byc

పెట్టుబడికి బ్రేక్…

తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరోసారి మోకాళ్ళడ్డింది. ఇప్పటికే నిధులు ఇవ్వక రాష్ట్రాన్ని ఇబ్బందులు కేంద్రం   కేంద్రం తాజాగా  రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను అడ్డుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి.  అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ అయిన  బి.వై.డి. హైదరాబాదులో ఏర్పాటు చేయాలనుకున్న వాహన తయారీ విభాగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. బివైడి సంస్థ నాణ్యమైన ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు బ్యాటరీలను కూడా తయారు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీకి పేరు ఉన్నది. మన దేశంలోనూ బివైడి…

Read More
new cj c

కొత్త న్యాయమూర్తి…

తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ తమిళి సై అరాధేచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పలువురు మంత్రులు పాల్గొన్నారు.

Read More
notes

సినిమా చూపిన ముఠా …

మార్కెట్ లో రోజుకో రూపంలో మోసగాళ్ళు తిరుగుతున్నా అత్యాశపడే వారికి మాత్రం వాళ్ళు కనిపించడంలేదు. “ఒకటికి రెండు” అనే బురుడీ మాటలు చెబుతున్నవారి వలలో చిక్కుకుంటున్నారు. ఆ క్రమంలో నిలువునా మోసపోతున్నారు. నంద్యాలలో సరిగ్గా ఇలాంటి సంఘటనే జరిగింది. ఒకటికి మూడింతలు అంటూ కోట్ల రూపాయలు దోచుకుపోయారు. ఈ వివరాల్లోకి వెళ్తే అసలు నోట్లకు మూడింతలు నకిలీ నోట్లు ఇస్తామని స్థానిక స్థిరాస్తి వ్యాపారి మదన్ మోహన్ రెడ్డి ని ఓ ముఠా నమ్మించింది. తాము ఇదే…

Read More
table

ఆటలూ ముఖ్యం..

విద్యార్థులు క్రీడలలో పాల్గొనడం వల్ల శారీరకంగా , మానసికంగా దృఢత్వం పొందగలుగుతారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు. అబిడ్స్ లోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో టేబుల్ టెన్నిస్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సమాజాభివృద్ధిలో విద్య కీలకపాత్ర పోషిస్తుందని, విద్యకు ప్రాధాన్యత ఇచ్చే సమాజం అభివృద్ధి చెందుతూనే ఉందని తెలిపారు . లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌ ప్లాటినం జూబ్లీ వేడుకల సందర్భంగా…

Read More
pention

వెయ్యి పెరిగింది…

రాష్ట్రంలో దివ్యాంగుల పింఛన్ ను పెంచుతూ ఉత్వర్వులు జారీ చేసిన సందర్భంగా మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని కలిసి ధన్యవాదాలు తెలిపారు.దివ్యాంగులకు ప్రస్తుతం ప్రతి నెల ఇస్తున్న 3016 రూపాయల పెన్షన్ ను మరో వెయ్యి రూపాయలు పెంచడం పట్ల మంత్రి కొప్పుల హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల నుంచి ప్రతీ దివ్యంగులకు రూ.4016 రూపాయలు చెల్లించడం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు, పెన్షన్లు…

Read More
ranu sahu

ఐఏఎస్ అరెస్టు…

ఛత్తీస్ ఘడ్ లో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారిని రానూ సాహు ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి.) అధికారులు అరెస్టు చేశారు. బొగ్గు గనుల కేటాయింపులో జరిగిన అక్రమాల్లో సాహు సహా పలువురు అధికారుల పై విచారణ జరిపిన అధికారులు శనివారం నాడు వారికి సంబంధించిన 18 ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించారు. అనంతరం రానూ సాహుని అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు. ఆమెను కోర్టులో హాజరుపరచగా 3 రోజుల…

Read More
kailash cf

గ్రేట్ పోలీస్…

దేశంలో మహిళలు, పిల్లల అక్రమ రవాణాను అరికట్టడంలో తెలంగాణ పోలీసులు ఆదర్శప్రాయంగా నిలిచారని నోబుల్ శాంతి బహుమతి గ్రహీత సత్యార్థి కైలాష్ అన్నారు. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో పోలీస్ అధికారుల సమావేశంలో అయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా కైలాష్ మాట్లాడుతూ విధుల పట్ల నిబద్దత, అంకితభావం పోలీసు అధికారుల్లో ఎలా ఉంటుందో ఒక పోలీస్ అధికారి తనయుడిగా తనకు తెలుసునని తెలిపారు. తెలంగాణా రాష్ట్రంలో మనవ అక్రమ రవాణా నుంచి మహిళలు, పిల్లలను రక్షించేందుకు జరగుతున్న పోలీసింగ్…

Read More
arts manipur

ఎవరు బాధ్యులు…

మణిపూర్ లో శాంతి భద్రతలు క్షీణించాయనే సాకుతో అక్కడ మే 4 వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 355 ను అమలులోకి తెచ్చిందని, అంటే అప్పటి నుంచి మణిపూర్ లో రాష్ట్ర శాంతి భద్రతల పరిరక్షణ అధికారం కేంద్రం చేతిలోకి వెళ్ళింది కాబట్టి ఆ రోజు నుండి మణిపూర్ లో జరిగిన ప్రతి హింసాకాండకూ, ప్రతి నేరానికీ ప్రత్యక్ష బాధ్యత కేంద్ర హోమ్ శాఖా మంత్రి , దేశ ప్రధానమంత్రిదే అని రాజీవ్ గాంధీ పంచాయతి…

Read More
snake

పప్పులో పాము…

కష్టపడి పనిచేసేది బుక్కెడు తిండి కోసమే. అదీ ఇంట్లో సమయం లేకపొతే హోటళ్ళను అశ్రయిస్తాం. అక్కడైన సరైన భోజనం దొరుకుతుందా అంటే నమ్మకం లేదు. హోటళ్ళు వడ్డిస్తున ఆహార పదార్ధాలలో ఇప్పటి వరకు బొద్దింకలు, బల్లులు, చిన్న చిన్న పురుగులను మాత్రమే చూసాం. కానీ, ఒక క్యాంటిన్ లోని ఆహారంలో ఏకంగా పాము వచ్చింది. తిండి విషయంలో నిర్వాహకుల నిర్లక్ష్యానికి ఇంతకంటే పరాకాష్ట మరొకటి ఉండదు. వివరల్లోకి వెళ్తే, ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్)…

Read More
bodrayi

దీవించు తల్లీ…

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నారపల్లిలో గ్రామా దేవత (బొడ్రాయి) ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా జరిగింది. గతంలో ఉన్న బొడ్రాయి స్థానంలో కొత్తగా దేవతను ప్రతిష్టించారు. ఈ కార్యక్రమం కోసం గత మూడు రోజులుగా నారపల్లి లో పండుగ వాతావరణం నెలకొంది. శనివారం జరిగిన విగ్రహ ప్రతిష్టకు పోచారం మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డు హాజరై అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామస్తులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు.

Read More

కొరికేసింది…

ఒకొక్కరు ఒక్కో రకం అంటారు. ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఇలాటి ఉహించని  సంఘటనే అనంతపురంలో జరిగింది. చదవడానికి కొంచం ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. విషయం ఏంటంటే ముద్దు పెట్టడనికు వచ్చిన భర్త నాలుక కోరికేసింది ఓ భార్య.ఆ వివరాలు చూద్దాం. గుంటూరు జిల్లాకు చెందిన తారాచంద్ నాయక్  కర్నూలు జిల్లా తుగ్గలి మండలానికి చెందిన పుష్పవతి భార్య భర్తలు. వీళ్ళు2015వ సంవత్సరంలో వారు ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి వారికి ఇద్దరు పిల్లల…

Read More
sagar

సాగర్ నిడుతోంది..

కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీరు చేరడంతో హైదరాబాద్ హుస్సేన్ సాగర్ నిండి పోయింది. పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు దాటినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఉస్మాన్ సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

Read More
dimand

వజ్రాల వేట..

ఎక్కడి సమాచారమో ఏమో గానీ ఆ ప్రాంతం తిరునాళ్ళ మాదిరిగా తయారైంది. రంగురాళ్ళు కాదు, కోరండం రాళ్ళూ కాదు ఏకంగా వజ్రాలే. వజ్రాలు దొరుకుతున్నాయనే వదంతులు వ్యాపించడంతో ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు జిల్లాలోని బసవమ్మ వాగు జనసంచారంతో కోలాహలంగా మారింది. సత్తెనపల్లి సమీపంలోని బసవమ్మ వాగు వద్ద వజ్రాలు దొరుకుతున్నాయనే వదంతులతో పలు ప్రాంతాల నుండి జనం కుటుంబ సమేతంగా వచ్చి వజ్రాలను వెతకడం మొదలుపెట్టారు. కొందరు పిల్లలను పాఠశాలలు మాన్పించి మరీ వజ్రాలు వెతికేందుకు తీసుకొచ్చారు….

Read More
cs shanti

అప్రమత్తం…

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నదీ పరీ వాహక ప్రాంతాల జిల్లాల్లో పరిస్థితులపై సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్బంగా సి.ఎస్ మాట్లాడుతూ,  భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరిగితే చేపట్టాల్సిన చర్యలపై సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. మహారాష్ట్రలో వర్షాలు తగ్గి అక్కడ నుండి వరద ప్రవాహం   తగ్గుతున్నందున, భద్రాచలం వద్ద కూడా పెద్దగా పెరిగే అవకాశం లేదని…

Read More