Screenshot 2023 07 30 114523

ఇప్పుడు బిజెపి వైపు…

ప్రముఖ నటి, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి  రానున్నారు.  ఆమె త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరే  సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డిని జయసుధ కలవడంతో ఈ ఉహగానలకు తెరలేచింది. ఇద్దరూ సుమారు గంటకు పైగా సమావేశం అయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆమె బీజేపీలో చేరేందుకు రెండు, మూడు  రోజుల్లో న్యూఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు వీలైనంత ఎక్కువ మంది…

Read Full News
bhadra c

టెన్షన్..టెన్షన్ …

కుండపోత వర్షాలతో వరంగల్ భద్రకాళి చెరువుకు గండి పడింది. ఈ  చెరువు గండిపడడంతో ఆ చుట్టుపక్కల ఉన్న  పోతననగర్, సరస్వతినగర్ కు ప్రమాదం పొంచి ఉంది. సమాచారం అందుకున్న మున్సిపల్, ఎన్.డి.ఆర్.ఎఫ్. అధికారులు హుటహుటిన గండి పడ్డ ప్రాంతానికి చేరుకున్నారు. నివాస గృహాలవారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నరు. వరంగల్ మేయర్ గుండు సుధారాణి,  జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ పాషా  గండి ప్రాంతాన్ని పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Read Full News
bheem c

దళితుల “ప్రగతి” భేష్…

దళితుల అభ్యున్నతి, వారి సంక్షేమం కోసం రాష్ట్రంలో అమలవుతున్న దళితబంధు సహా పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, ఎస్సీ కులాలను సామాజిక, ఆర్థిక వివక్ష నుండి ఆత్మ గౌరవం దిశగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న దళిత ప్రగతి కార్యాచరణ దళిత జాతి విముక్తికి బాటలు వేసేలా ఉందని, ఇది యావత్ దళిత జాతి గర్వించదగ్గ సందర్భమని  భీమ్ ఆర్మీ  చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. హైదరాబాద్ పర్యటన సందర్బంగా  ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి…

Read Full News
cs shanti 1

ఇక ఆరోగ్యంపై దృష్టి…

గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తగ్గు ముఖం పట్టినందున వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. భారీ వర్షాలు, వరదల తాకిడికి గురైన జిల్లాల్లో చేపట్టిన సహాయ, పునరావాస చర్యలు, ముందు జాగ్రతల పై ఆమె జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ ఇప్పటి వరకు వరద…

Read Full News
Screenshot 20230727 203032 WhatsApp

వాగు దాటపోయి…

వరద నీటితో ప్రవహిస్తున్న వాగుని బైక్ పై దాటుతూ అదుపుతప్పి వాగులో కొట్టుకు పోయాడు ఓ వ్యక్తి. వరంగల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కన్నారం గ్రామానికి గ్రామానికి చెందిన మహేందర్ అనే వ్యక్తి బైక్ వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు కింద పడి కొట్టుకుపోయాడు. సమాచారం తెలసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని జాలర్ల సహాయంతో గాలిస్తున్నారు.

Read Full News
pawan 16

ఆదుకోండి…

తెలంగాణలో వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలని జనసేన  అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోరారు.   రాష్ట్రంలో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వర్షాలకు తోడు వరద ప్రభావం కూడా భూపాలపల్లి జిల్లాలో పలు గ్రామాలను జల దిగ్బంధం చేసిందని, భూపాలపల్లి జిల్లా, మోరంచపల్లి గ్రామం వరదలో చిక్కుకున్న విషయం నా దృష్టికి వచ్చిందన్నారు. దాదాపు 200 కుటుంబాలు సాయం కోసం ఎదురుచూస్తున్నాయని, ములుగు జిల్లాలోని ముత్యాలధార జలపాతం వద్దకు వెళ్ళిన 40…

Read Full News
amishaa

హైదరాబాద్‌ కు అమిత్ షా…

 బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. శనివారం మధ్యాహ్నం 3:45 గంటలకు ప్రత్యేక విమానంలో అమిత్‌ షా హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు జేఆర్‌సీ కన్వెన్షన్‌లో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, మేధావులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, సామాజిక సంఘాల నాయకులతో భేటీ అవుతారు. సాయంత్రం 5:15 గంటలకు శంషాబాద్‌లోని నోవాటెల్‌కు చేరుకొని 8 గంటల వరకు పార్టీ ముఖ్య నేతలతో భేటీ…

Read Full News
kavit bhim c

అంబేద్కర్ పేరు పెట్టండి..

నూతన పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ భవనంగా నామకరణం చేయాలని, ఆ భవనంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని భీమ్ ఆర్మీ చంద్రశేఖర్ ఆజాద్ చేస్తున్న డిమాండ్ కి తెలంగాణ ప్రజల మద్దతు ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. రెండు రోజుల పర్యటన కోసం హైదరాబాద్ వచ్చిన చంద్రశేఖర్ ఆజాద్ కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్…

Read Full News
iit con

ఇలా చేద్దాం..

ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్ధులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఇండియన్ ఇనిస్టిట్యుట్ అఫ్ టెక్నాలజీ (ఐఐటి), నేషనల్ ఇనిస్టిట్యుట్  టెక్నాలజీ (ఎన్ఐటి)కి చెందిన అధ్యాపకులు అభిప్రాయపడ్డారు. ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ అధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా  రెండురోజుల పాటు జరిగిన సమావేశాల్లో దేశ వ్యాప్తంగా ఉన్న 29 ఐఐటిలు, ఎన్ఐటిలకు చెందినా డీన్ లు పాల్గొన్నారు. ఈ  సమావేశాలను ఐఐటి హైదరాబాద్ బ్రాంచి డైరెక్టర్ బి.ఎస్.మూర్తి ప్రారంభించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం, సమాజ పరిస్థితులకు…

Read Full News
telangana loto

శుక్రవారం కూడా సెలవు..

రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రకాల విద్యా సంస్థలకు రేపు ( శుక్రవారం) సెలవు ప్రకటించాలని, అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు  ఆదేశించారు.

Read Full News
Screenshot 2023 07 27 120911

పాము అంటే పట్టించుకోరా…

ఇంట్లోకి వచ్చిన పామును పట్టుకోవాలని చేసిన ఫిర్యాదుకు అధికారులు స్పందించ లేదు. ఎంతసేపు వేచి చూసినా వారి జాడ కనిపించలేదు. అలాంటప్పుడు ఎవరైనా ఏం చేస్తారు నలుగురి సహాయం తీసుకోని పాముని పట్టుకోవడమో, చంపడమో చేస్తారు. కానీ, మహా నగరంలో మాత్రం అలా జరగలేదు. మున్సిపాలిటి అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఆ పాముని పట్టుకొని నేరుగా ఆఫీసుకు కెళ్ళాడు ఓ యువకుడు. హైదరాబాద్ అల్వాల్ లో ఈ సంఘటన జరిగింది. ఆ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి పాము…

Read Full News
godavari 23

బిరబిరా…గలగలా…

భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద వల్ల భద్రాచలం వద్ద నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది. గురువారం ఉదయానికి 50.50 అడుగులకు చేరుకుంది. దీంతో 3 వ ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంది. ఇప్పటికే పలు కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. భద్రాద్రి దేవస్థానం ముందున్న విస్టా కాంప్లెక్స్, అన్నదాన సత్రంలోకి వరద నీరు చేరింది. గోదావరి ఉధృతిని ముందు నుంచే అంచనా వేస్తున్న…

Read Full News
cs rain c

అప్రమత్తంగా ఉండండి..

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న 48 గంటలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున అత్యంత అప్రమత్తతతో ఉండాలని జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్.పి లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా సి.ఎస్ మాట్లాడుతూ రానున్న 48 గంటలలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐ.ఎం.డి…

Read Full News
Screenshot 2023 07 26 124824

చచ్చి బతికి దహనం…

రాష్ట్రంలో స్మశాన వాటికలను అభివృద్ధి చేస్తామని చెబుతున్న ప్రభుత్వానికి ఆ పనులు ఆచరణలో జరగడం లేదు అనడానికి ఈ సంఘటనే నిలువెత్తు సాక్ష్యం. ఒకవైపు కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ఊరిలో స్మశానం లేక చనిపోయిన అంతిమ సంస్కారాలకు నానా తంటాలు పడ్డారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందిన వృద్దుడి దాహాన సంస్కారాలు చేయాలంటే వాగుదటి పోవలసిన దుస్థితి. శవాన్ని తప్పని సరి స్మశానానికి తీసుకు వెళ్ళాల్సిందే. దీంతో బంధువులు, కొందరు గ్రామస్తులు…

Read Full News