IMG 20240104 WA0055

జాతీయ హోదా కావాలి..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తో భేటీ అయిన సీఎం రాష్ట్రానికి ఐపీఎస్‌ అధికారుల కేటాయింపును పెంచాలని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ను సీఎంతో పాటు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీ.ఎస్‌. శాంతి…

Read More
funds copy

గడి దాటని“దొర”-గల్లంతైన“నిధులు”!

తెలంగాణలో మొన్నటి వరకు ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్రంతో కొన్నేళ్ళుగా తెగిపోయిన సంబంధాల వల్ల వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రంతో సన్నిహితంగా ఉండాల్సిన “ఒంటెద్దు” ప్రభుత్వంలో తానే అన్నీ అన్నట్టు వ్యవహరించి చివరకు రాష్ట్రపతి, ప్రధాని వంటి వారిని సైతం లెక్క చేయకపోవడంతో రాష్ట్రానికి రావలసిన నిధులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రాజకీయంగా విభేదాలు ఉన్నా పరిపాలన పరంగా చేయాల్సిన పనులను కూడా వ్యక్తిగతంగా…

Read More
Screenshot 20231228 213438 WhatsApp

మోడీ మెడిసిన్ ఖతం..

దేశంలో నరేంద్ర మోడీ అనే మెడిసిన్ కు గడువు తేదీ అయిపోయిందని, మోడీ మెడిసిన్ ఇక పని చేయదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర లోని నాగ్ పూర్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభలో రేవంత్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఎప్పుడూ చప్పన్ ఇంచ్ ఛాతీ అని గొప్పలు చెప్పుకుంటారనీ. ఆయన నేతృత్వంలో నడుస్తున్న లోకసభలోనే ఒక సామాన్యుడు ప్రవేశించి హంగామా చేస్తుంటే ఏమి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. డబుల్ ఇంజిన్…

Read More
landcruser

“కారు”కలలు…!

గత పదేళ్లుగా కుటుంబం పోగేసుకున్న ఆస్తులను చూస్తూ మొన్న జరిగిన శాసన సభ ఎన్నికల్లోనూ ప్రజలు ముడోసారి కూడా తమనే గద్దెనెక్కిస్తారనే అత్యాశ బిఆర్ఎస్ అధినేతల్లో గట్టిగా ఉన్నట్టు తేలిపోయింది. దశాబ్ద కాలం పాటు అధికారం చెలాయిస్తూ, సమర్ధవంతులైన అధికారగణం చుట్టూ ఉన్నా ఎన్నికల పలితాల తీరు తెన్నులను ముందుగానే అంచనా వేయలేక పోవడం “ఒంటెద్దు” ప్రభుత్వ ఓటమికి కారణంగా కనిపిస్తోంది. ఎన్నికల సమయంలోనైనా కనీసం ఇంటలిజెన్స్ అధికారుల మాటలు వింటే బాగుండేదనే వాదనలు ఆ పార్టీ…

Read More
whitepaper

ఇంకా తగ్గలే….!

ముఖ్యమంత్రి  హోదాలో ఉన్న వ్యక్తి “ఒంటెద్దు” పోకడగా వ్యవహరిస్తే అతన్ని నమ్ముకున్న ప్రజలకు ఎంత నష్టమో, ఎంత కష్టమో తెలంగాణ జనానికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. పదేళ్ళ పాటు నగరం నడిబొడ్డున  ప్రగతి భవన్ కేంద్రంగా సాగిన పాలన కేవలం హంగామా మాత్రమే అనే విషయాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చాటి చెప్పే ప్రయత్నం చేస్తోంది. దశాబ్ద పాలనలో అభివృద్ధి ముసుగులో ఆరు లక్షల కోట్ల రూపాయల  అప్పుల భారాన్ని ప్రజల నెత్తిన మోపారనే సత్యాన్ని…

Read More
revnth modi 1

మోడీతో రేవంత్…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ప్రధాన మంత్రి మోడిని కలిశారు. రాష్ట్రానికి సంబధించిన అనెక్ అంశాలపై చర్చించారు. అయన వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఉన్నారు.

Read More
gig

సామాజిక రక్షణ మా బాధ్యత…

క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్ లు, ఆటో డ్రైవర్ల కోసం రూ.5 లక్షల యాక్సిడెంటల్ పాలసీ తీసుకురావడంతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 4 నెలల క్రితం స్విగ్గి డెలివరీ బాయ్ కుక్క తరిమితే భవనం పై నుంచి పడి మృతి చెందిన ఘటనలో మృతుడి కుటుంబం వివరాలు సేకరించి సీఎం సహాయనిది నుంచి ఆ కుటుంబానికి రూ. 2 లక్షలు…

Read More
IMG 20231223 WA0025

ముగిసిన విడిది…

రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ము తెలంగాణలో శీతాకాల విడిది ముగిసింది. ఈ నెల 18న రాష్ట్రానికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రప‌తి, ప‌లు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శనివారం ఉద‌యం హ‌కీంపేట్‌లో రాష్ట్రపతికి గ‌వ‌ర్నర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అధికారులు వీడ్కోలు ప‌లికారు. ఆమె ప్రత్యేక విమానంలో ఆమె ఢిల్లీకి పయనమయ్యారు.

Read More
IMG 20231222 WA0092

ఎట్ హోం….

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఎట్ హోం కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రులు తదితరులు హాజరయ్యారు

Read More
IMG 20231217 WA0100

“మేడిగడ్డ” చిట్టా కావాలి…

కుంగి పోయిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నీటిపారుదల శాఖ అధికారులతో రేవంత్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నీటిపారుదల రంగం పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలన్నారు. ఇతర రాష్ట్రాలతో జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలు, ముందు ముందు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన…

Read More
IMG 20231217 WA0031

రేవంత్ తో రాజన్…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ జూబ్లీహిల్స్ నివాసంలో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక ముఖ్య సలహాదారుగా కూడా పనిచేసిన రఘురామరాజన్ రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆర్థికపరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, శాసనసభ వ్యవహారాలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి, స్పెషల్ ఫైనాన్స్…

Read More
gvrnr podiam

ఇనుప కంచె తొలగింది…!

పదేళ్ల నిర్బంధ పాలన నుండి విముక్తి కావాలని, తమ బతుకుల్లో గొప్ప మార్పు రావాలని కోరుకున్న తెలంగాణ ప్రజలు ఇటీవల ఎన్నికల్లో ఆ దిశగా సుస్పష్టమైన తీర్పు ఇచ్చారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ప్రజల విజ్ఞతను అభినందించార. ఈ ప్రభుత్వంలో తెలంగాణ స్వేచ్చా వాయువులను పీల్చుకుంటోండని. నియంతృత్వ పాలన, పోకడల నుండి తెలంగాణ విముక్తి పొందిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభ, శాసన మండలి ఉభయ సభల నుద్దేశించి ఆమె ప్రసంగించారు. నిర్బంధాన్ని సహించబోమని విస్పష్టమైన…

Read More
beltshop

ఇక”బెల్టు”తెంచుడే..!

గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ వ్యాప్తంగా పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఇష్టానుసారంగా పుట్టుకొచ్చిన ”బెల్టు షాపు”లు మూత పడనున్నాయి. రోడ్లు, జనావాస ప్రాంతాల్లోని రోడ్ల పక్కనే వెలిసిన వేలాది బెల్టు దుకాణాలను మూయించేందుకు రేవంత్ రెడ్డి సర్కారు నడుం బిగిస్తోంది.దాదాపు అన్ని చోట్లా జిల్లా నాయకులూ, గల్లీ లీడర్ల కనుసన్నలలో బినామీ చిట్టాల కింద నడుస్తున్న వైన్ షాపులకు అనుకొనే అధిక సంపాదన కోసం “బెల్టు”లు చుట్టారు. వైన్ దుకాణంలో మందు కొన్నుక్కొని పక్కనే…

Read More
jana revnt

“జానా”ఇంటికి రేవంత్ …

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్యాదపూర్వకంగా కలిశారు. బంజారాహిల్స్ లోని జానారెడ్డి నివాసానికి వెళ్ళిన రేవంత్ రెడ్డికి జానారెడ్డి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.

Read More