‘‘యూజ్ లెస్ ఫెలో… ఉద్యోగాలు ఎందుకివ్వడం లేదని నిరుద్యోగులు నిరసన తెలిపితే సముదాయిం చాాల్సింది పోయి తిడతావా? దవడ పళ్లు రాలకొడితే సరి… కండకావరమెక్కి మాట్లాడుతున్నవ్. ఒక్కసారి మడతల చొక్కా.. అరిగిన రబ్బర్ చెప్పులేసుకున్న నీ గతాన్ని గుర్తు చేసుకో’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో కేటీఆర్ పై ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చొప్పదండి నియోజకవర్గం గంగాధరలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాటాడుతూ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పై ధ్వజమెత్తారు. కేటీఆర్ కు కండకావరం తలకెక్కిందని, మీ అయ్య ఉద్యోగాలిస్తానంటడు… నువ్వేమో చెత్త నా కొడుకుల్లారా?.. సన్నాసుల్లారా.. అంటూ బూతులు తిడతావా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో ఏ పార్టీ అధికారంలో వచ్చినా మధ్యంతర ఎన్నికల తథ్యమన్నారు. కాంగ్రెస్ లో అందరూ సీఎంలే. ఒకరిని సీఎం చేస్తే మిగిలిన వాళ్లంతా ఎమ్మెల్యేలను వెంట బెట్టుకుని పార్టీని వీడతారు. ఈ రెండు పార్టీల్లో ఏది అధికారంలోకి వచ్చినా ప్రభుత్వం అర్ధంతరంగా కూలిపోవడం ఖాయమని జ్యోస్యం చెప్పారు.కేసీఆర్ పాలనలో సీఎంసహా మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఫాంహౌజ్ లు కట్టుకున్నారని, కేసీఆర్ కూడా 100 రూముల ప్రగతి భవన్ కట్టుకున్నారని, అలాంటప్పుడు నిలువ నీడలేని పేదలకు మాత్రం గూడు ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలను పక్కనపెట్టి వేరే పార్టీకి అమ్ముడుపోబోమనే గ్యారంటీ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేయలేని దద్దమ్మ కేసీఆర్ 12 శాతం ఓట్ల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎంకు కొమ్ముకాస్తున్నయన్నారు.