలను విధించటం లేదని సీఎం స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా…

Read More