అలాంటిది ఏమీ లేదు…

IMG 20240216 WA0018

”రాజధాని ఫైల్స్” సినిమా రిలీజ్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. రాజధాని ఫైల్స్ విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్‌లు, రికార్డ్‌లు సక్రమం గానే ఉన్నాయని కోర్టు చెప్పింది. అయితే, ఈ చిత్రం విడుదలను నిలిపి వేయాలంటూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా నిన్న కోర్టు స్టే విధించింది. మరోసారి శుక్రవారం విచారణకు రాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అక్కడి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా సినిమా ఉందని పిటిషన్ తరపున న్యాయవాది కోర్టుకు చెప్పారు. స్టే ను కొనసాగించాలని కోరారు.

అయితే, స్టే కొనసాగించేందుకు ధర్మాసనం తిరస్కరించింది. నిరభ్యంతరంగా సినిమాను విడుదల చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో, రాజధాని ఫైల్స్ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్వహకులు సన్నాహాలు చేపట్టారు. ఈ నెల 15న సినిమా విడుదల కావాల్సి ఉండగా విడుదలను నిలిపి వేయాలంటూ హైకోర్టు గురువారం స్టే విధించిన విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించిన పూర్తి రికార్డులను అందజేయాలని న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు సినిమా నిర్వహకులు సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్‌లు, రికార్డ్‌ లను కోర్టుకు సమర్పించారు. దీంతో అన్ని సక్రమం గానే ఉన్నాయని, సినిమా విడుదలకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ హైకోర్టు తేల్చి చెప్పింది..ఆంధ్రప్రదేశ్ రాజధాని నేపథ్యంలో రాజధాని ఫైల్స్‌ చిత్రాన్ని భాను ప్రకాశ్‌ తెరకు ఎక్కించగా.. కంఠంనేని రవిశంకర్ నిర్మించారు. ఈ చిత్రంలో వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ నటించారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *