IMG 20231013 WA0012

ఓట్ల కోసం”కోట్లు”….

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరగనున్న కీలక ఎన్నికల్లో కోట్లాది రూపాయలు వరదలా ప్రవహించే సూచనలుకనిపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే బా వచ్చిన “కట్టల” పాములు రోజు రోజుకూ అధికమవుతున్నాయి. ఆయా పార్టీలు పొరుగు రాష్ట్రాల నుంచి డబ్బు మూటలను తరలించే ప్రక్రియకు తెరలేపాయి. తాజాగా కర్ణాటకలోని బెంగళూరులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న 42 కోట్ల నగదు వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. ఈ డబ్బు ఎక్కడికి, ఎందుకు తరలించే ప్రయత్నం జరిగిందనే విషయంలో ఇప్పటి…

Read Full News
babu 2

“బాబుకు” అలర్జీ…

రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న అంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్మ దురద (అలర్జి) సమస్యతో బాధపడుతున్నట్టు సమాచారం అందుతోంది. ఇదే విషయాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు.

Read Full News
IMG 20231012 WA0000

జగన్ ని కట్టడి చేయండి..

అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కక్షసాధింపు చర్యలను కట్టడి చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి  అమిత్ షాకు నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. చంద్రబాబును అరెస్ట్, విచారణ పేరుతో వేధిస్తున్న  తీరును అమిత్ షా దృష్టి కి తీసుకు వెళ్లారు.చివరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి ని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. .

Read Full News
FB IMG 1697044921618

ఇజ్రాయెల్ పై”ఒంటి కన్ను జాక్స్”…

నాంచారయ్య, సీనియర్ ఎనలిస్ట్ ‘ఒంటి కన్ను జాక్‌’ (హమాస్‌ నేత) దెయిఫ్‌ మొన్న 12 వందల మంది ఇజ్రాయెలీల ప్రాణాలు తీసే ప్లాన్‌ వేస్తే…మరో ‘ఒన్‌ అయిడ్‌ జాక్‌’ శివరాసన్‌ 32 ఏళ్ల క్రితం రాజీవ్‌ గాంధీని దగ్గరుండి మరీ చంపించిన టైగర్ల వ్యూహకర్త!ఉగ్రవాద సంస్థల ‘మాస్టర్‌ మైండ్ల’కు ఒక కన్ను పోయినా మెదడు బాగానే పనిచేస్తుందట!వారం రోజుల యూదుల మ్యూజిక్‌ ఫెస్టివల్‌ సుక్కోత్‌ ముగింపు దశకు చేరిన శనివారం ఇజ్రాయెల్‌ లోకి వేలాది రాకెట్లు దూసుకొచ్చాయి….

Read Full News
IMG 20231011 WA0028

బరిలో తల్లీ, కూతుర్లు…!

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణ ఎన్నికల రేసులో వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల బరిలోకి దిగుటున్నట్టు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్‌టీపీ తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో సుమారు వంద చోట్ల వైఎస్ఆర్‌టీపీ పోటీకి రంగం సిద్దం చేసుకున్నట్టు సమచారం అందుతోంది.వైఎస్ షర్మిల పాలేరు, మిర్యాలగూడ రెండు స్థానాల నుంచి, సికింద్రాబాద్ నుండి వైఎస్ విజయమ్మ పోటీకి దిగనున్నట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read Full News
babu 1

ముందస్తు బెయిల్….

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైకోర్టులో కొంత ఊరట లభించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు నాయుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీన్ని విచారించిన హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సోమవారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవ ద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లా అంగళ్లు అల్లర్ల కేసులోనూ గురువారం వరకు…

Read Full News
Screenshot 20231011 140656 WhatsApp

స్ట్రీట్ ఫైట్….

అంబెడ్కర్ కోనసీమ జిల్లాలో నడి రోడ్డు పై స్టూడెంట్స్ గ్యాంగ్ వార్ కలకలం రేపింది. అమలాపురం ఎస్. కె. బి.అర్.కాలేజీ లో డిగ్రీ విద్యార్థులు ఘర్షణకు దిగారు. బిఎ, బి కామ్ గ్రూపుల మధ్య గొడవ తలెత్తి గ్రూపులుగా విడిపోయి రోడ్డు పై కొట్టుకున్నారు. 5వ తేదీన జరిగిన ఫేర్వెల్ పార్టీలో ఒక పాట విషయంలో వివాదం తలెత్తింది.మంగళవారం సాయంత్రం కొంతమంది కావాలని మళ్ళీ గొడవకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. రెండు గ్రూపుల విద్యార్థులను ని అదుపులోకి…

Read Full News
rjy jail c

ఆ జైలులో ఏం జరుగుతోంది…!

గతంలో ఎన్నడూ లేని విధంగా రాజమండ్రి కేంద్ర కారాగారం కేవలం కొన్ని రోజులుగానే వార్తల్లోకి ఎక్కుతోంది? దోమల మూలంగా ఒక ఖైదీ చనిపోవడం, ఖైదీల మధ్య గొడవలు తలెత్తడం వంటి ఘటనలు ఈ మధ్యనే ఎందుకు జరుగుతున్నాయి. ఇలా గతంలో కూడా జరిగినా ఆ సమాచారం బయటకు పొక్కలేదా ? మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండడంతో ప్రతీ ఒక్కరిలో ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జైలులో జరుగుతున్న సంఘటనలపై అక్కడ విధులు…

Read Full News
Screenshot 20230911 105403 WhatsApp

చంద్రబాబుకి అస్వస్థత…!

రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ పై ఉన్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వల్ప అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. గత నాలుగు రోజులుగా ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ఆయన డీ హైడరేషన్ బరినపడ్డట్టు సమచారం. ఇదే విషయాన్ని చంద్రబాబు జైలు అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లినట్టు తెలిసింది. మరింత సమాచారాన్ని జైలు అధికారులే వెల్లడించాల్సి ఉండి.

Read Full News
123187951 10sha1a

కొడుకూ,కూతురి కోసమే…

కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయటానికి, కవిత జైలుకు పోకుండా కాపాడుకోవటానికి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని ఇంపీరియల్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన మేధావుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి సిద్ధాంతాలతో పనిలేదని, బిజెపి మాత్రమే సిద్దాంతానికి అనుగుణంగా నడుస్తోందని తెలిపారు. కేసీఆర్ కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందన్నారు.తెలంగాణలో పదేళ్ళు అవినీతిలో మునిగి పోయిన బీఆర్ఎస్ కు మళ్ళీ అవకాశం ఇవ్వొద్దని కోరారు….

Read Full News
cs shanti 1

ఇక “కోడ్” స్క్రీనింగ్…

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రాగా, నిబంధనలను సమర్థంగా అమలు చేసేందుకు స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చే ప్రతిపాదనలను ఈ కమిటీ పరిశీలించనుంది. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేయగా, ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

Read Full News
3.5 crore

ఎన్నికల పొగతో “కట్టల’ పాములు….!

తెలంగాణాలో ఎన్నికల పొగ రాజుకోవడంతో “కట్టల” పాములు బయటకు వస్తున్నాయి. భాగ్యనగరం నలు చెరగులా బస్తాల కొద్ది నల్లదనం, అటుపట్టని హవాల సొమ్ము నాట్యం చేస్తోంది. ఎన్నికల నియమావళి వచ్చిందో లేదో ఒక చోటు నుంచి మరో చోటుకు తరలుతున్న డబ్బు మూటలు పోలీసులకు తనిఖిల్లో చిక్కుతున్నాయి. రంగా రెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భారత్ గార్డెన్స్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా కారులో 6.55లక్షల రూపాయలు తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇక బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3లో…

Read Full News
lokes cid 1

గూగుల్‌లో వెతికితే సరిపోయేది…

సిఐడి అధికారులు ఆరున్నర గంటల పాటు ఇన్నర్ రింగ్ రోడ్డుతో సంబంధం లేని 50 ప్రశ్నలు అడిగార‌ని, ఇందులో 49 ప్ర‌శ్న‌లు గూగుల్‌లో వెతికితే వ‌చ్చేవి ఉన్నాయ‌ని టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ చెప్పారు. సీఐడీ విచార‌ణ అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ మీరు ఏం చేస్తుంటారు? హెరిటేజ్‌లో పని చేసినప్పుడు మీ హోదా ఏంటి? ప్రభుత్వంలో మీరు ఏ బాధ్యతలు నిర్వహించారు? ఇటువంటి గూగుల్ లో దొరికేవ‌న్నీ త‌న‌ని విచార‌ణాధికారులు అడిగార‌ని తెలుపారు….

Read Full News
evm

అతిక్రమిస్తే ఉక్కు పాదం…!

వచ్చే ఎన్నికల్లో ఓటర్ల సౌలభ్యం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలలో స్వల్ప మార్పు చేసింది. ఈవీఎంపై గతంలో పార్టీ గుర్తు, అభ్యర్థి పేరు మాత్రమే  ఉండేవి. కానీ ఈ సారి ఎన్నికల్లో వీటితో పాటు అభ్యర్థి ఫొటో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ వెల్లడించారు. పోస్టల్‌ బ్యాలెట్‌పైనా అభ్యర్థుల ఫొటోలు ఉంటాయి. ఈ నెల 31 వరకు ఓటు హక్కు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. చిరునామా…

Read Full News
srinivas goud

గండం తప్పింది…

తెలంగాణా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై ఎన్నికల అఫిడవిట్ కేసును హైకోర్టు కొట్టి వేసింది. మహబూబ్ నగర్ కు చెందిన చలవుగాలి రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ గత ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని ఆరోపిస్తూ, గౌడ్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. అయితే, సుదీర్ఘ విచారణ అనంతరం వివిధ అంశాలను పరిశీలించిన కోర్టు తుది తీర్పు వెల్లడించింది. రాఘవేంద్ర రాజు వేసిన ఎన్నికల కేసు చెల్లదంటూ తీర్పు…

Read Full News