Screenshot 2023 07 14 084311

ఎందుకలా …

తెలంగాణలో సంచలనం రేకెత్తించిన ఎమ్మెల్యే కొనుగోలు అంశం బట్టబయలు చేయడంలో కీలక పాత్ర పోషించిన తాండూర్ ఎమ్నెల్యే రోహిత్ రెడ్డికి, కేసీర్ సర్కార్ Y కేటగిరి అదనపు భద్రతను కల్పించింది‌… అయితే, తన భద్రతా సిబ్బందితో కలిసి రోహిత్ పోటో షూట్ లో పాల్గొనడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకలా చేయాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు.

Read More
kishan usa

స్వాగతం…

న్యూయార్క్ లోని జాన్ ఎఫ్ కెనడి అంతర్జాతీయ విమానాశ్రయంలో బిజెపి తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి కి సాదర స్వాగతం లభించింది.

Read More
mohanbabu

మండిపడ్డ “మంచు”…

ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు షాద్ నగర్‌లో మీడియాపై కాసేపు మండి పడ్డారు. ఓ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఆయన స్థానిక సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చారు. అయితే, మోహన్ బాబు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న స్థానిక మీడియా ప్రతినిధులు కొందరు కవరేజ్‌కు వెళ్లారు. మీడియాను చూడగానే మోహన్ బాబు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. “ఆ లోగోలు లాక్కొండయ్యా” అంటూ బౌన్సర్లకు సూచించారు. మీడియా ప్రతినిధులకు బుద్ధి లేదా అంటూ నోటికి పని చెప్పారు. సీనియర్ నటుడైన…

Read More
kavitha bonam

ఆస్ట్రేలియాలో…

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో జరగనున్న బోనాల పండుగలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. ఈనెల 15న ఆస్ట్రేలియాలోని బ్రిస్ బేన్ నగరంలో “భారత జాగృతి ఆస్ట్రేలియా” ఆధ్వర్యంలో బోనాల సంబరాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు బ్రిస్ బేన్ లోని గాయత్రి మందిరంలో జరగనున్న ఈ వేడుకలలో ప్రవాస భారతీయులతో పాటు ఆస్ట్రేలియా మంత్రులు, ఎంపీలు హాజరుకానున్నారు. అదేవిధంగా జులై 16న న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ నగరంలో జరగనున్న బోనాలు వేడుకలో కవిత పాల్గొంటారు. న్యూజిలాండ్ తెలంగాణ…

Read More
revanth c

పాస్ పోర్ట్ బ్రోకర్ కెసిఆర్…

గత రెండు రోజులుగా పుట్టలో పడుకున్న పాములు బయటకు వచ్చి నన్ను నిందించే ప్రయత్నం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అమెరికాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కాంగ్రెస్ విధానాల గురించి వివరించి వారి సందేహాలను నివృత్తి చేసామని తెలిపారు. 24గంటల విద్యుత్ సరఫరా విషయంపై సాంకేతికంగా వివరించే ప్రయత్నం చేసామని,  కేటీఆర్, బీఆరెస్  మా వీడియోను ఎడిట్ చేసి ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించారు. బీఆరెస్ చిల్లర రాజకీయ ప్రయత్నంతో…

Read More
drone c

రైతులకు క్రిషి 2.0 …

దేశంలో ప్రముఖ డ్రోన్ తయారీ, టెక్నాలజీ ప్రొవైడర్   డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మానవ రహిత వైమానిక వాహనం (యు ఏ వి )   క్రిషి 2.0  ను ఆవిష్కరించింది.  క్రిషి 2.0 డ్రోన్ 10 కిలోల పేలోడ్ సామర్థ్యంతో రూపొందించారు.  ఈ డ్రోన్  రోజుకు 30 ఎకరాల్లో  క్రిమిసంహారక, పురుగు మందులను  పిచికారీ చేస్తుంది.   నెలలో   750 నుండి 900 ఎకరాల్లో  రైతులు  తమ పంటలను కాపాడుకునేలా అవసరమైన మందులను పిచికారీ చేసే  అవకాశం ఉంది….

Read More
harisha c

ముమ్మరం చేయండి…

రాష్ట్రంలోని భోదనసుపత్రుల్లో 190 అసిస్టంట్ ప్రొఫెసర్ పోస్టులకు  అసోసియేట్ ప్రొఫెసర్ గా పదోన్నతులు కల్పించే ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలని, కౌన్సిలింగ్ పూర్తి చేసి వెంటనే పోస్టింగ్ లు ఇవ్వాలని రాష్ట్ర  ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రొఫెసర్ నుండి అడిషనల్ డిఎంఇగా పదోన్నతి పొందేందుకు వీలుగా వయోపరిమితి 57 ఏళ్ల నుండి 64 ఏళ్లకు…

Read More
Screenshot 2023 07 13 091710

నమస్తే.. నా పేరు లీసా..

ఛానల్స్ లో ఇక మరింత సాంకేతిక మార్పు రావచ్చు. ప్రత్యేకంగా అందమైన యాంకర్ల కోసం వెతకడం, వాళ్ళను ఇంటర్వ్యూలు చేసి, వడపోసి ఎంపిక చేయడం లాంటి ప్రక్రియలకు భవిష్యత్తులో తెర పడవచ్చు. తడబాట్లు , బిడియం వంటి తలనొప్పులకు తావులేకుండా బుట్ట బొమ్మల్లాంటి యాంకర్లతో కార్యక్రమాలు చేయించ వచ్చు. ఎలాంటి యాంకర్లు, న్యూస్ రీడర్లు కావాలో ఉహించుకొని అలాంటి వాళ్ళను తెరపై చూపవచ్చు. అందుబాటులోకి వస్తున్నా సాంకేతిక పరిజ్ఞానం ఈ వెసులుబాటును కల్పించనుంది. అదే ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్…

Read More
Screenshot 2023 07 12 220255

పోలీసు రక్షణ లోనే…

రాజస్తాన్ గ్యాంగ్ స్టార్ కుల్దిప్ జగినా గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యారు. పోలీసులు అతన్ని కోర్టుకు తీసుకువెళ్తుండగా భారత్ పూర్ వద్ద గల అమోలి టోల్ ప్లాజా వద్ద కుల్దిప్ ప్రత్యర్ధి ముఠాకు చెందిన వారు కాల్చి చంపినట్టు రాజస్తాన్ డిజిపి ఉమేష్ మిశ్రా చెప్పారు. సంఘటనకు సంబంధించి విచారణ చేపట్టినట్టు తెలిపారు. పోలీసు వాహనంలోనే అంత బందోబస్తు మధ్య కుల్దిప్ ను హతమార్చడం పై అనుమానాలు తలెత్తుతున్నాయి.

Read More
bindi

బొట్టు పెట్టుకుంటావా…

ఝార్ఖండ్ లోని సెయింట్ జేవియర్ స్కూలులో నుదిటి పై బొట్టుపెట్టుకొని వెళ్ళిన ఓ విద్యార్ధినిని టీచర్ చంప దెబ్బలు కొట్టడం తో అవమానభారం భరించ లేక ఆ విద్యార్ధిని ఆత్మహత్య ప్రయత్నం చేసింది. విషయం బయటకు పొక్కడంతో తల్లిదండ్రులు, పోలీసులు పాపను ఆసుపత్రికి తరలించారు.  

Read More
racha in1

కరెంటు రచ్చ..

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఉచిత కరెంటు పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అంటూ అధికార టిఆర్ఎస్ మండి పడుతోంది. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా  రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు మేపట్టింది, నాయకులూ, మంత్రుల అధ్వర్యంలో అన్ని జిల్లాలలో నిరసనలో భాగంగా రాస్తారోకోలు, దిస్తిబోమ్మలను దగ్దం చేశారు.ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లో ఇతర నాయకులు జిల్లాల్లో నిరసన చేపట్టారు.మహబూబ్ నగర్ లోని తెలంగాణ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో  రాష్ట్ర…

Read More
cm sc c

పుస్తకం భేష్…

ఎస్టీ జాతుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సృజనాత్మక పథకం‘చీఫ్ మినిస్టర్స్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీం (సీఎంఎస్ఇఇఐ) ద్వారా వివిధ రంగాలలో లబ్ధిదారులైన ఎస్టీ యువతీ యువకుల విజయగాథలను, సాధించిన ప్రగతికి సంబంధించిన సమాచారాన్ని దశాబ్ధి ఉత్సవాల నేపథ్యంలో  రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ పుస్తక రూపంలో ప్రచురించింది. ఈ పుస్తకాన్ని సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  ఆవిష్కరించారు. ఈ  కార్యక్రమంలో  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి…

Read More
himachal 12

క్షేమంగా రావాలి…

హైదరాబాద్ నగరానికి చెందిన ముగ్గురు డాక్టర్లు హిమాచల్ ప్రదేశ్ మనాలి లోని వరద ముంపు ప్రాంతంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఉస్మానియా ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ బానోత్ కమల్ లాల్, డాక్టర్ రోహిత్ సూరి, డాక్టర్ శ్రీనివాస్ వరదల్లో చిక్కుక్కున్నారు. ముగ్గురు డాక్టర్ల ఫోన్స్ స్విచ్చాఫ్ అయినట్లు సమాచారం. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.డాక్టర్ల ఆచూకీ కోసం తెలంగాణ డాక్టర్ల సంఘం ఢిల్లీ రెసిడెంట్ కార్యాలయాన్ని సంప్రదించింది.

Read More