
ఇలా కూడా చేయొచ్చు….
పన్ను చెల్లింపుదారులను దోచుకునే కార్యక్రమంలో భాగంగా ఉచిత పధకాలతో దేశ ఆర్ధిక వ్యవస్థను దిగజారుస్తున్నారని విమర్శిస్తూ, అందుకు నిరసనగా మెక్సికో పార్లమెంట్ లో ఇలా అర్ధ నగ్నంగా ప్రసంగిస్తున్న నాయకుడు.
పన్ను చెల్లింపుదారులను దోచుకునే కార్యక్రమంలో భాగంగా ఉచిత పధకాలతో దేశ ఆర్ధిక వ్యవస్థను దిగజారుస్తున్నారని విమర్శిస్తూ, అందుకు నిరసనగా మెక్సికో పార్లమెంట్ లో ఇలా అర్ధ నగ్నంగా ప్రసంగిస్తున్న నాయకుడు.
సికింద్మరాబాద్ మహంకాళీ బోనలకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుటుంబసమేతంగా హాజరయ్యారు. రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని అమ్మవారిని కోరారు.
ఐఆర్ఎస్ అధికారి శామ్యూల్ ప్రసాద్ ఇంతో జరిగిన దొంగతనానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంతున్న ఎస్సై కృష్ణ అజ్ఞాతంలోకి వెళ్లడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ముషీరాబాద్ పోలీసులు ఈ కేసులో ఇప్పటికే ఆశీర్వాదం, శ్రీశైలం, సురేందర్ లను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. కానీ A2 నిందితునిగా ఉన్న ఎస్సై కృష్ణ ఆచూకి తెలియకపోవడం పట్ల విచారణ తీరుపై సందేహాలు కలుగుతున్నాయి. కేసు నమోదు చేసి నెల రోజులు గడుస్తున్నా ఎస్సై కృష్ణను అరెస్టు చేయకపోవడం ఆరోపణలకుఫ్ దరితిస్తోంది….
మహంకాళి అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు తొలిబోనం సమర్పించారు. ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.
సమాజంలో శాస్త్ర సాంకేతిక రంగాలకు మానవీయ విలువలు తోడైతే ఆ రంగాలలో సాధించిన ప్రగతి ప్రపంచానికి ఉపయోగపడుతుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలు పురోభివృద్ధి దిశగా అడుగులు వేయాలంటే మానవ శాస్త్రాల పరిజ్ఞానం కూడా ఆ శాస్త్రవేత్తలకు ఎంతో అవసరం అన్నారు. రవీంద్రభారతిలో ఎక్స్ ప్లోరా నాలెడ్జి ఒలింపియాడ్ సంస్థ ఆధ్వర్యంలో ఐఐటి టెస్ట్ లో ప్రతిభ చూపిన విద్యార్థులకు వార్షిక అవార్డుల ప్రదాన ఉత్సవం జరిగింది….
దేశాభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం అందించిన సహకారం గొప్పదని, దేశాన్ని ప్రపంచంలోనే 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపు దిద్దుకోవడంలో తెలంగాణ ప్రజలదే కీలకపాత్ర ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కాజీపేటలో రైల్వే మాన్యు ఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, రాష్ట్రంలో దాదాపు రూ. 6100 కోట్ల విలువైన అనేక ముఖ్యమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు…
వరంగల్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఆయన పాలనపై విరుసుకు పడ్డారు. కేవలం తెలంగాణ నాలుగు అంశంలో అభివృద్ధి చెందింది అంటూ ఎద్దేవా చేశారు. వాటిలో ఒకటి ఉదయం నుంచి సాయంత్రం వరకు మోడీని విమర్శించడం పని రెండోది తెలంగాణ ఆర్ధిక పరిస్థితిని నీరుగార్చడం అని వ్యాఖ్యానించారు.
ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ చేరుకున్నారు. మమునూర్ ఎయిర్ పోర్ట్ లో ప్రధానికి కలెక్టర్లు స్నిక్టా పట్నాయక్, ప్రావీణ్య, మాజీ ఎంపీ బూర నర్సయ్య స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రధాని నేరుగా శ్రీ భద్రకాళి దేవాలయనికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.
దేశ అభివృద్ధిలో యువత గొప్ప పాత్ర పోషిస్తుందని, దేశ పురోగమనంతో పాటు సామాజిక సంస్కరణలను తీసుకురావడంలో యువతదే ప్రధాన పాత్రని డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. అక్షయ విద్య స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నగరంలోని పలు బస్తీలకు చెందిన 80 మంది నిరుపేద విద్యార్థినీ, విద్యార్థులకు లాప్ టాప్ లను డీజీపీ అందచేశారు. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ, కస్టపడి చదువుకున్న యువత తమ బస్తీలలో ప్రాంతాల్లో చేడు మార్గాలలో పయనిస్తున్న…
సికింద్రాబాద్, హౌరా ఫలక్ నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. ఈ సంఘటన భువనగిరి జిల్లాలోని బొమ్మాయిపల్లి- పగిడిపల్లి మార్గంలో చోటు చేసుకుంది. ముందుగా రైలు నుండి పొగ రావడంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ప్రయాణికులను అప్రమత్తం చేశారు. దీంతో ప్రయాణికులను వెంటనే రైలు నుండి దింపేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రైలును బొమ్మాయిపల్లి…
నిబంధనలకు విరుద్ధంగా జూనియర్ అసిస్టెంట్‌ను ఉద్యోగంలో నుంచి తొలగించిన వ్యవహారంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు నవీన్ మిత్తల్, వాకాటి కరుణతో పాటు ఇంకొందరు అధికారులకు కోర్టు ధిక్కరణ కింద హైకోర్టు శిక్ష విధించింది. ఒక్కొక్కరు రూ.10 వేల చొప్పున జరిమానా చెల్లించాలని, ఆ మొత్తాన్ని 4 వారాల్లో చెల్లించకుంటే నెల రోజుల సాధారణ జైలుశిక్ష అనుభవించాలని ఆదేశించింది. ఐఏఎస్‌ల తో పాటు . కళాశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు జి.యాదగిరి, కల్వకుర్తి ప్రభుత్వ మోడల్ డిగ్రీ…
హైదరాబాద్ లోని కార్వన్ పరిధిలోని మెహబూబ్ కాలనీ లో విచ్చలవిడిగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న వారి గురించి తెలుసుకోవడానికి వెళ్ళిన విద్యుత్ శాఖ ఉద్యోగులపై ఆ ప్రాంత వాసులు దాడికి పాల్పడ్డారు. కాలనీలోకి అడుగు పెట్టగానే కొందరు వ్యక్తులు ఉద్యోగులపై పిడిగుద్దులతో దాడికి దిగారు. ఆ ప్రాంతంలో ప్రాబల్యం ఉన్న రాజకీయ పార్టీకి చెందినా వారే ఈ దాడికి పాల్పడ్డట్టు సమాచారం. బర్కాస్, కార్వాన్ ప్రాంతాల్లో అనేక మంది అక్రమంగా విద్యుత్తు వినియోగం చేస్తున్న విషయం తెలిసి…
ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్లలో, చెవుల్లో, చేతుల్లో, మనసులో అవినీతి ఉందని, ఆయన అవినీతి ఆకాశాన్ని అంటిందని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ విమర్శించారు. అయన చేస్తున్న అవినీతిని అక్రమాలను కవర్ చేయడానికే మానవ హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేయడంలేదన్నారు. టీఎస్ హెచ్ఆర్సీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు చైర్మన్‌ను నియమించలేదని, వారం రోజుల్లో కమిషన్ చైర్మన్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సదాశివపేట పోలీసులపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అక్కడి సీఐ,…