chandrachud

మండిపడ్డ “సుప్రీం”…

మణిపూర్‌ లో జరిగిన అఘాయిత్యాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటన చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేసింది. మీడియా, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన దృశ్యాలు, కథనాల ఆధారంగా మణిపూర్‌ ఘటనను “సుప్రీం” సుమోటాగా స్వీకరించింది. ఆ వీడియో దిగ్భ్రాంతికి గురి చేసేదని సీజేఐ నేతృత్వం లోని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. మే 3వ తేదీన ఈ ఘటన జరిగిందనే సమాచారం అందుతోంది, అలాంటప్పుడు ఇంత కాలం ఎలాంటి చర్యలు తీసుకున్నారు,…

Read More
ktr ghmc f

“డబుల్” రెడీ..

హైదరాబాద్ లో ఆగస్టు నుంచి అక్టోబర్ మూడవ వారం నాటికి పేదలకు ఇళ్ళ పంపిణి చేయకానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు పురపాలక శాఖ మంత్రి కేటిఅర్ అధికారులను ఆదేశించారు.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పేదల కోసం నిర్మించిన రెండు గదుల ఇండ్ల పంపిణికి ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ఆగస్టు మొదటి వారం నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో 70 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక…

Read More
modi parilimt

సిగ్గుచేటు…

మణిపుర్‌ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన సిగ్గుచేటని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ  దారుణానికి పాల్పడిన వారిలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మీడియాతో మాట్లాడుతూ మణిపూర్ సంఘటన ఆశయంత హేయమైనదని అన్నారు. సమాజంలో ఇలాంటివి చోటుచేసుకోవడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. నేరాలపై, మరీ ముఖ్యంగా మహిళలపై జరిగే నేరాలపై కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుగా చట్టాలను బలోపేతం చేయాలని అన్ని రాష్ట్రాల…

Read More
parlamant

ప్రారంభం..

ప్రారంభం..పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభ లో ఛైర్మన్‌, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సభా సభ్యుల నుద్దేశించి ప్రసంగించారు. ఇటీవల మృతి చెందిన సిట్టింగ్‌ సభ్యులు, మాజీ ఎంపీ లకు ఉభయ సభలు సంతాపం ప్రకటించారు. ఆ వెంటనే లోక్‌సభ ను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తూ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు.  అనంతరం రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఆగస్టు 11…

Read More
rajni

భాధ్యతలు…

రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ కార్యాలయంలో చైర్ పర్సన్ గా వేద రజని బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు.

Read More

పొంచి ఉంది…జర భద్రం…

తెలుగు  రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా యడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల జనజీవనం సతమతం అవుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు  పొంగిపొర్లడంతో రహదారులు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దాదపు 36 గంటల నుంచి నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలు గోదావరి తీరప్రాంత వాసులను భయందోలనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి ఎగువ  ప్రాంతంలోని  ప్రాజెక్టులు నుండి వస్తున్న  వరద నీటి వల్ల  రాజమండ్రి, భద్రాచలం  వద్ద నీటి మట్టాలు పెతుగుతున్నాయి. ఇప్పటకే భద్రాచలం వద్ద…

Read More
poundr c

ఫౌండర్స్ ల్యాబ్ …

రాష్ట్రంలో స్టార్టప్ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని యువతను ఈ దిశగా ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఇప్పటికే టీ -హబ్, టీ- వర్క్స్, అగ్రి హబ్, వీ – హబ్ వంటి అనేక వేదికలను ఏర్పాటు చేసిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని వెలికితీసి వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఏర్పాటైన ఫౌండర్స్ ల్యాబ్ సంస్థను హైదరాబాద్ గ్రోత్ కారిడార్ కార్యాలయంలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…

Read More
tadi c

చెట్లకు నెంబర్లు…

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాటి, ఈత, ఖర్జూర, గిరుక తాటి చెట్లకు నెంబరింగ్ ను వేయాలని ప్రోహిబిషన్ , ఎక్సైజ్ శాఖ పై రాష్ట్ర మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యాప్తంగా ఆగష్టు 31 లోగా తాటి, ఈత, ఖర్జూర, గిరుక తాటి చెట్లకు నెంబరింగ్ ను పూర్తి చేయాలన్నారు. తెలంగాణకు హరితహారం లో భాగంగా…

Read More
prp logo

“జనసేన” తడబాటు…

పి.ఆర్.పి గుర్తుండే ఉంటుంది..అదే ప్రజారాజ్యం పార్టీ ..మెగాస్టార్ కలల సాకారం.. రాష్ట్ర ప్రజలకు ఏదో చేయాలనే సంకల్పం. ఆనాడు ప్రజల్లో ఎన్నో ఆశలు రేపింది. అధికార పక్షానికి తానే పోటీ అని చాటింది. ప్రతీ  మీటింగ్ లో అశేష జనవాహినిని చూసి తబ్బిబ్బయింది. గెలుపు ఖాయమని అంచనా వేసింది. కొన్ని సందర్భాల్లో అధికారం మాదే అన్న నిర్ణయానికీ వచ్చింది. కానీ, అది మెగాస్టార్ పై అభిమానమే తప్ప ప్రజలు ఏలికను కోరుకోవడంలేదని ఎన్నికలు జవాబు చెప్పాయి. 2008…

Read More
jb acp

కొత్త ఎ.సి.పి.లు…

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని జూబ్లీ హిల్స్ డివిజన్ కొత్త ఏసిపిగా కె.హరిప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ డివిజన్ ఏసిపిగా జానకి రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా ప్రత్యేక చొరవ తీసుకుంటామని కొత్త ఏసిపి తెలిపారు.

Read More
Screenshot 2023 07 19 161905

పొంచి ఉన్న వరదలు..

రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల తెలంగాణలోని పలు జిల్లాల్లో నదులు వరద నీటితో పోట్టేతుతున్నాయి. ముఖ్యంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. దీంతో జిల్లా యంత్రాంగం సహాయక చర్యలకు సమాయత్తం అయింది. గోదావరికి ఎగువనున్న కాళేశ్వరం, ఇంద్రావతి, తాలిపేరు నదుల నుండి వచ్చే వరదల వల్ల భద్రాచలం వద్ద రాత్రికి 35 అడుగులకు చేరే అవకాశం ఉన్నట్లు జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి…

Read More
arts collage

పాఠాలు చెప్పకుండానే …

ఉస్మానియా యూనివర్సిటీలో సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలు నిర్వహించడం పై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూజీసీ రూల్స్ ప్రకారం సెమిస్టర్‌కు కనీసం 120 పని దినాల తర్వాతే పరీక్షలు పెట్టాల్సి ఉండగా కనీసం రెండు నెలలు కూడా పాఠాలు చెప్పకుండానే అధికారులు పరీక్షలు పెడుతున్నారు. దీంతో పీజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. సిలబస్ పూర్తైన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు నిరసన చేపట్టారు. పరీక్షల నిర్వహణపై వీసీకి వారం రోజుల క్రితం వినతి పత్రం ఇచ్చినప్పటికీ…

Read More
eetela c

ఇవ్వాల్సిందే….

పేట్ బషీరాబాద్ లో జర్నలిస్టులకు కేటాయించిన భూమిని వెంటనే వారికి అప్పజెప్పాలని వివిధ రాజకీయ, ప్రజాసంఘాల నేతలు ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు.హైదరాబాద్ జర్నలిస్టుల న్యాయమైన ఇళ్ళ స్థలాల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ “ధర్నా చౌక్” వద్ద చేపట్టిన ధర్నా కు రాజకీయ పార్టిలు, ప్రజా సంఘాలు తరలి వచ్చాయి. కాంగ్రెస్ నేతలు వి. హనుమంత రావు, మల్లు రవి, బిజెపి నేతలు ఈటెల రాజేందర్, రామచంద్ర రావు, విమలక్క హాజరై జర్నలిస్టులకు అండగా నిలుస్తామన్నారు. సుప్రీం కోర్టు…

Read More
Screenshot 2023 07 18 160326

పాపం ఆశ పడి…

తమిళనాడులోని సేలంలో ఓ తల్లి నలుగురు చూస్తుండగానే బస్సు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. సేలం కలెక్టర్ కార్యాలయంలో సఫాయి కర్మికురాలిగా పనిచేస్తున్న మహిళ తన కుమారుని చదువుకి కావాల్సిన 45 వేల రూపాయలు చెల్లించలేక, తాను చనిపోతేనైన ప్రభుత్వం ఆ డబ్బు ఇస్తుందేమోనన్న ఆశతో దారుణానికి పాల్పడింది. ఈ హృదయవిదారక సంఘటన పలువురి మనసులను కలచివేస్తోంది.

Read More
all party cong c

కొత్త పేరు ఇండియా..

రానున్న లోక్ సభ ఎన్నికల్లో బిజెపిని గద్దె దించడమే ప్రధాన ఎజెండాగా విపక్షాల సమావేశాలు జరిగాయి. అధికారం కోసం బిజెపి ఎంతకైనా తెగిస్తుందని దాన్ని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని అన్ని పార్టీలు నిర్ణయించాయి. ప్రధాని పదవిపై కాంగ్రెస్ పార్టికి మోజులేదని మల్లిఖార్జున కార్గే వెల్లడించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున కార్గే, ముఖ్యమంత్రులు మమత బెనర్జీ, నితీష్ కుమార్,స్టాలిన్, అరవింద్ కేజ్రివాల్,భగవంత మాన్, హేమంత్ సోరెన్,మాజీ ముఖ్య మంత్రులు లాలూ ప్రసాద్, అఖిలేష్ యాదవ్,…

Read More