IMG 20240727 WA0023

ఉప్పొంగే “గోదారి”…

గోదావరి వరదలతో ఉరకలేస్తున్న భద్రాచలం దగ్గర ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గంట గంటకూ పెరుగుతున్న ఉధృతితో నీటిమట్టం 52.7 అడుగులకు చేరింది. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయగా.. నదిలో ప్రవాహం కొనసా గుతూనే ఉంది. దీంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరదల ప్రభావంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపో యాయి. రెండు ప్రధాన రహదారులపై గోదావరి వరదనీరు చేరింది. మరోవైపు గోదారి మహోగ్ర రూపంతో పరివాహక ప్రాంతాల ప్రజలు…

Read More
skill scaled

300 కోట్లతో నైపుణ్య అభివృద్ధి

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా రూ.300 కోట్ల వ్యయంతో నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రపంచంలోని పది ప్రఖ్యాత యూనివర్సిటీలు ముందుకొచ్చాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. హైదరాబాద్ కేంద్రంగా 25 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే “ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ (ఐఎస్ ఎఫ్)”, టెక్సస్ కేంద్రంగా ఉన్న ‘స్టార్టప్ రన్ వే’ సంస్థల ప్రతినిధులతో మంగళవారం నాడు సెక్రటేరియట్ లోని తన కార్యాలయంలో శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. అంతర్జాతీయంగా స్టార్టప్ లను…

Read More
IMG 20240715 WA0010

“గల్ఫ్” బడ్జెట్ కావాలి…

గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమం కోసం రానున్న బడ్జెట్ లో రూ.500 కోట్లు కేటాయించాలని గల్ఫ్ జెఏసి బృందం హైదరాబాద్ లో మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ లను వేరు వేరుగా వినతి పత్రాలు సమర్పించారు. గల్ఫ్ తదితర దేశాల లోని వలస కార్మికుల సంక్షేమం కోసం ‘గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు (గల్ఫ్ బోర్డు) ఏర్పాటు చేయాలని, సమగ్ర ప్రవాస భారతీయుల విధానం (ఎన్నారై…

Read More
IMG 20240711 WA0008

తెలంగాణాలో “మైక్రోలింక్”

అమెరికా టెలికమ్మూనికేషన్స్ దిగ్గజం మైక్రోలింక్ నెట్ వర్క్స్ రూ.500 కోట్ల పెట్టుబడితో తెలంగాణాలో తమ ఎలక్ట్రానిక్, ఇతర ఉత్పత్తుల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. హైదరాబాద్ కు చెందిన పిఎస్ ఆర్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో మైక్రోలింక్ పరిశ్రల క్లస్టర్ ను ప్రారంభిస్తుందని తెలిపారు. గురువారం నాడు మైక్రోలింక్ గ్లోబల్ ప్రతినిధులు, భారతీయ భాగస్వామి ‘పిఎస్ ఆర్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ శ్రీరంగారావు మంత్రితో సచివాలయంలో సమావేశమయ్యారు….

Read More
IMG 20240711 WA0000

తెలంగాణ మైనింగ్ సెంట‌ర్

ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివ‌ర్సిటీ – ఐఐటీ హైద‌రాబాద్ ఐఐటీ స‌హ‌మాకారంతో మైనింగ్ సెంట‌ర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటుకు రాష్ట్ర ప్ర‌భుత్వం స‌మాకారం అందిస్తుంద‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌క‌టించారు. ఈ రోజు డాక్ట‌ర్ బీఆర్ ఆంబేద్క‌ర్ తెలంగాణ రాష్ట్ర స‌చివాల‌యంలో భ‌ట్టి విక్ర‌మార్క‌తో ఐఐటీ హైద‌రాబాద్ కు చెందిన ప్రొఫెస‌ర్ మూర్తి, ఆస్ట్రేలియా మెల్ బోర్న్ లో మోనాష్ యూనివర్సిటీ ప్రొఫెస‌ర్ ఎలిశెట్టి మోహ‌న్ లు ప్రత్యేకంగా స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా బ్యాట‌రీల‌లో…

Read More
IMG 20240710 WA0018 scaled

మాట ప్రకారం…

పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.25లక్షల చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు. హైదరాబాద్ లోని సచివాలయంలో రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గడ్డం సమ్మయ్య , దాసరి కొండప్ప , వేలు ఆనందచారి, కూరేళ్ల విఠలాచార్య , కేతావత్ సోంలాల్ చెక్కులు అందుకున్నారు. ఈ సందర్బంగా బారు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌ర్యాట‌క. సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి సీత‌క్క‌, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ ముఖ్య…

Read More
revanth siraj

ఉద్యోగం-ఇంటి స్థలం…

అంతర్జాతీయ క్రికెట్ లో భారత దేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవాన్ని తెచ్చిన అల్ రౌండ్ క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ ను ముఖ్యమంత్రి ఏ.రేవంత్రెడ్డి అభినందించారు. టీ-20 వరల్డ్ కప్ ను గెలుచుకున్న అనంతరం హైదరాబాద్ చేరుకున్న సిరాజ్ మంగళవారం ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి సిరాజ్ ని ఘనంగా సన్మానించారు. మహ్మద్ సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌లో తన అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తున్నాడని, అందుకే ఈ రోజు అత్యున్నత…

Read More
bonal 24

ఆషాఢ “బోనం”..

ప్రకృతి పట్ల తెలంగాణ ప్రాంతానికున్న ఆరాధనకు, తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక తత్వానికి బోనాల ఉత్సవాలు నిదర్శనంగా నిలుస్తాయని , పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ అన్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను, వైభవాన్ని బోనాలు జగద్వితం చేశాయని. బోనాల పండుగను పురస్కరించుకుని సురేఖ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బోనాల పండుగ సృష్టి కొనసాగింపుకు మూలమైన మహిళలు సదా ఆరాధనీయులనే సందేశాన్నిస్తుందని మంత్రి అన్నారు.  ప్రకృతిని తల్లిగా భావిస్తూ, బోనాలతో అమ్మవార్లకు పండుగ చేసే…

Read More
IMG 20240706 WA0053 1 scaled

తొలి అడుగు..కమిటీలు…

తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత గత పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని అంశాలను, సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్టు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన సమావేశ వివరాలను భట్టి వివరించారు.రెండు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో…

Read More
IMG 20240705 WA0045

కొలిక్కి వచ్చే భేటీ…

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి ప్రజా భవన్‌ వేదికగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరు సీఎంల భేటీలో ఏ అంశాలపై చర్చ సాగనుందనేది ఆసక్తికరంగా మారింది. విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై వీరిద్దరూ భేటీ కావటం ఇదే తొలిసారి. ప్రధానంగా షెడ్యూల్ 9, 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. విద్యుత్తు సంస్థలకు…

Read More
tgcpdcl

ఇక “క్యూఆర్” కోడ్..

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ జారీ చేసే విద్యుత్ బిల్లులపై “క్యూఆర్” కోడ్ ను ముద్రించనున్నారు. తమ మొబైల్ ఫోన్ ద్వారా ఈ “క్యూఆర్” కోడ్ ను స్కాన్ చేసి వినియోగదారులు తమ బిల్లులు చెల్లించవచ్చు. ఈ “క్యూఆర్” కోడ్ తో కూడిన బిల్లులు వచ్చే నెల  నుండి వినియోగదారులకు అందుబాటు లోకి రానున్నాయి. రిజర్వు బ్యాంక్ కొత్త నిబంధనల వల్ల కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ లో నేరుగా బిల్లులు చెల్లించే సదుపాయం లేకున్నా,…

Read More
IMG 20240703 WA0052

“భేటీ” కోసం..

ఈ నెల 6న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ప్రజా భవన్ లో భేటీ కానున్న నేపథ్యంలో సమావేశ ఏర్పాట్లును తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పరిశీలించారు. ఆయనతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వివిధ విభాగాల అధికారులు ప్రజా భవన్ ను సందర్శించారు. సజావుగా ఏర్పాట్లు చేయాలని ఆయా విభాగాల అధికారులకు సూచనలు చేశారు….

Read More
IMG 20240703 WA0045

మళ్ళీ కాంగ్రెస్ లోకి…

సీనియర్ నేత, భారత రాష్ట్ర సమితి నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కె.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ఢిల్లీలో కే.కే.ను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు, ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దీపా దాస్ మున్షీ తదితరులు పాల్గొన్నారు.

Read More
batti houses c scaled

ఇందిర‌మ్మ ఇండ్ల‌కు “సోలార్”

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ఇత‌ర రాష్ట్రాల‌కు అధికారుల‌ను పంపించి అధ్య‌య‌నం చేయించి త్వ‌ర‌గా ప్ర‌భుత్వానికి నివేదిక ఇవ్వాల‌ని డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క హౌజింగ్ శాఖ అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్రంలో ఇండ్లు లేని పేద‌ల‌కు కాంగ్రెస్‌ ప్ర‌జా ప్ర‌భుత్వం ఇండ్లు నిర్మించి ఇవ్వ‌డానికి ఈ ఏడు ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో 3500 ఇండ్ల చొప్పున‌ బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించింద‌న్నారు. ప్ర‌భుత్వం అమ‌లు చేసే ఆరు గ్యారంటీల అమ‌లులో భాగ‌మే ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణమ‌న్నారు. హైదరాబాద్ లోని డాక్ట‌ర్ బిఆర్…

Read More
jail 15

క్షమాభిక్ష..

వచ్చే ఆగస్టు 15న తెలంగాణ జైళ్ళలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు విడుదల కానున్నారు. దీనికి హైదరాబాద్ రాజ్ భవన్ లో గవర్నర్ రాధాకృష్ణన్‌ ఆమోదం తెలిపారు. గవర్నర్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఇరువురి మధ్య భేటీ సాగింది. ఈ సందర్భంగా గవర్నర్‌తో సీఎం లంచ్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, అసెంబ్లీ సమావేశాలు, గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ లపై చర్చ, యూనివర్సిటీల్లో వీసీల నియామకం, ఆగస్టు 15న…

Read More