chtisghd 1pol

మొదటి దశ ప్రశాంతం…

ఛత్తీస్ ఘడ్ లో తొలి దశలో 20 స్థానాలకు జరిగిన పోలింగ్ లో 70.87 శాతం ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఇది 6శాతం తక్కువని ఎన్నికల కమిషన్ అధికారి తెలిపారు. కాగా, ఛత్తీస్ ఘడ్ లో మిగతా 70 స్థానాలకు రెండో దశ పోలింగ్ ఈ నెల 17న జరగనుంది.మరోవైపు మిజోరంలో 40 స్థానాలకు గానూ పోలింగ్ సమయం ముగిసే సరికి 77.04 శాతం ఓటింగ్ నమోదైంది.

Read Full News
samaria

సమాచార కమిషనర్”సమారియా”…

సీనియర్ ఐఏఎస్ అధికారి హీరాలాల్ సమారియా భారత సమాచార ముఖ్య కమిషనర్ గా నియమితులైయ్యారు. ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టారు. సమారియా సింగరేణి డైరెక్టర్ గా పనిచేశారు. విద్యుత్ రంగంలో ప్రస్తుత సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వంలో కార్మిక శాఖ విభాగంలో పని చేసి అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. రాజస్థాన్ రాష్ట్రం భారత్ పూర్ కి చెందినా హీరాలాల్ సమారియా ఉమ్మడి రాష్ట్రం లోని…

Read Full News
IMG 20231028 WA0005

తప్పక రావాలి…

వచ్చే ఏడాది అయోధ్యలో చేపట్టే శ్రీ రాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాలని శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఆహ్వానం ఇచ్చింది. జనవరి నెలలో జరిగే ప్రతిష్టకు రావలసిందిగా ట్రస్ట్ సభ్యులు ప్రధానిని కలిసి మొదటి ఆహ్వాన పత్రిక అందజేశారు.

Read Full News
IMG 20231024 WA0060

పిల్లర్లు కుంగడమా…!

అధికారులకే అంతుపట్టని కారణంతో ఆశ్చర్యంగా కుంగిపోయిన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని కేంద్ర బృందం పరిశీలించింది. రెండు రోజుల కిందట కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీ 20వ పిల్లర్ వద్ద కుంగిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని ఈ కమిటీ బ్యారేజీని పరిశీలించింది.19, 20, 21వ పిల్లర్ల వద్ద పగుళ్లకు గల కారణాలను అన్వేషించింది….

Read Full News
dowal kangana

పిక్చర్ పర్ఫెక్ట్…

కేంద్ర ప్రభుత్వ జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ ప్రయాణిస్తున్న విమానంలో బాలీవుడ్ భామ కంగనా రనౌట్ కూడా జర్నీ చేశారు. ఆ విమానంలో దోవల్ తో కలిసి దిగిన సెల్ఫీని కంగనా సోషల్ మీడియాలో పంచుకుంది.

Read Full News
Gaganyaans test

“క్రూ” సేవ్ టెస్ట్ సక్సెస్…

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గగన్‌యాన్ మిషన్‌ డెమో ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. 44 టన్నుల బరువైన ఫ్లైట్ టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్-1 టి.వి.- డి1 రాకెట్ షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఉదయం 10 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ లో  క్రూ మాడ్యూల్, ఎస్కేప్ మాడ్యూల్‌ని నింగిలోకి పంపారు.ఈ ప్రయోగంలో రాకెట్ తనలో ఉన్న క్రూ మాడ్యూల్, క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ను భూమి నుంచి 17 కిలోమీటర్ల…

Read Full News
Gaganyaans test

గగన్ యాన్ “డెమో”ప్రయోగం..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలు పెట్టింది. 21వ తేది ఉదయం 8 గంటలకు “గగన్ యాన్” మిషన్ కి సంబంధించిన డెమో వెహికల్-1ని నింగిలోకి పంపనున్నారు. గగన్ యాన్ ప్రయోగంలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే అందులోని సిబ్బంది ఎలా తప్పించుకోవచ్చు అనే విషయాలను ఈ ప్రయోగం ద్వారా తెలుసుకోవచ్చునని ఇస్రో తెలిపింది.

Read Full News
rapid train

ర్యాపిడ్ “ఎక్స్”…

దేశంలో మొట్టమొదటి “ర్యాపిడ్ ఎక్స్” ప్రాంతీయ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 20వ తేదీన ప్రారంభిస్తారు. డిల్లీ, ఘజియాబాద్,మీరట్ ల మధ్య మొదట ఈ రైలు నడుపుతారు. పూర్తీ ఎయిర్ కండిషన్ బోగిలతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ రైలు గంటకు 16౦ కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.ప్రయాణికులు కూర్చోవడానికి,నిలబదదానికీ విశాలంగా ఉంటుంది. అంతేకాక,ప్రతీ బోగిలో సి.సి. కెమెరా అమర్చారు. లాప్ టాప్, మొబైల్ ఫోన్ లను చార్జింగ్ చేసుకునే సదుపాయం ఉంది.

Read Full News
IMG 20231012 WA0000

జగన్ ని కట్టడి చేయండి..

అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కక్షసాధింపు చర్యలను కట్టడి చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి  అమిత్ షాకు నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. చంద్రబాబును అరెస్ట్, విచారణ పేరుతో వేధిస్తున్న  తీరును అమిత్ షా దృష్టి కి తీసుకు వెళ్లారు.చివరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి ని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. .

Read Full News
Screenshot 20230911 105403 WhatsApp

చంద్రబాబుకి అస్వస్థత…!

రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ పై ఉన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వల్ప అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. గత నాలుగు రోజులుగా ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ఆయన డీ హైడరేషన్ బరినపడ్డట్టు సమచారం. ఇదే విషయాన్ని చంద్రబాబు జైలు అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లినట్టు తెలిసింది. మరింత సమాచారాన్ని జైలు అధికారులే వెల్లడించాల్సి ఉండి.

Read Full News
cec c

ఐదు రాష్ట్రాలకు మోగింది…!

దేశం లోని ఐదు రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికలకు సంబంధించిన తేదీల వివరాలను ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ వివరించారు. తెలంగాణా సహా ఛత్తీస్ ఘర్,  మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరం రాష్ట్రాల్లో నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్నికలు జరగనున్నట్టు తెలిపారు. తెలంగాణాలో నవంబర్ ౩౦వ తేదీన ఒకేవిదతలో పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ ౩న ఫలితాలు ప్రకటిస్తారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ని నవంబర్ ౩న విడుదల చేస్తారు….

Read Full News
babu 1

“బాబు”కు దెబ్బ…

అంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎదురు దెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టి వేసింది.చిత్తూరు జిల్లా అంగళ్లు ఘటన, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో బాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది.

Read Full News
vote from home

“ఓటు” ఫ్రమ్ హోమ్….!

దేశంలోనే తొలిసారిగా ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలో జరగనున్న శాసన సభ ఎన్నికల నుంచి ఈ వెసులు బాటు అందుబాటులోకి వస్తుంది. అయితే, వయో వృద్ధులు, 40శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలకి రాలేని సీనియర్ సిటిజన్లు పోలింగ్ కేంద్రంలోనే ఓటు వేయడానికి ఇష్టపడితే అటువంటి వారి…

Read Full News
Screenshot 20231003 235348 WhatsApp

బిఆర్ఎస్ తిన్నదంతా కక్కిస్తా…

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై విరుసుకు పడ్డారు. ఎన్డీఏ లో చేరతానని  కేసీఆర్‌ వెంటపడ్డారనీ, ఆ ప్రతిపాదనను తాను ఒప్పుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్  జిల్లాలో ఏర్పాటు చేసిన “జనగర్జన” సభలో మోదీ మాట్లాడుతూ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ ఢిల్లీ వచ్చి,తెలంగాణ పాలన పగ్గాలు మంత్రి కేటీఆర్‌కు ఇస్తానని చెప్పినట్టు మోడీ వెల్లడించారు. కేటీఆర్‌ను ఆశీర్వదించాలని కోరినప్పుడు, ఇది రాజరికం…

Read Full News
Screenshot 20231002 004606 WhatsApp

వరాల “మోడీ”…

ములుగు జిల్లాలో 9 వందల కోట్ల రూపాయల వ్యయంతో కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణలోసుమారు 13,500 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే వివిధ రకాల అభివృద్ధి పనులకు అయన శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోడీ మాట్లాడారు. సమ్మక్క- సరక్క ల పేరుతో గిరిజన యూనివర్సిటీ ప్రారంభించనున్నట్టు వివరించారు. అదేవిధంగా రాష్ట్రంలో పసుపు…

Read Full News