“ఆరు”మాత్రమే కాదు…ఇంకా అనేకం…

cong menifesto

పొరుగు రాష్ట్రం కర్ణాటకలో మాదిరిగా కొద్ది రోజుల్లో జరిగే తెలంగాణ శాసన సభ ఎన్నికల్లోనూ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ జనాకర్షణకు ప్రయత్నిస్తోంది. అధికార బిఆర్ఎస్ ని ఎదుర్కోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ అధికాయకత్వం ప్రచార రంగంలోకి దిగుతోంది. వచ్చే ఎన్నికల్లో తమకు అధికారం ఇస్తే చేపట్ట్టే సంక్షేమ కార్యక్రమాలను ఇప్పటికే రూపకల్పన చేసింది. ప్రధానంగా “సిక్స్ పెయింట్” పార్ములా పై దృష్టి సారించింది. కర్ణాటకలో పార్టీ గెలుపినకు దోహదం చేసిన ఆరు ఆకర్షక పధకాలను జనంలోకి తిసుకువేల్లాదానికి కార్యాచరణ అమలు చేస్తోంది. జాతీయ స్థాయి నాయకులు మొదలు క్షేత్ర స్థాయి కార్యకర్తల వరకు ఆరు పధకాల ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. ఎన్నికల  మేనిఫెస్టోలో కూడా రకరకాల హామీలు సహా ఆరు పధకాల పైనే కాంగ్రెస్ ప్రధానంగా ఆశలు పెట్టుకుంది. ఈ పధకాల లాభాలు జనానికి పూర్తీ స్థాయిలో అర్ధమైతే అధికారం ఖాయం అనే గట్టి నమ్మకంతో ఉంది. పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేశారు. ఇందులో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి.

conres logo

తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలలో ప్రాణాలర్పించిన యువతీ, యువకులను ఉద్యమ అమరవీరులుగా గుర్తించి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, తల్లికి గాని, తండ్రికి గాని, భార్యకు గానీ రూ. 25000 ల అమరవీరుల గౌరవ పెన్షన్ అందజేత, ఉద్యమంలో పాల్గొన్న యువతపై నమోదైన కేసులను ఎత్తి వేయడంతో పాటు, జూన్ 2న వారికి తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు, ఇందిరమ్మ బహుమతి పథకం కింద వివాహ సమయంలో అర్హులైన మహిళలందరికీ రూ.1 లక్ష, 10 గ్రాముల బంగారం. విద్యార్థులందరికీ ఉచిత ఇంటర్నెట్, 18 ఏళ్లు నిండిన మహిళా కళాశాలకు వెళ్లే విద్యార్థులందరికీ ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్లు,  విద్యా భరోసా కార్డు కింద ప్రతి కళాశాలకు వెళ్లే విద్యార్థికి రూ. 5 లక్షలు విద్యా ఖర్చుల కోసం. ఆరోగ్య శ్రీ కింద రూ. 10 లక్షలు, అన్ని ప్రధాన వ్యాధులను కవర్ చేస్తుంది. జర్నలిస్టు సంక్షేమ నిధికి రూ.100 కోట్లు,  మరణించిన జర్నలిస్టుల కుటుంబానికి రూ.2 లక్షలు, హెల్త్ కార్డులు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు. శారీరక వికలాంగులందరికీ ఉచిత రవాణా, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునికీకరణ మరియు హెరిటేజ్ ట్యాగ్‌తో ఉస్మానియా జనరల్ ఆసుపత్రిని పునరుద్ధరించడం, ఇళ్లు లేని పేదలకు ఒక్కొక్కరికి 5 లక్షలు,  ఇళ్లు లేని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఇంటి నిర్మాణానికి ఇళ్ల స్థలాలు ఉంటే రూ.6 లక్షలు, ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు, దాదాపు 2 లక్షల ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ డీఎస్సీ ద్వారా భర్తీ చేయడం, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వార్షిక ఉద్యోగ క్యాలెండర్ ప్రకటన, బాసర్ తరహాలో 4 ఐఐఐటీల ఏర్పాటు,  రూ.2 లక్షల పంట రుణాలు ఒకేసారి మాఫీ,  రూ. 3 లక్షల వరకు వడ్డీ లేని పంట రుణం, వ్యవసాయ రంగానికి 24 గంటల పాటు నిరంతరాయ ఉచిత విద్యుత్, అన్ని ప్రధాన పంటలకు సమగ్ర పంట బీమా, యాదవ, కుర్మ సంఘాల సభ్యులకు మేకలు, గొర్రెల పెంపకం కోసం నేరుగా రూ.2 లక్షలు, నిర్మాణ కార్మికులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, స్విగ్గీ, జొమాటో కార్మికులు మొదలైన గుర్తింపు లేని రంగ కార్మికులందరికీ సామాజిక భద్రతా వ్యవస్థ, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు పొందే అన్ని ప్రైవేట్ రంగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, సమ్మక్క సారక్క పండుగను జాతీయ పండుగగా గుర్తించాలి,  ధరణి వల్ల నష్టపోయిన రైతులందరినీ కవర్ చేయడానికి భూమాత పోర్టల్ అని పిలువబడే ధరణి పోర్టల్ యొక్క పారదర్శక మరియు కొత్త వెర్షన్,  కౌలు రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.15,000, వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ.12,000, తెలంగాణ అమరవీరుల తల్లి, తండ్రి, జీవిత భాగస్వామికి నెలకు రూ. 25,000 గౌరవ పెన్షన్‌తోపాటు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సందర్భంగా నమోదైన వారిపై పెండింగ్‌లో ఉన్న కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలి, గ్రామ పంచాయతీల అభివృద్ధి నిధులను సర్పంచ్‌ల ఖాతాలకు నేరుగా బదిలీ చేయడం పునరుద్ధరణ వంటివి ప్రధానాంశాలు. అదేవిధంగా భూమిలేని పేదల పథకం కింద 25 లక్షల ఎకరాల భూమిని ఇచ్చిన రైతులకు యాజమాన్య హక్కుల పునరుద్ధరణ, 50 శాతం తగ్గింపుతో పెండింగ్‌లో ఉన్న పోలీసు చలాన్‌లను వన్‌టైమ్ సెటిల్‌మెంట్,  అన్ని బెల్ట్ షాపుల మూసివేత, రాష్ట్రవ్యాప్తంగా బీసీ కులాల గణన, సరిపడా నిధులతో కొత్త మైనారిటీ సంక్షేమ బోర్డు,  ప్రజా ఫిర్యాదులను స్వీకరించడానికి మరియు ప్రజా ఫిర్యాదులను సమయానుకూలంగా పరిష్కరించడానికి పోర్టల్,  ఎక్సైజ్ పాలసీ సమీక్ష మరియు దేవాలయాలు, చర్చిలు, మసీదులు, పాఠశాలలు, కళాశాలలు మొదలైన వాటి చుట్టూ మద్యం దుకాణాలపై నిషేధం, పాలమూరు, తెలంగాణ, మహాత్మా గాంధీ, శాతవాహన యూనివర్సిటీలను ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలుగా మార్చడంతో పాటు, ఆదిలాబాద్, ఖమ్మం, మరియు మెదక్ జిల్లాల్లో నూతన ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీల ఏర్పాటు, అమెరికాలోని  ఐ.ఎం.జీ. అకాడమీ తరహాలో అన్ని వసతులతో కూడిన ప్రపంచస్థాయి క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడం. వంటి హామీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *