దొడ్డి దారులు – దొంగల ముఠా..!

brs hiway c

ఉద్యమ పార్టీ పేరుతో దశాబ్ద కాలం తెలంగాణ పై తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన భారత రాష్ట్ర సమితి రాష్ర్టంలో రహదారుల అభివృద్ధికి సమాంతరంగా గుట్టు చప్పుడు కాని “దొడ్డి దారులు” కూడా బార్లా తెరిచింది. కవిత నాయకత్వంలో తెలంగాణా నుంచి ఢిల్లీ వరకు ఏకంగా “మద్యం” జాతీయ రహదారిని ఏర్పాటు చేసి, రాష్ట్రంలో అక్రమ వసూళ్ల కోసం కొందరు అవినీతి ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను ఎంచుకొని పోలీసులతోనే “దొంగల ముఠా”ను తయారు చేసింది. ఈ ముఠా కోసం రాష్ట్రం లో అనేక దొడ్డి దారులను ఏర్పాటు చేసిన ఘనత కేసిఆర్,కేటీఆర్ నేతృత్వం లోని భారాస ప్రభుత్వానికే దక్కిందనే ఘాటైన విమర్శలు వస్తున్నాయి.

kavit cell
ఫార్మాట్ చేసినట్టు చెబుతున్న
సెల్ ఫోన్ లతో కవిత…

తెలంగాణలో తమ ఆధిపత్యాన్ని ఎరగా చూపుతూ వివిధ రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులను, మద్యం వ్యాపారులను, ఆడిటర్లను చెప్పుచేతల్లో పెట్టుకొని కోట్ల రూపాయల గోల్ మాల్ కు పాల్పడి కవిత తెలంగాణా ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టారని వ్యాఖ్యలు మారుమోగుతున్నాయి. భారాస ఆగడాలకు తీహార్ జైలు గోడల మధ్య ఉన్న  కవిత నిలువెత్తు సాక్ష్యమనే విమర్శలు గులాబీ నేతలను పట్టి పీడిస్తున్నాయి. ఇంట్లో కళ్ళ ముందే కూతురు రూపంలో పెరిగిన అక్రమాల ఆడబిడ్డ అసలు రంగు బయట పడడంతో కేసీఆర్ సైతం నివ్వెర పోయినట్టు కనిపిచింది అందుకే కేజ్రివాల్ అరెస్టు అయ్యే వరకు కూతురు అరెస్టుపై కేసీఆర్ నోరు మెదపని పరిస్థితి చోటుచేసుకుంది.

కూతురుని పరమర్శించని కెసిఆర్….

kcr spech

ఇక, గత ప్రభుత్వం చేసిన మరో ఘోర తప్పిదం పోలీసు యంత్రాంగంలో దొంగల ముఠాని పెంచి పోషించడం. జనం పై తెలంగాణా ముసుగు తొడిగి, విపక్షాల ఊసే లేకుండా చేసి, నిజాయితీ గల అధికారులను లూపు లైన్లలోకి నెట్టేసి, పదవీ విరమణ చేసిన వారిని అనుయాయులుగా మలచుకొని, ఖాకీలనే “దోపిడీ దొంగలు”గా మార్చిన వైనం “ఒంటెత్తు” ప్రభుత్వానికే దక్కింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత వరకు పోలీసు దొంగలను ప్రభుత్వమే పోషించిన దాఖలాలు లేవు. అలాంటి ఆలోచన కురువృద్దులైన ఏ పార్టీ నేతలకు కుడైంట వరకు రాలేదు. తమకు తెలంగాణలో తిరుగు లేదని, ఎవరూ ప్రశ్నించలేరనే ధీమాతో అక్రమ సామ్రాజ్యానికి పోలీసుల్నే పహారాకు నియమించుకోవడం గమనార్హం.తెలంగాణాలో ప్రభుత్వం మారడంతో ఒక్కసారిగా “గులాబీ పాలన” గుట్టు రట్టయింది. సంఘ విద్రోహ శక్తులు, మావోల కదలికలపై నిఘా వేయాల్సిన నైతిక బాధ్యత గల ప్రతేక నిఘా విభాగాన్ని వసూళ్లు, బెదిరింపుల అడ్డాగా మార్చడం మహా దుర్మార్గం. ఎస్ఐబి వల వేసుకొని ఈ ముఠా చేసిన ఆగడాల వల్ల అనేక మంది వ్యాపారులు,రాజకీయ నాయకులు ఆర్థికంగా వందల కోట్ల రూపాయలు నష్ట పొగా, సంపన్నుల ఫోన్ ట్యాపింగ్ ల మూలంగా కుటుంబాలు కూలిపోయి పరువు బజారున పడింది. ఈ ఘాతుకాలకు పోలీసులను పురికొల్పింది ఎవరనేది తెరవెనుక రహస్యం. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై ఇదే తరహాలో విచారణ సాగిస్తే మాత్రం సినిమాల్లో “విలన్”చివరికి దొరికినట్టు “పెద్దోడు- చిన్నోడు” రూపంలో నేతలు ఖచ్చితంగా  బయట పడే అవకాశం ఉందని రాజకీయ, నేర పరిశోధకులు చెబుతున్నారు. ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియ మొదలు కావచ్చని తెలుస్తోంది. మరో ముఖ్య విషయం ఏమిటంటే కన్న కూతురు జైలుకు వెళ్ళి నెలలు గడుస్తున్నా ఓ తండ్రిగా కెసిఆర్ మాత్రం ఇంత వరకు తిహార్ జైలులో కవితను కలవక పోవడం కొసమెరుపు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *