ముఖ్యమంత్రీ లేడు..మూడు ఎకరాలూ లేవు ..!
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో ఆచితూచి వ్యవహరించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉంటుంది. ఏ విపక్షమైన సమయం, సందర్భం, సమస్యల తీవ్రతను ప్రామాణికంగా తీసుకుంటుంది. అందుకు అనుగుణంగా వ్యూహ రచనలు చేసుకొని అధికార పక్షం పై పోరాటానికి సిద్ధం అవుతాయి. కానీ, తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న తంతు అందుకు భిన్నంగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఉద్యమ పార్టీ ముసుగులో ప్రజల ముందు అనేక హామీలను గుప్పించి అధికారం చేజిక్కించుకున్న భారత రాష్ట్ర సమితి,(బి.అర్.ఎస్.)…