Screenshot 20230817 123721 Video Player

“పోర్టు”లో పోరు….

ఆంధ్రప్రదేశ్ లోని గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేపట్టిన ఆందోళనలో పలువురు పోలీసులు, కార్మికులకు గాయాలయ్యాయి. పోర్టులోకి చొచ్చుకెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాటలో 10 మంది పోలీసులు సహా పలువురు కార్మికులు గాయపడ్డారు.

Read More
Screenshot 20230814 121737 WhatsApp 1

అలా జరిగింది…

సరదా కోసం సముద్రంలోకి వెళ్లి మునిగిపోతున్న ఇద్దరు యువకుల ప్రాణాలను పోలీసులు కాపాడారు. కర్నూలు జిల్లాకి చెందిన పుల్లేటి మహేష్, గోగుల రమణ తోటి యాత్రికులతో కలిసి బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన పెద్ద అలల తాకిడికి సముద్రంలోకి వెళ్ళి పోయారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది, మెరైన్ సిబ్బంది వెంటనే స్పందించి కానిస్టేబుల్ గణేష్, ఎం. వెంకటేశ్వర్లు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సముద్రంలోకి…

Read More
Screenshot 20230814 102558 Gallery

చిక్కిన “చిరుత”…

తిరుమల నడక దారిలో చిన్నారి లక్షితను చంపిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. రెండు రోజుల క్రితం చిన్నారి లక్షితను దాడి చేసి హతమార్చిన చిరుతను ట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ఆ పరిసరాల్లో బోనులు ఏర్పాటు చేయగా ఆదివారం అర్ధరాత్రి చిరుత ఓ బోనులో చిక్కినట్లు అధికారులు వెల్లడించారు.

Read More
Screenshot 2023 08 13 113730

గుండెపోటుతో…

హైదరాబాద్ నగర శివార్లలోని ఆటో నగర్ హ్యుందాయ్ షోరూం లో విషాదం చోటుచేసుకుంది. షోరూంలోని వాహన సర్వీసింగ్ విభాగంలో కారు రిపేర్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన ఓ మెకానిక్ అక్కడిక్కడే మృతి చెందాడు. అబ్దుల్లాపూర్ మెట్టు మండలం కొహెడకు చెందిన జంగారెడ్డి (36) ప్రతిరోజూ మాదిరిగానే షోరూంకి వచ్చి వాహనాల మెకానిక్ పనులు మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా ఓ వాహనాన్ని పరిశీలిస్తున్న జంగారెడ్డి అకస్మాత్తుగా కిందపడిపోయి కాసేపటికి చనిపోయాడు. ఒక్కసారిగా తీవ్రమైన గుండె నొప్పికి గురికావడం వల్ల ఇలా జరిగిందని…

Read More
jp c

దగ్ధం…

చందానగర్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గంగారం జేపి సినిమాస్ లో మంటలు చెలరేగాయి. అతి వేగంగా మంటలు వ్యాపించడంతో థియేటర్ లోని ఐదు స్క్రీన్ లలో పర్నిచర్, స్క్రీన్లు. ఇతర సామాగ్రి కాలిపోయాయి. మూడు ఫైర్ ఇంజన్ల లతో మంటలను అదుపుచేశారు. ఈ సినిమా హాలుకి అగ్నిమాపక శాఖ నుంచి సరైన అనుమతి లేదని తెలుస్తోంది.

Read More
Screenshot 2023 08 11 153928

జయప్రదకు జైలు…!

సినీ నటి, మాజీ ఎం.పి. జయప్రదకు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే, చెన్నైలోని అన్నా రోడ్ లో  జయప్రదకు ఒక సినిమా హాలు ఉంది. ఆ సినిమా హాలు నిర్వహణ బాధ్యతలను ఆమె సోదరుడు  రాజబాబు, అతని స్నేహితుడు రామ్ కుమార్ చూస్తుంటారు. అయితే, సిబ్బందికి జీత భత్యాలు, పి.ఎఫ్., ఇఎస్ఐ, వంటి ఇతర సదుపాయాలను సరిగా కల్పించాడంలేదని రిటైర్ అయిన ఒక ఉద్యోగి కార్మిక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు….

Read More
gold

ఎలా సాధ్యం…

ఎంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసినా, ఎన్ని రకాల స్కానింగ్ పరికరాలు అందుబాటులోకి తెచ్చినా అక్రమార్కుల ఆగడాలు మాత్రం అదుపు కావడం లేదు. శంషాబాద్ విమానాశ్రయంలో తాజాగా పట్టుకున్న బంగారమే ఉదాహరణ. దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుండి కస్టమ్స్ అధికారులు కిలోన్నరకు పైగా బంగారం స్వాధీనం చేసుకుకున్నారు.పట్టుపడ్డ వ్యక్తులు చాకచక్యంగా దుస్తుల్లో బంగారాన్ని అమర్చుకొని దర్జాగా విమానం దిగారు. కానీ, తనిఖీ ప్రాంతం వద్ద కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కారు. వీళ్ళ నుంచి…

Read More
nia

ఎన్ఐఏ సోదాలు…

కరీంనగర్‌లో, ఆదిలాబాద్‌లో ఎన్‌ఐఏ దాడులు జరుపుతోంది. నిషేధిత సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే సమాచారంతో ఈ దాదులు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ లో గురువారం తెల్లవారు జామున జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు చేపట్టింది.. నగరంలోని హుస్సేనీ కూరలో [ప్రాంతంలో స్థానిక పోలీసులతో కలిసి ఎన్ఐఏ సోదాలు చేసింది. తబ్రేజ్‌ అనే వ్యక్తికి పాపులర్ పార్టీ ఆఫ్ ఇండియా (పి ఎఫ్ ఐ) అనే నిషేధిత సంస్థతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఆ వ్యక్తి ఇంట్లో తనిఖీలు జరిపింది….

Read More
jitendr

హోం మంత్రితో జితేందర్ ….

సినియర్ పోలీసు అధికారి జితేందర్ హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీని కలిశారు. రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న జితేందర్ డైరెక్టర్ జనరల్ గా పదోన్నతి పొందిన సందర్భంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి ఆయనను అభినందించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను చేరాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, పోలీస్ సిబ్బందికి మార్గ నిర్దేశం చేయాలని సూచించారు.

Read More
promotin

మూడు సింహాలు…

రాష్ట్రంలో ముగ్గురు సీనియర్ ఐపిఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది.1991బ్యాచ్ కి చెందినా రాజీవ్ రతన్, సి.వి. ఆనంద్, 1992 బ్యాచ్ కి చెందిన జితేందర్ లకు డి.జి.పి.లుగా పదోన్నతులు లభించాయి. ప్రస్తుతం వీళ్ళలో రాజీవ్ రతన్ పోలీసు హౌసింగ్ కార్పోరేషన్ ఎం.డి. సి.వి. ఆనంద్ నగర పోలీస్ కమిషనర్ గా, జితేందర్ హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు.

Read More
Screenshot 2023 08 05 083323

లాల్ సలాం…

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు )ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర కమిటీ, దక్షిణ్ బస్తర్ డివిజన్ కమిటీ సంయుక్త విడుదల చేసింది. దండకారణ్యం -తెలంగాణ సరిహద్దుల్లో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. డప్పు వాయిద్యాల మధ్య పాటలు పాడుతూ ఊరేగింపు చేశారు. నృత్యాలతో దండకారణ్య ప్రాంతాన్ని హోరెత్తించారు. అనంతరం ఇటీవల అమరుడైన కటకం సుదర్శన్ స్థూపాన్ని ఆవిష్కరించారు. అమరుల ఆశయాలను కొనసాగిస్తామని మావోయిస్టు నేతలు స్పష్టం చేశారు. 

Read More
IMG 20230727 WA0043

బీబీ కా ఆలం…

శనివారం జరిగే మొహరం పండుగకు సంబంధించి ఏర్పాట్లను నగర పోలీసు కమిషనర్ సి.వి. ఆనంద్ పరిశీలించారు. పాత బస్తీ దార్ ఉల్ షిఫా లోని బీబీ కా ఆలం వద్ద ఏర్పాట్లను పరిశీలించి దట్టీ సమర్పించారు. అనంతరం శనివారం బీబీ కా ఆలం ఉరేగింపు జరిగే ప్రాంతాలలో పర్యటించారు.

Read More
ANJANI

బీ అలర్ట్ …

రానున్న రెండు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు.మరో 48 గంటలలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై పోలీస్ కమీషనర్లు, ఎస్.పి.లతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ సంజయ్ కుమార్ జైన్ కూడా పాల్గొన్న ఈ వీడియో కాన్ఫరెన్స్ లో…

Read More
Screenshot 2023 07 25 154029

మై హోమ్.. ఐదుగురు మృతి…

మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మై హోమ్ సిమెంట్ కంపెనీ విస్తరణలో భాగంగా కొత్తగా నిర్మిస్తున్న యూనిట్-4 ప్లాంట్ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ పని చేస్తుండగా లిఫ్ట్ కూలి కింద పడడంతో ఐదుగురు కాంట్రాక్ట్ కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా ఉత్తరప్రదేశ్, బీహార్ కు చెందినట్టు సమాచారం అందింది. గాయపడ్ద వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Read More
kl c

కె.ఎల్.లో ఆత్మహత్య…

గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని కే ఎల్ యూనివర్సిటీ లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ బెంగాల్ కు చెందిన సౌరదీప్ చౌదరి అనే విద్యార్ధి భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చౌదరి ఆత్మహత్య ఉదంతన్ని కాలేజి యాజమాన్యం గోప్యంగా ఉంచిన కొంత సమయానికి విద్యార్ధుల జోక్యంతో బయటికి పొక్కింది. చౌదరి ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడనే వివరాలు తెలియాల్సి ఉంది.

Read More