జనసేన, తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశంలో పాల్గొనేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాజమండ్రి చేరుకున్నారు. రాజమండ్రి విమానాశ్రయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు పితాని బాలకృష్ణ, జిల్లా నాయకులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, అత్తి సత్యనారాయణ, వై. శ్రీను, బత్తుల బలరామకృష్ణ, తుమ్మల బాబుపొలసపల్లి సరోజ, ప్రియా సౌజన్య తదితరులు పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ పీఏసీ ఛైర్మన్ శ నాదెండ్ల మనోహర్ కూడా రాజమండ్రి చేరుకున్నారు. మంజీర హోటల్లో జరగనున్న రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొంటారు.