మరోసారి”గుడుంబా”రెడీ…

meerajas 1

అమాయక చూపులతో, ఆకర్షించే నటనతో  ప్రేక్షకుల మన్ననలు పొందిన గుండుమల్లె లాంటి బొద్దుగుమ్మ, అందాల కేరళ కుట్టి మీరా జాస్మిన్ గుర్తుండే ఉంటుంది. సరిగ్గా 20 ఏళ్ల కిందట తెలుగు,తమిళ, మలయాళం వెండి తెరల పై నిండిన పాత్రలతో అన్ని వర్గాల అభిమానులను సొంతం చేసుకున్న నటి మీరా.

meera 1

”అమ్మాయి బాగుంది” అంటూ తెలుగు తెరకు పరిచయం అయిన ఆమె భద్ర, గుడుంబా శంకర్, రారాజు, అ.ఆ.ఇ.ఈ., గోరింటాకు, యమగొల మళ్లీ మొదలైంది, మహారధి, మొన్న వచ్చిన విమానం సినిమాల్లో మెప్పించే పాత్రలు  పోషించింది. ఈ వివరాలన్నీ ఇప్పుడెందుకు అనుకుంటున్నారా. విషయం ఏంటంటే ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించిన “గుడుంబా శంకర్” రీ రిలీజ్ కి ముస్తాబయింది. పవన్ పుట్టిన రోజైన సెప్టెంబర్ 2వ తేదిన ఈ సినిమా రెండో సారి తెరకెక్కుతుంది. ఈ సందర్భంగా మీరా మాట్లాడుతూ గుడుంబా శంకర్ సినిమా తనకెంతో ప్రత్యేకమని చెప్పింది. ఈ సినిమా మళ్ళీ విడుదల కావడం నిజంగా సంతోషకరమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *