IMG 20240209 WA0038

వ్యూహం ఏంటో…

ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. అనేక పెండింగ్ పనులు, రాబోయే ఎన్నికలకు సంబంధించి కీలక విషయాలను చర్చించుకున్నట్టు సమచారం.

Read More
balka c

అధికారం లేక అసహనం…!

అధికారంలో ఉన్నప్పుడు “ఒంటెద్దు” పోకడలో పాలన చేసి, విపాక్ష పార్టీలు, వాటి నేతల పై అడ్డూఅదుపు లేకుండ మాట్లాడిన భారత రాష్ట్ర సమితి నేతల్లో ఇంకా ఆ బిరుసు తగ్గ లేదు. పదేళ్లుగా నియోజక వర్గాలను ఏకపక్షంగా ఏలిన బి.అర్.ఎస్. నేతలలో రెండు నెలలుగా ఏ అధికారం లేక అసహనం పెరిగిపోతోందనే బలమైన విమర్శలు వస్తున్నాయి. సుమారు 45 రోజులుగా ఆ పార్టీ క్రియాశీలక అధ్యక్షులు కెటిఆర్, ఎమ్మెల్సీ కవిత, కడియం శ్రీహరి వంటి నేతలు అధికార…

Read More
IMG 20240205 WA0008

అధినేత్రితో…

కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.భేటీ అనంతరం భట్టి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి మర్యాదపూర్వకంగా సోనియాతో సమావేశమయినట్టు, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కోరినట్టు చెప్పారు. అంశంపై రాష్ట్ర పార్టీ తీర్మానం…

Read More
fmly c

వీధికెక్కిన”రాజ”కుటుంబం..!

“రాయలసీమ”…ఈ గడ్డ ఆది నుంచి కక్షలు, కార్పణ్యాలకు నిలువెత్తు నిదర్శం అని చరిత్ర చెబుతున్న పాఠం. అక్కడ రాజ్యం ఏలిన ఆనాటి రాజుల నుంచి నేడు రాజకీయంగా ఆధిపత్యం చెలాయిస్తున్న అనేక మంది నేతలలో ఆ నైజం స్పష్టంగా కనిపిస్తునే ఉంటోంది. తెలుగు రాష్ట్రాల్లో గొడ్డలి వేట్లు, నాటు బాంబులు, రాగి సంకటి అనగానే గుర్తొచ్చేది “సీమ” ప్రాంతాలే. ప్రత్యర్థులను వెతకడం, వేటాడడం,  ఎంత వాస్తవమో, కుటుంబ గౌరవానికి పెద్ద పీట వేయడం అంతే వాస్తవం. కానీ…

Read More
IMG 20240125 WA0040

ప్రజా పాలనే రాజ్యాంగం…

ప్రజాస్వామిక పాలన ద్వారానే రాజ్యాంగం ఆశించిన లక్ష్యాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతాయని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్వేచ్ఛా స్వాతంత్ర్యం, సౌభ్రాతృత్వంతో పాటు అందరికీ న్యాయం అందాలనే మన భారత రాజ్యాంగ స్ఫూర్తి ఇప్పటికీ, ఎప్పటికీ ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున జరుపుకునే ఈ పండుగను ప్రజలందరూ సగర్వంగా జరుపుకోవాలని అన్నారు. రాజ్యాంగ నిర్మాతలను,…

Read More
drama trs C

తప్పించుకునే తంటాలు….!

తెలంగాణలో మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్.)పార్టీ  తన మనుగడను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నట్టు కనిపిస్తోంది. బి.ఆర్.ఎస్. పార్టీ అధికారంలో ఉన్నపుడు వివిధ రంగాల్లో వాటిల్లిన వేల కోట్ల రూపాయల నష్టం, అప్పులు, చెల్లింపులు, అవినీతి కాంట్రాక్టుల నిగ్గుతేల్చి పరిపాలనను గాడిలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్న కొత్త ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిందుకు అత్యంత ప్రమాదకరమైన ఎత్తుగడలు వేయడం అంతుపట్టకుండా ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కెసిఆర్ పదేళ్ళ పాలనలో జరిగిన…

Read More
IMG 20240118 WA0009

వడ్డీ రాయితీ…

పేదలందరికి ఇళ్లు పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఇప్పటివరకు 4,500.19 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు అందించినట్లు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. వీటిపై లబ్ధిదారులు చెల్లెస్తున్న వడ్డీ మొత్తాన్ని ఏడాదికి రెండు విడతలుగా అందిస్తున్నట్లు వివరించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన వడ్డీ రీయింబర్స్ మెంట్ కార్యక్రమంలో అర్హులైన 4,07,323 లబ్దిదారులకు రూ.46.90 కోట్ల వడ్డీ రాయితీ మొత్తాన్ని విడుదల చేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఒక్కో ఇంటి స్థలం మార్కెట్ విలువ ప్రాంతాన్ని…

Read More
revnth davos

పెట్టుబడుల వెల్లువ..!

దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నాదిర్ గోద్రెజ్‌తో కీలకమైన సమావేశం జరిగింది. తెలంగాణలో అపారమైన అవకాశాలున్నాయని, వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు గోద్రెజ్ కంపెనీ ఆసక్తిని ప్రదర్శించింది. వ్యూహత్మకమైన పెట్టుబడులతో తెలంగాణ అడుగు పెట్టాలని చూస్తున్నామని నాదిర్ గోద్రెజ్ ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు. రాష్ట్రంలో పామ్ ఆయిల్ మిషన్‌ను నడపడంలో గోద్రెజ్ ఇప్పటికే కీలక పాత్ర పోషిస్తున్నది. ఖమ్మం జిల్లాలో మొదటి దశలో రూ….

Read More
IMG 20240104 WA0055

జాతీయ హోదా కావాలి..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తో భేటీ అయిన సీఎం రాష్ట్రానికి ఐపీఎస్‌ అధికారుల కేటాయింపును పెంచాలని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ను సీఎంతో పాటు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీ.ఎస్‌. శాంతి…

Read More
IMG 20231230 WA0025

రేవంత్ తో…

నటులు అక్కినేని నాగార్జున, అమల దంపతులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందుకు అభినందించారు. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ కూడా రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Read More
funds copy

గడి దాటని“దొర”-గల్లంతైన“నిధులు”!

తెలంగాణలో మొన్నటి వరకు ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్రంతో కొన్నేళ్ళుగా తెగిపోయిన సంబంధాల వల్ల వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రంతో సన్నిహితంగా ఉండాల్సిన “ఒంటెద్దు” ప్రభుత్వంలో తానే అన్నీ అన్నట్టు వ్యవహరించి చివరకు రాష్ట్రపతి, ప్రధాని వంటి వారిని సైతం లెక్క చేయకపోవడంతో రాష్ట్రానికి రావలసిన నిధులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రాజకీయంగా విభేదాలు ఉన్నా పరిపాలన పరంగా చేయాల్సిన పనులను కూడా వ్యక్తిగతంగా…

Read More
landcruser

“కారు”కలలు…!

గత పదేళ్లుగా కుటుంబం పోగేసుకున్న ఆస్తులను చూస్తూ మొన్న జరిగిన శాసన సభ ఎన్నికల్లోనూ ప్రజలు ముడోసారి కూడా తమనే గద్దెనెక్కిస్తారనే అత్యాశ బిఆర్ఎస్ అధినేతల్లో గట్టిగా ఉన్నట్టు తేలిపోయింది. దశాబ్ద కాలం పాటు అధికారం చెలాయిస్తూ, సమర్ధవంతులైన అధికారగణం చుట్టూ ఉన్నా ఎన్నికల పలితాల తీరు తెన్నులను ముందుగానే అంచనా వేయలేక పోవడం “ఒంటెద్దు” ప్రభుత్వ ఓటమికి కారణంగా కనిపిస్తోంది. ఎన్నికల సమయంలోనైనా కనీసం ఇంటలిజెన్స్ అధికారుల మాటలు వింటే బాగుండేదనే వాదనలు ఆ పార్టీ…

Read More
vijay

సాల్యూట్ “కెప్టెన్”….

ప్రముఖ తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్​కాంత్​(71) కన్నుమూశారు. తమిళనాడులోని చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో ఒక్కసారిగా తమిళ చిత్రపరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. విజయ్​కాంత్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. విజయ్​కాంత్‌ గత కొన్నాళ్లుగా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు, పార్టీ సమావేశాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. గత నెల 18న జలుబు, దగ్గు, గొంతునొప్పి…

Read More
whitepaper

ఇంకా తగ్గలే….!

ముఖ్యమంత్రి  హోదాలో ఉన్న వ్యక్తి “ఒంటెద్దు” పోకడగా వ్యవహరిస్తే అతన్ని నమ్ముకున్న ప్రజలకు ఎంత నష్టమో, ఎంత కష్టమో తెలంగాణ జనానికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. పదేళ్ళ పాటు నగరం నడిబొడ్డున  ప్రగతి భవన్ కేంద్రంగా సాగిన పాలన కేవలం హంగామా మాత్రమే అనే విషయాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చాటి చెప్పే ప్రయత్నం చేస్తోంది. దశాబ్ద పాలనలో అభివృద్ధి ముసుగులో ఆరు లక్షల కోట్ల రూపాయల  అప్పుల భారాన్ని ప్రజల నెత్తిన మోపారనే సత్యాన్ని…

Read More