నేనున్నా.. చూడండి…
టిఎస్పిఎస్ గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని కె.ఎ.పాల్ డిమాండ్ చేశారు.
టిఎస్పిఎస్ గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని కె.ఎ.పాల్ డిమాండ్ చేశారు.
వెనకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖను పరిపాలన రాజధానిగా సీఎం వైయస్ జగన్ ప్రకటించిన నాటి నుంచి చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ అదే పనిగా విషం చిమ్ముతున్నారని మంత్రి ఆర్‌కె రోజా అన్నారు. విశాఖ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి సీఎం కృషి చేస్తుంటే, ఆ నగరాన్ని క్రైమ్ సిటీగా, అక్కడి ప్రజలను అవమానించే విధంగా పవన్‌కళ్యాణ్ మాట్లాడుతున్నారు. చంద్రబాబు మాట్లాడినట్టు , విమర్శించినట్టు పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో వెళ్తూ పవర్‌స్టార్‌గా కాకుండా, రీమేక్…
చందానగర్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గంగారం జేపి సినిమాస్ లో మంటలు చెలరేగాయి. అతి వేగంగా మంటలు వ్యాపించడంతో థియేటర్ లోని ఐదు స్క్రీన్ లలో పర్నిచర్, స్క్రీన్లు. ఇతర సామాగ్రి కాలిపోయాయి. మూడు ఫైర్ ఇంజన్ల లతో మంటలను అదుపుచేశారు. ఈ సినిమా హాలుకి అగ్నిమాపక శాఖ నుంచి సరైన అనుమతి లేదని తెలుస్తోంది.
ఏడు కొండల వాడిని చేరుందుకు నడక దారిన వెళ్ళే పర్యాటకులకు భక్తి కంటే భయం పెరిగే పరిస్థితి నెలకొంది. కాలినడకన వెళ్తున్న ఓ బాబుపై చిరుత దాడి చేసిన సంఘటన మరవక ముందే ఇంకో చిన్నారి చిరుతకు బలైంది. తిరుమల వెళ్ళే అలిపిరి నడక మార్గంలో నిన్న రాత్రి తప్పిపోయిన లక్షితా అనే ఆరు ఏళ్ల పాప లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద విగత జీవిగా లభించిది. తప్పిపోయిన బాలికను లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద చిరుత పులి దాడి…
పి.వాసు దర్శకత్వంలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం “చంద్రముఖి 2”. వినాయక చవితికి వినోదం పంచనున్న ఈ సినిమా లోని “స్వాగతాంజలి” అంటూ సాగే గీతాన్ని విడుదల చేశారు.
మాతృత్వం చుట్టూ తిరిగే కథతో రూపుదిద్దుకుంటున్న చిత్రం “ఎర్రచీర”. శ్రీ రామ్, కారుణ్య చౌదరివి ప్రధాన పాత్రలు. అలీ, రఘుబాబు, జీవా తదితరులు నటించిన ఈ సినిమా నవంబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “ఒరిజినల్ గ్యాంగ్” (ఓ.జి.). ఈ చిత్రాన్ని వచ్చె నెల 2 వ తేదీ పవన పుట్టిన రోజున తెరకెక్కించడానికి చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.
జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి చెందిన పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాల భూమి పై ప్రభుత్వంలో కదలిక వచ్చినట్టు తెలుస్తోంది. ఆ స్థలంపై ఉన్న న్యాయపరమైన చిక్కులపై చర్చించడానికి సొసైటీ నేతలతో రాష్ట్ర రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వ న్యాయవాది (రెవిన్యూ)లతో సోమవారం సమావేశం ఉన్నట్టు సొసైటీ కార్యదర్శి వంశీ తెలిపారు. ఇదిలా ఉంటే, సుప్రీం కోర్టు ఆదేశించినా ప్రభుత్వం సొసైటీకి అప్పజెప్పక పోవడతో ఈ నెల 10వ తేదిన నగరంలోని హెచ్ఎండిఎ…
ఈ నెల 15న చారిత్రక గోల్కొండ కోటలో నిర్వహించనునున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను డిజిపి అంజనీకుమార్ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ 15న ఉదయం సికింద్రాబాద్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం, ఉదయం11 గంటలకు గోల్కొండ కోటలో జాతీయ పతాకావిష్కరణ చేస్తారని డీజీపీ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి అవాంతరాలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సమావేశానికి నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్, అడిషనల్…
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రశాంతమైన నగరంగా ఉన్న విశాఖ పట్నం ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అడ్డాగా మారిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. విశాఖ నుంచి ప్రారంభమైన “వారాహి” మూడో విడత యాత్ర సందర్భంగా జగదంబా సెంటర్ లో ఆయన మాట్లాడారు. విశాఖ ప్రస్తుతం కబ్జాదారులు, రాబందుల చేతులోకి వెళ్లిందన్నారు. 150 మంది ఎమ్మెల్యేలతో నీ ఇష్టం వచ్చినట్లు ఆంధ్ర రాష్ట్రం ఏలుతున్నావని, ఐనా నీకు ఎవరూ భయపడరని ముఖ్యమంత్రి జగన్ ని ఉద్దేశించి…
సినీ నటి, మాజీ ఎం.పి. జయప్రదకు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే, చెన్నైలోని అన్నా రోడ్ లో జయప్రదకు ఒక సినిమా హాలు ఉంది. ఆ సినిమా హాలు నిర్వహణ బాధ్యతలను ఆమె సోదరుడు రాజబాబు, అతని స్నేహితుడు రామ్ కుమార్ చూస్తుంటారు. అయితే, సిబ్బందికి జీత భత్యాలు, పి.ఎఫ్., ఇఎస్ఐ, వంటి ఇతర సదుపాయాలను సరిగా కల్పించాడంలేదని రిటైర్ అయిన ఒక ఉద్యోగి కార్మిక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు….
దేశంలోని ముఖ్యమైన మహిళ నాయకురాళ్లపై ప్రముఖ జర్నలిస్టు నిధి శర్మ రచించిన “షి ద లీడర్ విమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్” పుస్తకావిష్కరణ కార్యక్రమం ఢిల్లీలో జరుగుతోంది. దీనికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరవుతున్నారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి ,మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి ఎంపీ మనీష్ తివారి, సిపిఎం ఎం.పీ జాన్ బ్రిటాస్ తో కలిసి కవిత ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.
జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి చెందిన పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాల భుమిని దక్కించుకోవడానికి సొసైటీ సభ్యుల్లో కొందరు కోర్టుధిక్కార పిటిషన్ దాఖలు చేయడానికి డిల్లీ వెళ్ళడంతో కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. ప్రభుత్వం ఒకవైపు సుప్రీం కోర్టు తీర్పునకు అనుకూలంగా ఉన్నట్టు పురపాలక శాఖ మంత్రి కేటిఅర్ చెబుతున్నప్పటికీ, ప్రభుత్వం ఆలస్యం చేస్తోందనే ఆందోళనతో కొందరు సభ్యులు పిటిషన్ వేయడానికి డిల్లీ వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే, పిటిషన్ దాఖలు చేయడంలో…
జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి 2007 వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం పేట్ బషీరా బాద్ లో కేటాయించిన స్థలాన్ని కాపాడుకోవడానే కార్యక్రమంలో భాగంగా కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయడానికి డిల్లీ వెళ్ళిన కొందరు సొసైటీకి సభ్యులు అక్కడ రెండు రోజులుగా న్యాయ నిపుణులతో పాటు పలువురు ప్రముఖులను సంప్రదిస్తున్నారు. ఇప్పటికీ ఆ స్థలాన్ని సొసైటీకి అప్పజెప్పే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూలత కనిపించక పోవడంతో డిల్లీ లోని నిపుణుల అభిప్రాయాలు…
జనాన్ని ఆకర్షించడానికి రాజకీయ పార్టీలు నానారకాల తంటాలు పడుతుంటాయి. అందులో భాగంగానే ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఈ రకమైన చిత్రాన్ని రుపొందించింది. “చంద్ర”యాన్ పేరుతో “బాబు రావాలి…రాష్ట్రం గెలవాలి” , “సైకో” పాలనా పోవాలి అనే చంద్రబాబు మాటలను జోడించి దీన్ని విడుదల చేశారు.