sandilya

కొత్త అధికారులు…

ఎన్నికలు సమీపిస్తున్న వేళ  తెలంగాణాలోని పలు జిల్లాల్లో ఐపిఎస్ అధికారులతో పాటు కొందరు ఐఏఎస్ అధికారులను కూడా బదిలీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు, సూచనల మేరకు హైదరాబాద్ నగర కమిషనర్ గా సందీప్ శాండిల్యా, వరంగల్ కమిషనర్ గా అంబర్ కిషోర్ ఝా బాధ్యతలు చేపట్టారు. నిజామాబాద్ సీపీగా  కమలేశ్వర్ , సంగారెడ్డి జిల్లా ఎస్పీగా  రూపేష్, కామారెడ్డి ఎస్పీగా  సిందు శర్మ, నాగర్ కర్నూల్ ఎస్పీగా వైభవ్ గైక్వాడ్, సూర్యాపేట ఎస్పీగా రాహుల్…

Read Full News
images 34

గుడ్ బై…”కారు”పై మోజు…!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.అయన రాజీనామ లేఖను ఎ.ఐ.సి.సి. అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కు పంపినట్టు సమచారం అందింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, ప్రస్తుతానికి అందుతున్న సమాచారం మేరకు అయన గులాబీ కండువాతో “కారు” ఎక్కే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.

Read Full News
IMG 20231011 WA0028

బరిలో తల్లీ, కూతుర్లు…!

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణ ఎన్నికల రేసులో వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల బరిలోకి దిగుటున్నట్టు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్‌టీపీ తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో సుమారు వంద చోట్ల వైఎస్ఆర్‌టీపీ పోటీకి రంగం సిద్దం చేసుకున్నట్టు సమచారం అందుతోంది.వైఎస్ షర్మిల పాలేరు, మిర్యాలగూడ రెండు స్థానాల నుంచి, సికింద్రాబాద్ నుండి వైఎస్ విజయమ్మ పోటీకి దిగనున్నట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read Full News
123187951 10sha1a

కొడుకూ,కూతురి కోసమే…

కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయటానికి, కవిత జైలుకు పోకుండా కాపాడుకోవటానికి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని ఇంపీరియల్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన మేధావుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి సిద్ధాంతాలతో పనిలేదని, బిజెపి మాత్రమే సిద్దాంతానికి అనుగుణంగా నడుస్తోందని తెలిపారు. కేసీఆర్ కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందన్నారు.తెలంగాణలో పదేళ్ళు అవినీతిలో మునిగి పోయిన బీఆర్ఎస్ కు మళ్ళీ అవకాశం ఇవ్వొద్దని కోరారు….

Read Full News
cs shanti 1

ఇక “కోడ్” స్క్రీనింగ్…

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రాగా, నిబంధనలను సమర్థంగా అమలు చేసేందుకు స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చే ప్రతిపాదనలను ఈ కమిటీ పరిశీలించనుంది. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేయగా, ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

Read Full News
evm

అతిక్రమిస్తే ఉక్కు పాదం…!

వచ్చే ఎన్నికల్లో ఓటర్ల సౌలభ్యం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలలో స్వల్ప మార్పు చేసింది. ఈవీఎంపై గతంలో పార్టీ గుర్తు, అభ్యర్థి పేరు మాత్రమే  ఉండేవి. కానీ ఈ సారి ఎన్నికల్లో వీటితో పాటు అభ్యర్థి ఫొటో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ వెల్లడించారు. పోస్టల్‌ బ్యాలెట్‌పైనా అభ్యర్థుల ఫొటోలు ఉంటాయి. ఈ నెల 31 వరకు ఓటు హక్కు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. చిరునామా…

Read Full News
srinivas goud

గండం తప్పింది…

తెలంగాణా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై ఎన్నికల అఫిడవిట్ కేసును హైకోర్టు కొట్టి వేసింది. మహబూబ్ నగర్ కు చెందిన చలవుగాలి రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ గత ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని ఆరోపిస్తూ, గౌడ్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. అయితే, సుదీర్ఘ విచారణ అనంతరం వివిధ అంశాలను పరిశీలించిన కోర్టు తుది తీర్పు వెల్లడించింది. రాఘవేంద్ర రాజు వేసిన ఎన్నికల కేసు చెల్లదంటూ తీర్పు…

Read Full News
Telangana map

వచ్చే నెల ౩౦న ఎన్నికలు…..

దేశం లోని ఐదు రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికలకు సంబంధించిన తేదీల వివరాలను ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ వివరించారు. తెలంగాణాలో నవంబర్ ౩౦వ తేదీన ఒకేవిదతలో పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ ౩న ఫలితాలు ప్రకటిస్తారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ని నవంబర్ ౩న విడుదల చేస్తారు. నామినేషన్లను 10వ తేదీ నాటికీ దాఖలు చేయాలి. 13 వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 15 వ…

Read Full News
Screenshot 20231004 114252 Gallery 1

రైల్వే స్టేషన్ లో రచ్చ….

సిద్దిపేట – సికింద్రాబాద్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం రచ్చ బండగా మారింది. ఈ రైలుని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ నుంచి వర్చువల్ గా ప్రారంభిస్తే, సిద్దిపేట రైల్వే స్టేషన్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఅర్ ఫోటోలు, ఫ్లెక్సీలు లేకపోవడం వివాదంగా మారింది. మంత్రి హరీశ్ రావు, బా.రా.స. ఎం.పి.కొత్త ప్రభాకర్ రెడ్డిలు సైతం ఆవేశానికి గురవడంతో పరిస్థితి అదుపుతప్పి ఆందోళనకు దారితీసింది.ఒక సందర్భంలో హరీశ్ రావు ప్రధాని ప్రసంగం ప్రసారం అవుతున్న ఎల్.ఇ.డి….

Read Full News
IMG 20231003 WA0049

షెడ్యూల్ కోసం…

తెలంగాణలో శాసనసభ ఎన్నికల నిర్వహణను అధ్యయనం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన అధికారుల బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, అరుణ్ గోయల్, అనూప్ చంద్రపాండేతో పాటు మరికొంత మంది సభ్యులు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోగా రాష్ట్ర అధికారులు స్వాగతం పలికారు. కాసేపట్లో ఈ బృందం రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. మూడు రోజుల పాటు ఈ బృందం రాష్ట్రంలో పర్యటించి, అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై అధికారులతో సమీక్ష సమావేశం…

Read Full News
IMG 20231002 WA0045 2

తెలంగాణలో సై…

తెలంగాణలో రానున్న ఎన్నికల బరిలోకి దిగడానికి జనసేన సిద్ధమైంది. వివిధ జిల్లాల్లో మొత్తం 32 నియోజక వర్గాలలో తమ అభ్యర్ధులు పోటీ చేస్తారని జనసేన ప్రకటించింది. ఉమ్మడి హైదరాబాద్, రంగరెడ్డి జిల్లాలోని కూకట్‌పల్లి, ఎల్‌బి నగర్, కుతుబుల్లాపూర్, శేరిలింగంపల్లి, సనత్‌నగర్, ఉప్పల్, పటాన్‌చెరువు, మల్కాజిగిరి, మేడ్చల్ వంటి 9 నియోజక వర్గాలు సహా ఖమ్మం జిల్లాలోని 7 నియోజక వర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ఎన్నికలలో పోటీ చేస్తారు.

Read Full News
iit swach

ఒకటి,ఒకటి,ఒకటి…

మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఐ.ఐ.టి. హైదరాబాద్ లో “ఒకటో తారిఖు, ఒక గంట, అందరం ఒకటి” అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా చేపట్టిన స్వచ్చ కార్యక్రమంలో క్యాంపస్ పరిసరాలను శుభ్రం చేశారు. ఎం.ఎస్.ఎస్. కార్యకర్తలు, కళాశాల అధికారులు సిబ్భంది స్వచ్చత పరుగు చేపట్టారు. వ్వ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్, సంస్థ డైరెక్టర్ మూర్తి, ప్రొఫెసర్ కె. వెంకట సుబ్భయ్య పాల్గొన్నారు. అంతకు ముందు మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్ర…

Read Full News
IMG 20231001 WA0008

పీఆర్సీ పరిధిలోకి…

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అంగన్ వాడీ టీచర్ల పై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. వేతన సవరణలో అంగన్ వాడీ టీచర్లను చేర్చనున్నట్లు సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు, ఐఐటియు యూనియన్ ల నేతలు హరీష్ రావు ని కలిశారు. అంగన్ వాడీల సమ్మె పై నాయకులతో మంత్రులు హరీష్ రావు, సత్యవతి రాథోడ్…

Read Full News
bell brahmini

నిరసన “మోత”…

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ చేపట్టిన “మోత మోగిద్దాం” కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలతో కలిసి నారా బ్రాహ్మిణి సైతం గంట మోగించి, ఈల శబ్దం చేశారు. ఆంధ్రా, తెలంగాణా ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో టిడిపి శ్రేణులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.

Read Full News
IMG 20230925 WA0053

ఆగేదే లే…

భాగ్య నగరానికి మధ్యలో ఉన్న మూసి నది, ఈసా నదులపై ఐదు వంతెనల నిర్మాణ పనులకు పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు ఉప్పల్ భగాయత్ శిల్పారామం సమీపంలోని మూసి పరివాహక ప్రాంతంలో భూమి పూజ చేశారు. 168 కోట్ల రూపాయల వ్యయంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ఐదు బ్రిడ్జిలను నిర్మించనున్నది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)లోపల పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా మెరుగుపరచాలన్న లక్ష్యంతో రాష్ట్ర…

Read Full News