sanjy on brs

“పొత్తు”అంటే చెప్పుతో కొట్టండి…

బీజేపీ కార్యకర్తలారా, ఇకపై ఎవరైనా బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు ఉంటుందని చెప్పే వాళ్లను చెప్పుతో కొట్టండి అంటూ బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. తాండూరులో కేంద్రమంత్రితో కలిసి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించిన సంజయ్ పొత్తుపై మీడియాకు పదే పదే లీకులిచ్చే ఫాల్తు రాజకీయ నాయకులను సైతం చెప్పులతో కొట్టాలని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం నడుస్తోందన్నారు. అందులో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని…

Read More
absens c

ఆ ఉద్యమం”అధికారం” కోసమేనా..!

తెలంగాణలో మొన్నటి వరకు తిరిగు లేని రాజకీయ పక్షంగా ఉన్న భారత రాష్ట్ర సమితి (భారాస) ప్రజల్లో పట్టు కొల్పోతోందా? అన్నీ తానై దిశా నిర్దేశం చేసే అధినేత కేసీఆర్ ఎందుకు మౌనం వహిస్తున్నారు?  కెటిఆర్, హరీష్, కవిత, కడియం, సుమన్ వంటి నేతలు రెండు నెలల కాంగ్రెస్ పాలనపై  అడ్డూ అదుపు లేకుండా చేస్తున్న అసందర్భ విమర్శలు, ఆరోపణలకు, అసత్య ప్రచారాలకు పార్టీ పెద్దగా ఎందుకు కళ్ళెం వేయలేక పోతున్నారు? ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీలో…

Read More
green c

“గులాబీ”లోనూ “పచ్చ”రక్తం …!

తెలంగాణ శాసన సభకు ఇటీవల జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన భారత రాష్ట్ర సమితి (భారాస) నేతల్లో అసహనం పరాకాష్టకు చేరుతున్నట్టు కనిపిస్తోంది. ఆవేశంలో యువ నేతలు గత చరిత్రను  మరచిపోతున్నట్టు స్పష్టం అవుతోంది. ప్రజల కోసమో లేక అధికారం లేదనే కోపమో తెలియదు గానీ కొద్ది రోజులుగా కెటిఆర్, కవిత, సుమన్, శ్రీహరి వంటి భారాస నేతలు కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యవహరిస్తున్న తీరు అంతుపట్టకుండా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారాస…

Read More
parlament

మళ్ళీ”హస్త”గతమే…

తెలంగాణలో అసెంబ్లీలో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల్లో కూడా మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని ఇండియా టుడే “మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌” అభిప్రాయ సేకరణలో తేలింది. తెలంగాణ లోని 17 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ 10 సీట్లు గెలుచుకుంటుందని ఇండి యా టుడే తెలిపింది. కేసీఆర్‌ నేతృత్వం లోని బీఆర్‌ఎస్‌ కేవలం మూడు సీట్లే దక్కుతాయని, తెలంగాణలో ఎక్కువ సీట్లపై ఆశలు పెట్టుకున్న బీజేపీకీ 3 సీట్లే వస్తాయని, మజ్లి్‌స్ కు యథా ప్రకారం ఒక్క…

Read More
pasiyuddin

కాంగ్రెస్ లోకి…

తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి డిప్యూటీ మేయర్ బాధ్యతలు నిర్వర్తించిన భారత రాష్ట్ర సమితి నాయకులు బాబా ఫసియుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్ఎల్ఎ మాగంటి గోపీనాధ్ వేదింపుల వల్లే పార్టీని వీడుతున్నట్టు బాబా కెసిఆర్ కి లేఖ రాశారు. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు.

Read More
vnktsh neta

కాంగ్రెస్ లోకి బిఆర్ఎస్ ఎం.పి..

తెలంగాణాలో ఘోర పరాజయంతో సతమవుతున్న భారత రాష్ట్ర సమితికి మరో గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పెద్దపల్లి నియోజక వర్గ పార్లమెంటు సభ్యులు వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. టీటీడీ బోర్డ్ మాజీ సభ్యుడు మన్నె జీవన్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

Read More
balka c

అధికారం లేక అసహనం…!

అధికారంలో ఉన్నప్పుడు “ఒంటెద్దు” పోకడలో పాలన చేసి, విపాక్ష పార్టీలు, వాటి నేతల పై అడ్డూఅదుపు లేకుండ మాట్లాడిన భారత రాష్ట్ర సమితి నేతల్లో ఇంకా ఆ బిరుసు తగ్గ లేదు. పదేళ్లుగా నియోజక వర్గాలను ఏకపక్షంగా ఏలిన బి.అర్.ఎస్. నేతలలో రెండు నెలలుగా ఏ అధికారం లేక అసహనం పెరిగిపోతోందనే బలమైన విమర్శలు వస్తున్నాయి. సుమారు 45 రోజులుగా ఆ పార్టీ క్రియాశీలక అధ్యక్షులు కెటిఆర్, ఎమ్మెల్సీ కవిత, కడియం శ్రీహరి వంటి నేతలు అధికార…

Read More
revnth phida

ఏం మాట్లాడిండ్రా భై…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగ తీరు జనం మధ్య అత్యంత హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి జరిపిన ఆదిలాబాద్ జిల్లా పర్యటన తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. వేదిక నుంచి అయన గుప్పించిన మాటలు చర్చనీయాంశాలుగా మారాయి .రాష్త్ర పెద్దగా రేవంత్ వ్యవహార శైలి, లేవనెత్తిన అంశాలు, వెల్లడించిన హామీలు భవిష్యత్తును కళ్ళముందు చూపినట్టు ఉందనే ప్రశంసలు వెల్లువెత్తడం విశేషం. ఇంద్రవెల్లిలో…

Read More
what is c

“ప్రొఫెసర్”ఉద్యమ నేత.. మరి”సంతోష్”..!

తెలంగాణలో బాధ్యత గల ప్రధాన ప్రతిపక్షం విధి ,విధానాలను విస్మరిస్తున్నట్టు కనిపిస్తోంది. పదేళ్ళ పాటు అధికారాన్ని చెలాయించిన భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) నేతలు మొన్నటి ఎన్నికల్లో అధికారం కోల్పోయినప్పటికీ ఇంకా అధికారంలోనే ఉన్నట్టు, తమ మాటలే సాగలన్నట్టు వ్యవహరించడం విడ్డూరంగా ఉంది. కొత్తగా అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంపై సుమారు నెల రోజులుగా బిఆర్ఎస్ నేతలు పొంతన లేని విమర్శలు, ఆరోపణలు చేయడం అంతుపట్టకుండా ఉందని రాజకీయ పరిశీలకులు, కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. అంతేకాక, ప్రభుత్వం…

Read More
land kcr cf

ముఖ్యమంత్రీ లేడు..మూడు ఎకరాలూ లేవు ..!

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో ఆచితూచి వ్యవహరించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉంటుంది. ఏ విపక్షమైన సమయం, సందర్భం, సమస్యల తీవ్రతను ప్రామాణికంగా తీసుకుంటుంది. అందుకు అనుగుణంగా వ్యూహ రచనలు చేసుకొని అధికార పక్షం పై పోరాటానికి సిద్ధం అవుతాయి. కానీ, తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న తంతు అందుకు భిన్నంగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఉద్యమ పార్టీ ముసుగులో ప్రజల ముందు అనేక హామీలను గుప్పించి అధికారం చేజిక్కించుకున్న  భారత రాష్ట్ర సమితి,(బి.అర్.ఎస్.)…

Read More
4 mlas

అటు చూడు..”క్యూ” షురూ…!

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కొత్తగా అధికారంలో చేపట్టిన రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొద్ది రోజుల్లో కూలిపోతుందని భారత రాష్ట్ర సమితి (బి.అర్.ఎస్.) సీనియర్ నేతలు కొద్ది రోజులుగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, మంగళ వారం బి.అర్.ఎస్. అగ్ర నాయకత్వం విస్తుపోయే సన్నివేశం ఆవిష్కృతం అయ్యింది. ఆ పార్టీకి చెందిన నలుగురు శాసన సభ్యులు రేవంత్ రెడ్డిని కలవడం సంచలనంగా మారింది. బి.అర్.ఎస్. కి చెందిన ఎం.ఎల్….

Read More
drama trs C

తప్పించుకునే తంటాలు….!

తెలంగాణలో మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్.)పార్టీ  తన మనుగడను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నట్టు కనిపిస్తోంది. బి.ఆర్.ఎస్. పార్టీ అధికారంలో ఉన్నపుడు వివిధ రంగాల్లో వాటిల్లిన వేల కోట్ల రూపాయల నష్టం, అప్పులు, చెల్లింపులు, అవినీతి కాంట్రాక్టుల నిగ్గుతేల్చి పరిపాలనను గాడిలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్న కొత్త ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిందుకు అత్యంత ప్రమాదకరమైన ఎత్తుగడలు వేయడం అంతుపట్టకుండా ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కెసిఆర్ పదేళ్ళ పాలనలో జరిగిన…

Read More