ఇక్కడ”దోపిడీ”-అక్కడ”అరాచకం”..!

reviw c

తెలుగు రాష్ట్రాల ప్రజలు నిజంగా తెలివైన వారే అని ప్రపంచానికి చాటారు.మాటలు ముఖ్యం కాదు, చేతలు కావాలని తేల్చి చెప్పారు. గత ఏడాది తెలంగాణ ఎన్నికల్లో ఉద్యమ పార్టీని చిత్తుగా ఓడించారు. మొన్న ఆంద్రప్రదేశ్ ఎన్నికల్లో వైసిపిని నామరూపాలు లేకుండా చేశారు. తెలంగాణలో “కారు”ని షెడ్డుకి పంపితే, ఆంధ్రాలో “ఫ్యాన్”గాలి సోకకుండా అదుపు చేశారు. అదే తెలుగు ప్రజల రాజకీయ చైతన్యం. అయితే, తెలంగాణలో భారత రాష్ట్ర సమితి, ఆంధ్రా రాష్ట్రంలో వైసిపి కుదేలు కావడానికి ఒకటే సారూప్యత కనిపిస్తోంది. అదే ఒంటెత్తు (ఎద్దు) పోకడ. తెలంగాణలో తెరచాటు అవినీతి, అక్రమాలు భారాసను ఫామ్ హౌస్ కి పంపితే, ఆంధ్రప్రదేశ్ లో వైసిపి నేతల ఆగడాలు, ఆవేశాలు, నోటి దురుసు వ్యవహారాలు జగన్ మోహన్ రెడ్డిని కనుమరుగు చేశాయి. రాజకీయాలు, అధికారం అంటే సంపాదించుకోవడం, కక్ష సాధింపులు కాదనే చక్కటి సందేహాన్ని తెలుగు ప్రజలు సమాజానికి అర్థం అయ్యేలా చూపారు. తెలంగాణలో పదేళ్ల తెరాస, భారాస పాలనలో అవినీతి, అధికారిక దొంగల ముఠాలు రాజ్యమేలాయి. కేసీఆర్,ఆయన అనుయాయులు ఆడిందే ఆటగా పాలన సాగింది.

reviw in
భారాస అవినీతి “ముఠా”

తెలంగాణ వాదాన్ని అడ్డుపెట్టుకొని హైదారాబాద్ నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు అవినీతి బాటలు వేసి అక్రమాలకు పాల్పడ్డారు. దీనికి ఈ వ్యాఖ్యలకు కవిత నిలువెత్తు సాక్ష్యం. దేశంలో “లిక్కర్ క్వీన్”గా చెరగని ముద్ర వేసుకొని తీహార్ జైలు ఊసలు లెక్కబెడుతున్న కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత వ్యవహారం అందరికీ తెలిసిన భాగోతమే. ఎన్ని సాకులు బూకాయించినా కవిత కనుసన్నలలోనే కోట్ల రూపాయల అవినీతి నేరం జరిగిన మాట  వాస్తవం అని సిబిఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరెట్ అధికారులు కోర్టుల ముందు ఆధారాలతో సహా కుండ బద్దలు కొడుతున్నారు. కాళేశ్వరం బ్యారేజీ, ఫార్ములా-ఇ  కార్ రేసింగులు, ఇంటెలిజెన్స్ పోలీసు దొంగల ముఠా, “ధరణి” ముసుగులో గిరిజనుల భూముల దోపిడీ ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడు అన్ని భారాస లీలలను తెలంగాణ జనం బయటకు చెప్పుకోలేక భరించింది. గత నవంబర్ శాసన సభ ఎన్నికల్లో పల్లె ప్రజలే తమ తడాఖా చూపించారు. తెలంగాణ అంటే భారాస, కేసీఆర్, కేటీఆర్ అనే అపోహను ఓట్ల రూపంలో పటా పంచలు చేశారు. గులాబీ దళపతిని రాత్రికి రాత్రే భారాస అడ్డా అయిన ప్రగతి భవన్ నుంచి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి తరలిపోయేలా తీర్పు చెప్పారు.

revw 3 in
వైసీపీ నోటి దురుసు టీమ్

ఇక, ఒక్క ఛాన్స్ అంటూ పదేళ్ల పాటు ఓదార్పు యాత్రలతో ఆంధ్రా జనం అభిమానం చూరగొన్న జగన్ మోహన్ రెడ్డి ప్రజలు నమ్మి ఇచ్చిన గౌరవాన్ని ఐదేళ్లలో ఓమ్ము చేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో రాజకీయంగా  అరోపణలు, విమర్శలు చేసుకోవడం సహజం. కానీ, బాధ్యత గల మంత్రులు, ఎమ్మెల్యే లుగా శాసన సభలో అడుగు పెట్టిన వైసీపీకి చెందిన నాని, అంబటి, రోజా, అనిల్ కుమార్, సజ్జాల, బొత్స వంటి నేతలు అనేక సమావేశాల్లో అడ్డూ, అదుపు లేకుండా చేసిన ప్రసంగాలు సగటు మనిషిని నివ్వెర పరిచాయి. ప్రతీ సమావేశంలో ప్రజా ప్రయోజనాల విషయాలు పక్కన పెట్టి ప్రతిపక్షాలు, వాటి నేతలను బూతు పదాలతో నోటికొచ్చినట్టు విమర్శించడం, అవకాశం ఉన్న చోట దాడులకు పాల్పడడం కూడా ఆంధ్రాలో వైసీపీ జెండా దిగిపోవడానికి కారణాలుగా భావిస్తున్నారు. మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొన్ని నెలల కిందట చెప్పినట్టు బూతులు మాట్లాడే నేతలకు పోలింగ్ బూత్ లోనే సమాధానం చెప్పండి అన్నట్టు అదే రీతిలో ఓటర్లు జగన్ పూర్తీ క్యాబినెట్ కు బై బై చెప్పారు.  

reviw sharml in
అన్న జగన్ పై పోరు

ఏ వ్యక్తికైనా ఇంట్లో కుటుంబ గౌరవం ఉంటేనే మానసిక స్థైర్యం, సమాజంలో గౌరవం ఉంటుంది. అలాంటిది, ఎన్నికల సమయంలో సొంత తల్లి, సోదరి రొడ్డుకెక్కి జగన్ పై విరుసుకు పడడం  వైసీపీకి శాపంగా మారింది.  షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకొని అన్న జగన్ “దొంగ”, స్వార్థ పరుడు అనే మాదిరిగా  ప్రసంగాలతో దండ యాత్ర చేయడం ఓటర్లను ఆలోచనలో పడేసింది. ఒక విధంగా చెప్పాలంటే  జాగన్ ని ఓడించడమే లక్ష్యంగా షర్మిల అస్త్రాలు సంధించారు. ఆంధ్రాకు రాజధాని లేకుంటా చేశారనీ, బ్రాండ్ లు లేని మద్యం ఏరులై పారుతోందనీ షర్మిల చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి భారం తగ్గించిన్నట్టయింది.

reviw in 1
కుటుంబమే శత్రువు..

పోలింగ్ తేదీకి  ముందు “షర్మిలను ఆశీర్వదించండి” అంటూ విజయమ్మ  పంపిన సందేహం జగన్ కి తీరని లోటు మిగిల్చింది. కుటుంబంలో నాలుగు గోడల మధ్య అసలు ఏం జరిగిందో తెలియదు కానీ విజయమ్మ సందేశం మాత్రం ఒక రకంగా జగన్ కి గొడ్డలి పెట్టు.

reviw in 2
బాబు అరెస్టు…

జగన్ ప్రభుత్వం చేసిన మరో ఘోర తప్పిదం రాజకీయ అనాలోచితంగా చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడం. ఎన్నికలు సమీపిస్తున్న విషయాన్ని సైతం మరచిపోయి నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న మాజీ ముఖ్యమంత్రి బాబుని రాత్రికి రాత్రే అరెస్టు చేయడం ఆంధ్రా జనానికే కాదు, రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవ్వరికీ నచ్చలేదు. అందుకే అనుకుంటా, వైసిపి పతనానికి రాజమండ్రి కేంద్ర కారగారమే బీజం నాటిందనే వాదన తెరపైకి వచ్చింది. బహుశా అదే కాబోలు జనంలో పెల్లుబికిన నిరసన వైసిపిని సభలో 11 సీట్లకే కట్టడి చేసింది. బాబు అరెస్టుని ప్రజలు జగన్ కక్ష సాధింపులో భాగంగా చూశారే తప్ప దాన్ని నేరంగా భావించలేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సరళిని చూస్తుంటే నాయకులూ మీలో మీరు ఎన్ని రాజకీయాలైనా చేసుకోండి, ఎన్ని కథలైనా పడండి కానీ ఏ సమయంలో ఎవరిని నాయకుడు కావాలో నిర్ణయించేది మేమే అంటూ తెలివైన తెలుగు ప్రజలు “వేలుపై సిరా” గుర్తు చూపుతూ వెక్కిరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *