అక్కడ స్థలాలు పక్కా…..
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగం పెంచింది. వచ్చే జనవరి లోగా అర్హులైన పాత్రికేయులకు మూడు సెంట్ల స్థలం అందజేసేందుకు విధి,విధానాలను రూపొందించింది. ఆ వివరాలు..
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగం పెంచింది. వచ్చే జనవరి లోగా అర్హులైన పాత్రికేయులకు మూడు సెంట్ల స్థలం అందజేసేందుకు విధి,విధానాలను రూపొందించింది. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీ సత్య సాయి జిల్లాలో మొట్ట మొదటి సారిగా రైతు భరోసా బహిరంగ సభకు హాజరయ్యారు. పుట్టపర్తి విమానాశ్రయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ వారు ఘనంగా స్వాగతo పలికారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ రత్నాకర్ఆ, జగన్ ల ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.
విశాఖ సాగర తీరాన “నేవీ మారథాన్” ఉత్సాహంగా సాగింది. నగరంలోని ఆర్కే బీచ్ పార్క్ కూడలి వద్ద నిర్వహించిన ఈ మారథాన్‌లో పెద్ద సంఖ్యలో యువతీ,యువకులు, నేవీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ కూడలి నుంచి భీమిలి వరకు ఈ రన్ నిర్వహించారు. 42.2 కి.మీ ఫుల్ మారథాన్, 21.1 కి.మీ హాఫ్ మారథాన్, 10కే, 5కే, కిలోమీటర్ల విభాగాల్లో ఈ మారథాన్ కొనసాగింది. ఫుల్ మారథాన్‌ను ఈఎన్‌సీ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేశ్, హాఫ్ మారథాన్‌ను వైస్…
ఆంధ్రా మెడికల్ కాలేజీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఉప రాష్ట్రపతి జగ్ దిప్ ధన్ కర్ విశాఖపట్నం చేరుకున్నారు. ఐ.ఎన్.ఎస్. డేగా ఎయిర్ బేస్ కి చేరుకున్న ఆయనకు అంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వాగతం పలికారు.
జనసేన, తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశంలో పాల్గొనేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాజమండ్రి చేరుకున్నారు. రాజమండ్రి విమానాశ్రయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు పితాని బాలకృష్ణ, జిల్లా నాయకులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, అత్తి సత్యనారాయణ, వై. శ్రీను, బత్తుల బలరామకృష్ణ, తుమ్మల బాబుపొలసపల్లి సరోజ, ప్రియా సౌజన్య తదితరులు పవన్ కళ్యాణ్ కి స్వాగతం…
దేశంలోని ఏ రాష్ట్రంలో కనిపించని రాజకీయ వ్యవస్థ అంధ్రప్రదేశ్ లో వేళ్ళూనుకుంటున్నట్టు కనిపిస్తోంది. రాజకీయం వేరు, వ్యక్తిగత వ్యవహారాలు వేరు అనే నానుడికి అంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాలం చెల్లుతోందని పరిశీలకులు భావిస్తున్నారు. చట్టాలను, నిబంధనలను ఉల్లంఘించిన ఎవరినైనా సరే అదుపులోకి తీసుకోవడం, అరెస్టు చేయడం తప్పు కాదు. ఒక అనుమానితుడిని అరెస్టు చేస్తే అతని నేర విచారణ వ్యవహారం చట్టం, న్యాయం చూసుకుంటాయనేది జగత్ విదితమే. కానీ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితి పూర్తీ భిన్నంగా ఉండడం…
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారాహి యాత్రపై రాళ్ల దాడికి ప్లాన్ చేశారంటూ పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలకు సాక్ష్యాలు ఏవైనా ఉన్నాయా అని నోటీసులు ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ జాషువా వెల్లడించారు. పవన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అందుకే నోటీసులు ఇచ్చామని, దాడులు జరగుతాయనే సమాచారం మీకు ఎక్కడి నుంచి వచ్చిందనేది మాకు తెలియజేయలని కోరినట్టు, నోటీసులకు పవన్ నుంచి తిరుగు…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రమైన వెన్ను నొప్పికి గురయ్యారు.కృష్ణా జిల్లాలో నిర్వహించిన జనవాణిలో పవన్ తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడ్డారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తూ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో నొప్పిని తట్టుకోలేక ఆయన జనవాణి కార్యక్రమం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ చేపట్టిన “మోత మోగిద్దాం” కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలతో కలిసి నారా బ్రాహ్మిణి సైతం గంట మోగించి, ఈల శబ్దం చేశారు. ఆంధ్రా, తెలంగాణా ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో టిడిపి శ్రేణులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.
ఆంధ్రప్రదేశ్ లో కురు క్షేత్ర యుద్ధం జరగబోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నిరుపేదల వైపు నిలబడిన ప్రభుత్వానికి, పేదలను వంచించిన గత ప్రభుత్వానికి మధ్య యుద్ధం ఉంటుందని తెలిపారు. పేదలకు, పెత్తందారులకూ మధ్య యుద్ధం జరగనుందని పేర్కొన్నారు.అమరావతి పేరుతో స్కామ్, స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, నీరు-చెట్టు పేరుతో దోపీడీ చేసిన వారితో యుద్ధం జరగబోతుందని జగన్ అన్నారు. విజయవాడలో వరుసగా అయిదో ఏడాది వాహన మిత్ర నిధులను జగన్ విడుదల…
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి కొత్త కార్యక్రమానికి రంగం సిద్దం చేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు ఓదార్పు, ప్రజా సంకల్ప యాత్రల పేరుతో జనంలోకి వెళ్ళిన అయన ఈ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అయితే , ఈ సారి రాబోయే ఎన్నికల్లో జనంలోకి వెళ్లేందుకు అయన కొత్త పందాని అవలంభిచనున్నారు. వైసిపి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యక్రమాలను చూపుతూ ప్రజా…
ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న విద్వేష పూరిత రాజకీయాల గతంలో ఎప్పుడూ లేవని బ్రాహ్మణి ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జనసేన నాయకులు, పలు నియోజవర్గాల ఇంచార్జ్ లు నారా బ్రాహ్మణిని కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ రాష్ట్రంలో పరిస్థితులు రోజురోజుకూదిగజారుతున్నాయని, రాక్షస పాలనపై ఉమ్మడం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ, ఎవరూ చూడలేదని అన్నారు. చంద్రబాబుపై కేసు విషయంలో అన్ని డాక్యుమెంట్లు,…
ఆంధ్రప్రదేశ్ శాసన సభ మొదటి రోజు సమావేశాలు రసాభాసగా మారాయి. సభ ప్రారంభం కాగానే తెలుగుదేశం సభ్యులు చంద్రబాబు అరెస్టుపై వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాలని టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. ఇదే సందర్భంలో అధికార పార్టీ సభ్యులు సైతం పోడియం వద్దకు చేరడంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ ఎం.ఎల్.ఎ. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా తెలుగుదేశం సభ్యులతో జతగట్టడం విశేషం. ఇదే సందర్భంల్లో ఎం.ఎల్.ఎ. నందమూరి బాలకృష్ణ మీసం మేలవేయడం చర్చనీయాంశంగా…
ఆంధ్ర ప్రదేశ్ పరిపాలన వ్యవస్థ ను వచ్చే దసరా నుంచే విశాఖకు మార్చాలని నిర్ణయించినట్లు మంత్రి చెల్లబోయిన వేణు గోపాలకృష్ణ తెలిపారు. విశాఖకు కార్యాలయాల తరలింపునకు కేబినేట్ ఆమోదం తెలిపిందని, కార్యాలయాల ఎంపికపై కమిటీని నియమించాలని సీఎం జగన్ ఆదేశించినట్లు వివరించారు. సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో బుధవారం నాడు కేబినేట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక బిల్లులకు కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. కేబినేట్ నిర్ణయాలను సచివాలయ పబ్లిసిటీ సెల్ లో…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి జ్వరం వచ్చింది. ఆయనకు వైరల్ ఫీవర్ సోకడంతో బలహీనంగా ఉన్నారు. కేబినెట్ భేటీ తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.తర్వాత కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్నారు. అయితే, మధ్యాహ్నం తర్వాత సీఎం జగన్ ను కలిసేందుకు ఇచ్చిన అన్ని అపాయింట్లను రద్దు చేశారు. జలుబు, దగ్గు కూడా ఉండటంతో వైరల్ ఫీవర్ గా గుర్తించారు. 22 నుంచి జరగబోయే శాసనసభ సమావేశాలు ప్రభుత్వానికి అత్యంత కీలకం.