Screenshot 20230925 174401 WhatsApp

సందడే…

బొజ్జ గణపయ్య నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు దగ్గరవడంతో ఆయా పందిళ్ళ వద్ద సందడి ఊపందు కుంటోంది. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఓ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన గణపతి విగ్రహ నిమజ్జనం సందర్భంగా విద్యార్థినులు అత, పాటలతో కోలాహలం చేయడం పలువురిని ఆకట్టకుంది.

Read Full News
IMG 20230918 WA0058

ఘనంగా పూజలు…

ప్రగతి భవన్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అయన సతీమణి శోభమ్మ బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. ప్ర‌జ‌ల‌కు సుఖ‌శాంతుల‌ను అందించాల‌ని, ప్రజలందరినీ చల్లగా చూడాలని, రాష్ట్ర ప్ర‌గ‌తి ప్ర‌స్థానానికి విఘ్నాలు రాకుండా చూడాల‌ని విఘ్నేశ్వరుడిని ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రార్ధించారు. గణపతి పూజా కార్య‌క్ర‌మంలో మంత్రి కేటీఆర్ అయన సతీమణి శైలిమ, కూతురు అలేఖ్య, పాల్గొన్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీలు…

Read Full News
Screenshot 20230915 203304 WhatsApp

ఎంత కష్టం…

పురిటి నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణి వాగు దాటడానికి నానా తంటాలు పడింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఎలిసెట్టి పెల్లి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దబ్బగట్ల సునీతకు పురిటి నొప్పులు రావడంతో పొంగిపొర్లుతున్న జంపన్న వాగు దాటలేక అవస్థలు పడింది. దీంతో స్థానికులు ఆమెను ఎలాగైన వాగు దాటించాలని నిర్ణయం తీసుకున్నారు.గజ ఈత గాళ్ళ సాయంతో ఆమెను ట్రాక్టర్ టైరు పై కూర్చోబెట్టి జగ్రత్తగా వాగు దాటించారు.ఇక్కడ బ్రిడ్జి లేకపోవడం వల్ల…

Read Full News
IMG 20230915 WA0031

భేటీ…

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కాంగ్రెస్ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. ఏఐసీసీ తెలంగాణా ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ కో.చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ తదితరులు హైటెక్ సిటీ మాదాపూర్ లోని తుమ్మల నివాసానికి వెళ్లారు. రాబోయే ఎన్నికలు, తాజా రాజకీయ పరిస్థతులపై చర్చించారు.

Read Full News
IMG 20230915 WA0011

తెల్ల కణం లాంటి కోటు…

వైద్యాన్ని పేదలకు అతి చేరువలోకి తెస్తూ, తెలంగాణ రాష్ట్రం ప్రతియేటా పది వేల మంది వైద్యులను తయారు చేసే స్థాయికి చేరిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. రాష్ట్ర వైద్య రంగం దేశ వైద్య రంగ చరిత్రలోనే విప్లవాన్ని సృష్టిస్తూ, దేశానికే ఆదర్శంగా పురోగమించడం తెలంగాణకు గర్వకారణమని అన్నారు. ప్రగతి భవన్ నుండి వర్చువల్ పద్దతిలో 9 వైద్య కళాశాలలను కేసీఅర్ ప్రారంభించారు. కరీంనగర్, కామారెడ్డి, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల,…

Read Full News
protest tdp

ఇదో రకం….

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ను ప్రపంచపటంలో పెట్టిన మహా నాయకుడని, నేడు ఆయన అరెస్టు అక్రమమని కొందరు అభిమానులు హైదరాబాద్ లోని హైటెక్ సిటి సమీపంలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. బాబు అరెస్టును ఖండిస్తూ ఎవరూ గుర్తు పట్టకుండా మాస్క్ వేసుకుని నిరసన వ్యక్తం చేశారు.

Read Full News
IMG 20230913 WA0015

ఎవడురా బానిస…

ఎవడిదిరా బానిసత్వ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి కెటిఆర్ పై ధ్వజమెత్తారు. మద్యం కేసులో కవిత ప్రమేయం పై అమిత్ షా ని కలిసిన తర్వాత ఆగిపోయిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.మా చెల్లిని అరెస్ట్ చేయకండి, ఎన్నికలు ఎప్పుడైనా పెట్టుకోండి అని కేటీఆర్ అమిత్ షా కి చెప్పి వచ్చాదాని వ్యాఖ్యానించారు.కేటీఆర్ కి ఎంతోకొంత తెలివి ఉందనుకున్ననాని, ఈ రోజు చిట్ చాట్ తర్వాత ఆయనకు…

Read Full News
pravin

బిజెపిలోకి “క్యాసినో”…

ఆంధ్రప్రదేశ్, గోవా, ధాయిలాండ్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన క్యాసినోలతో తెరపైకి వచ్చిన చీకోటి ప్రవీణ్ బిజెపిలో చేరుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిని కలిసినట్టు సమాచారం అందుతోంది. ఒకటి, రెండు రోజుల్లో ప్రవీణ్ కమలం కండువా కప్పుకోనున్నారు.

Read Full News
image

ఎందుకీ నిర్లక్ష్యం…

అనలోచిత నిర్ణయాల వల్ల చేతికందుతుందనుకున్న ఫలాలు దక్కని పరిస్థితి నెలకొంది. ఒకే సంఘంలో భిన్నాభిప్రాయాలు సభ్యుల భవిష్యత్తును, ఆశలను వేదనకు గురి చేస్తున్నాయి. డబ్బు చెల్లించి  దాదాపు ఒకటిన్నర దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న హైదరాబాద్ జర్నలిస్టుకు ఆ భూములు ఇవ్వండని సాక్షాత్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం ఖాతరు చేయకపోవడం, జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సభ్యుల్లో అభిప్రాయ భేదాలు తలెత్తడం ఆ సొసైటిలోని సామాన్య సభ్యులను ఆందోళనకు గురి చేస్తోంది….

Read Full News
rahul security

సభకు గ్రౌండ్ ఇవ్వరా…

ఈ నెల 16,17 తేదీలలో హైదరాబాద్ లో జరగబోయే సీడబ్ల్యూసీ సమావేశాలు, బహిరంగ సభ నేపథ్యంలో హాజరయ్యే జాతీయ నాయకుల భద్రత కల్పించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు డీజీపీ అంజనీ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 16, 17న తాజ్ కృష్ణలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతాయన్నారు. 17న విజయ భేరి బహిరంగ సభను నిర్వహిస్తున్నామని, దీనికి సంబంధించి భద్రతను అందించాలని డీజీపీని…

Read Full News
mining c

ఇసుక విధానం భేష్..

రాష్ట్రంలో అమలు పరుస్తున్న ఇసుక పాలసీ దేశం లోనే ఉత్తమమైనదని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. గనులు,భూగర్భ వనరుల శాఖ పై ఉన్నతాధికారులతో డా.బి.ఆర్. ఆంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, గనుల శాఖ డైరెక్టర్ కాత్యాయని, టీఎస్ఎండీసీ ఎండీ మల్సూర్,  ఉన్నతాధికారులు పాల్గొన్న సమావేశంలో ఆయన గనులు మరియు భూగర్భ శాఖ పనితీరును సమీక్షించారు. ప్రభుత్వం ఇటీవల నూతనంగా తీసుకువచ్చిన…

Read Full News
jodo

“జోడో” ఏడాది…

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాందీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏడాది అయిన సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున భారత్ జోడో పాదయాత్ర లు, సభలు జరిగాయి. టీపీసీసీ ఆధ్వర్యంలో సోమజిగూడా రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్ ఇందిరమ్మ విగ్రహం వరకు జరిగిన భారీ ర్యాలీ లో కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్…

Read Full News
images 29

దరఖాస్తు చేయొచ్చు…

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ స్కూల్స్‌ లో 2023 – 2024 విద్యా సంవత్సరానికి గానూ జనరల్ నర్సింగ్ మరియు మిడ్‌వైఫరీ (జిఎన్ ఎం) ట్రైనింగ్ మూడేళ్ల కోర్సులో ప్రవేశానికి తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 02.09.2023 నుండి 16.09.2023 వరకు అందుబాటులలో ఉంటుందని అర్హులైన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను ప్రభుత్వ స్కూళ్లలో 19.09.2023 లోగా ప్రైవేట్ స్కూల్ లలో 10.10.2023తేదిలోగా…

Read Full News
Screenshot 20230905 115440 WhatsApp

ముంచెత్తిన “మూసాపేట”…

మహా నగరంలో కురుస్తున్న వర్షాల వల్ల అనేక ప్రాంతాలు జలమయమ య్యాయి. మూసాపేట్ దగ్గర భారీ ఎత్తున వరద ప్రవాహం పోటెత్తడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచపోయింది.వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో ఉన్న చెరువు కట్టలు తెగడం వల్ల భారీ ఎత్తున వరద ప్రవాహం వస్తుంది. ప్రవాహం వల్ల సుమారు మూడు గంటల పాటు పాదచారులు, వాహన చోదకులు నానా ఇబ్బందులు పడ్డారు. దాదాపు వందమంది ట్రాఫిక్ పోలీసులు, జిహెచ్ఎంసి సిబ్బంది సహయక చర్యలు చేపట్టారు.

Read Full News
images 28

శ్వేతాకి నోటీసులు..

చైనాకు గ్రానైట్ రాయి ఎగుమతుల్లో శ్వేతా గ్రైనేట్స్ అక్రమాలకు పాల్పడినట్టు కేంద్ర ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. ఈ మేరకు తెలంగాణా రాష్ట్ర పౌస రఫరాల శాఖ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఈడి నోటీసులు జారీ చేసింది. విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనలకు విరుద్ధంగా శ్వేత ఏజెన్సీస్ 4.8 కోట్ల రూపాయల ఉల్లంఘన కి కి పాల్పడినట్టు ఈ.డి. పేర్కొంది.గ్రైనేట్ మెటీరియల్ ఎగుమతి చేయడంలో ఈ అక్రమాలు జరిగినట్లు…

Read Full News