రిమాండ్…

IMG 20230906 WA0001 1

ఆంధ్రప్రదేశ్  టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎ.సి.బి. కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. గంటల తరబడి జరిగిన వాదోపవాదనల్లో బాబు అరెస్టుకి సంబంధించి సి.ఐ.డి. పోలీసులు పకడ్బందీ ఆధారాలు చూపడంతో  న్యాయస్థానం చంద్రబాబుకు బెయిల్ నిరాకరంచింది. 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబుని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించేందుకు పోలీసులు రంగం సిద్దం చేస్తున్నారు.స్కిల్ డెవలప్ మెంట్ లో జరిగిన కుంభకోణంలో చంద్రబాబునాయుడు ప్రమేయం ఉందని శనివారం రాత్రి ఆయనను నంద్యాలలో క్యాంపు కార్యాలయంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విజయవాడ నుంచి రాజమండ్రి వరకు ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *