IMG 20240403 WA0024

ఆదుకొనే బాధ్యత …

గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గల్ఫ్ జెఏసీ బృందం కృతజ్ఞతలు తెలిపింది.గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు గల్ఫ్ దేశాలలో మృతి చెందిన వలస కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపును ప్రారంభం చేసినందుకు తెలంగాణ గల్ఫ్ కార్మికుల ఐక్య కార్యాచరణ సమితి (గల్ఫ్ జెఏసి) బృందం ముఖ్యమంత్రిని కలిసి హర్షం వ్యక్తం చేసింది. ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం ఏర్పడిన వంద…

Read More
dandplaym c

ప్రభుత్వంలో “దండుపాళ్యం”ముఠా…!

గత పదేళ్ళుగా భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పాలనలో సాగిన తెర వెనుక భాగోతాలు ఒక్కోక్కటిగా వెలుగు చూడడం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. శాసన సభ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన గులాబీ దళం ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఎంతోకొంత లబ్ధి పొందేందుకు నానా తంటాలు పడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టే వరకు కాళేశ్వరం, ధరణి వంటి అంశాలలో లోసుగుల వ్యవహారాలు మాత్రమే బయటకు పొక్కాయి. కానీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు…

Read More
press

సమస్యలు సమ్మతమే…

దేశ వ్యాప్తంగా మీడియా సంస్థలు, జర్నలిస్టుల సంక్షేమం కోరుతూ, షహీద్ భగత్ సింగ్ వర్ధంతి రోజైన మార్చ్ 3న, “జర్నలిస్ట్స్ డిమాండ్ డే”కు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యూజే) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డికి టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్…

Read More
kavit kejri pc

సౌత్ గు”లాబీ” ఉచ్చులో కేజ్రీవాల్ …!

వందల కోట్ల కుంభకోణంతో ఢిల్లీ నుంచి తెలంగాణా వరకు కుదిపేసిన ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ కవిత కోఠరీలో చిక్కుకున్నారా…? అందుకే దేశంలో తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో అరెస్టు అయ్యారా..? “ఈగల్ న్యూస్” ప్రత్యేక కథనం .. మీ కోసం..

Read More
brs natnl cc

మూలిగే “బిఆర్ఎస్”పై “మందు సీసా”…!

తెలంగాణా శాసనసభ ఎన్నికలకు ముందు కళ్ళాలు లేని గుర్రంలా పరుగులు తీసిన భారత రాష్ట్ర సమితి ఆ ఎన్నికల ఫలితాల అనంతరం సావడికే పరిమితమైంది. అధికారంలో ఉన్నప్పుడు అంతులేని ఆలోచనలతో రంకెలేసిన భారాస అధినేత, ఆయన అనుచరగణం ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పదేళ్ళ తిరుగులేని పాలనలో జరిగిన అవినీతి,అక్రమ వ్యవహారాలు ఒక్కసారిగా గుప్పుమనడం భారాస మనుగడకు తలనిప్పిగా మారడం ఒక సమస్య అయితే, ఏకంగా పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత…

Read More
IMG 20240223 WA0092

“తూచ్ తొండి”అంటే కష్టం..

ప్రజాస్వామ్యంలో సామన్యులైనా, బాధ్యత గల స్థానంలో ఉన్న వారెవరైనా సరే కోర్టులు, విచారణ సంస్థల ఆదేశాలకు తల వంచాల్సిందే. ఆరోపణల పై అధికారుల సందేహాలను నివృత్తి చేయాల్సిందే. చట్ట బద్ధంగా వ్యవహరించే అధికార యంత్రాంగానికి సహకరించాలి. సహకరించి తీరాలి. అంతేగానీ, అక్రమ అరెస్టు అనీ, వేధింపులు అంటూ రచ్చ చేయాలని ప్రయత్నించడం సబబు కాదు. లిక్కర్ స్కాంలో కవిత ప్రమేయం ఉందంటూ తలా,నోరు బాదుకొని చివరికి కట్టుదిట్టమైన ఆధారాలతో కవితను అరెస్టు చేసిన వాస్తవం తెలిసి కూడా…

Read More
IMG 20240316 WA0033

జపాన్ బృందం…

జపాన్ కి చెందిన పలువురు ఔత్సాయిక పారిశ్రామిక వేత్తల బృందం ప్రతిష్టాత్మకమైన హైదారాబాద్ ఐఐటీ క్యాంపస్ ని సందర్శించింది.

Read More
IMG 20240311 WA0010

త్వరలో నర్సింగ్ డైరెక్టర్…

రాష్ట్రంలో నర్సింగ్ డైరెక్టరెట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చిస్తామన్నారు. సికింద్రాబాద్ న్యూ బోయగూడలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 1కోటి 50 లక్షల రూపాయలతో ఆధునికరించిన భవనంలో ఏర్పాటు చేసిన జాతీయ మిడ్ వైఫరీ శిక్షణ సంస్ధను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నార్సింగ్ విద్యలో మిడ్ వైఫరీలో శిక్షణ తీసుకున్న వారు 83% ప్రసూతి…

Read More
rathd sitaka c

“సేవ” కోసం ఆరాటం…

తెలంగాణలో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్ధుల వేటలో ఉన్నాయి. ఈ సారి రాష్ట్రంలో అధికారం  కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉండడం, బారత రాష్ట్ర సమితి నుంచి ఒక్కొక్కరు కాంగ్రెస్, బిజెపి వైపు అడుగులు వేయడంతో వివిధ జిల్లాల్లో ఆశావాహుల సంఖ్య అధికామవుతోంది. కాంగ్రెస్, భారాస, బిజెపిలలోని సీనియర్ నేతలు, గత శాసనసభ ఎన్నికల్లో టికెట్లు ఆశించి ఆయా పార్టీల అధినేతల బుజ్జగింపులు, హామీలతో వెనక్కి తగ్గిన నాయకులు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో…

Read More
IMG 20240228 WA0144

“టోల్”టెండర్ల పై విచారణ…

హైదరాబాద్ చుట్టూ నిర్మించిన అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండి పడేలా తక్కువ రేటుకు టెండర్లు కట్టబెట్టిన తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస రేట్ నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారని హెచ్ఎండీఏ అధికారులను ప్రశ్నించారు. అందులో ఎవరెవరి ప్రమేయముంది. ఏయే సంస్థలున్నాయి, ఎవరెవరు బాధ్యులెవరో అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రి…

Read More
tamil telug

తెలంగాణ భాష మహా మాధుర్యం..

“తెలంగాణ భాష అంటేనే క్లాసిక్ భాష” అని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. తెలంగాణ భాష మాట్లాడు తున్నప్పుడు చాలా ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. తెలుగు భాష, సంస్కృతి అంతటా వ్యాప్తి చెందాలని ఆకాంక్షించారు. రవీంద్ర భారతిలో జ‌రిగిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 16వ స్నాతకోత్సవంలో గవర్నర్‌ పాల్గొన్నారు. పలు కోర్సుల్లో పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి పట్టాలు అంద జేశారు. అనంత‌రం ఆమె మాట్లాడుతూ, తెలుగు భాషను ఇతర భాషలు మాట్లాడే ప్రజలందరికీ నేర్పించాలని…

Read More
IMG 20240228 WA0007

“ఆరు”అమలు ఖాయం…

ప్రభుత్వాన్నికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సరే ఇచ్చిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పేద ప్రజలకు మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాలను రాష్ట్ర సచివాలయంలో ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వల్ల పథకాల ప్రారంభ వేదికను చేవేళ్ల నుంచి సచివాలయానికి మార్చినట్లు చెప్పారు. ‘‘కట్టెల పొయ్యి నుంచి మహిళలకు విముక్తి…

Read More
IMG 20240225 WA0007

ఛైర్మన్…

తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ గా సీనియర్ పాత్రికేయులు కె. శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. రెండు సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. గతంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు పదవిలో అల్లం నారాయణ కొనసాగారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో ఆయన రాజీనామ చేశారు. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో ఈ పదవిలో శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు.

Read More