తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయిన సీఎం రాష్ట్రానికి ఐపీఎస్ అధికారుల కేటాయింపును పెంచాలని విజ్ఞప్తి చేశారు.

అంతకు ముందు కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను సీఎంతో పాటు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీ.ఎస్. శాంతి కుమారి కలిశారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు కు జాతీయ హోదా ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురీ తోనూ సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
