IMG 20231008 WA0012

స్విమ్మింగ్ “విక్టరీ”యా….

సెర్బియా దేశ రాజధాని బెల్ గ్రేడ్ లో జరిగిన ఒపెన్ వాటర్ ఫిన్ స్విమ్మింగ్ వరల్డ్ మాస్టర్స్ ఛాంపియన్ షిప్ – 2023 పోటీలలో తెలంగాణ స్విమ్మర్  క్వీనీ విక్టోరియా గంధం సత్తా చాటింది. 3 కిలోమీటర్ల మోనో ఫిన్ విభాగంలో బంగారు పతకం,1 కిలోమీటర్ మోనో ఫిన్ విభాగంలో రజిత పతకాలను సొంతం చేసుకుంది.సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ ఈ పోటీలు జరిగాయి. మన దేశం నుంచి  ఓపెన్ వాటర్ ఫిన్…

Read Full News
IMG 20231009 WA0002

ఐఐటి ఈతగాళ్లు…

దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఐఐటి విద్యార్థుల మధ్య గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ ఐ.ఐ.టి.లో నిర్వహించిన 37వ ఈత (ఆక్వాటిక్స్) పోటీల్లో ఐఐటి హైదరాబాద్ అభ్యర్థులు సత్తా చాటారు.దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఐఐటి విద్యార్థుల మధ్య గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ ఐ.ఐ.టి.లో నిర్వహించిన ఈత (ఆక్వాటిక్స్) పోటీల్లో ఐఐటి హైదరాబాద్ అభ్యర్థులు సత్తా చాటారు. ఈ పోటీల్లో సెకండ్ రన్నర్అప్ ని సొంతం చేసుకోవడంతో పాటు 8 పతకాలు గెలుసుకున్నారు. మొత్తం 16 ఐఐటిలు ఈ పోటీల్లో తలపడ్డాయి….

Read Full News
india 23

అదిరే బోణీ…

వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ ఇండియాకు అదిరే ఆరంభం లభించింది. ఆసీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్‌ సేన 6 వికెట్ల తేడాతో సూపర్‌ విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 199 పరుగులకు ఆలౌటైంది. జడేజా 3, కుల్‌దీప్‌ 2, బుమ్రా 2, అశ్విన్‌, సిరాజ్‌, హార్దిక్‌ ఒక్కో వికెట్‌ తీశారు. ఆ తర్వాత 200 లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియాకు వరుస షాక్‌లు తగిలాయి. ఇషాన్‌ కిషన్ (0), రోహిత్ శర్మ (0), శ్రేయస్ అయ్యర్…

Read Full News
kavit 2 c

సంస్కరణలు రావాలి…!

తెలంగాణా అన్ని రంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలబడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. లండన్ పర్యటనలో ఉన్న ఆమె నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమినీ -‌ యూకే (ఎన్ఐఎస్ఏయూ) సభ్యులతో సంభాషించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మహిళా రిజర్వేషన్లు, తెలంగాణ అభివృద్ధి, తన రాజకీయ జీవితం వంటి అంశాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే సకల జనుల సర్వే నిర్వహించామని, దాని వల్ల రాష్ట్రంలోని ప్రజల సామాజిక…

Read Full News
IMG 20231008 WA0015

భారీ నష్టం….

పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌ను వణికించిన భూకంపాల వల్ల మృతుల సంఖ్య భారీగా పెరిగినట్లు తాలిబన్‌ ప్రతినిధి ప్రకటించారు. మృతుల సంఖ్య రెండు వేలకు చేరుకుందని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో శనివారం 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం, అనంతరం బలమైన ప్రకంపనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సుమారు 320 మంది మరణించారని, వేలాది మంది గాయపడ్డారని జాతీయ విపత్తు సంస్థ తెలిపింది. హెరాత్‌ ప్రావిన్స్‌ జెండా జాన్‌ జిల్లాలోని నాలుగు గ్రామాలు భూంకంపం దాటికి ప్రభావితమయ్యాయని విపత్తు అధికార…

Read Full News
IMG 20231007 WA0049

ప్రమిదల వెలుగులో…

అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ తెలుగు రాష్ట్రాల్లో ‘‘కాంతితో క్రాంతి’’ కార్యక్రమాన్ని చేపట్టింది. వివిధ జిల్లాల్లో పలువురు సంఘీభావం తెలిపారు. రాజమండ్రి లో నిర్వహించిన కార్యక్రమంలో నారా భువనేశ్వరి ప్రమిదలు వెలిగించి నిరసన లో పాల్గొన్నారు. ఆమెతో పాటు స్థానిక మహిళలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము సైతం బాబు కోసం, బాబుతో మేము అంటూ మహిళలు నినాదాలు చేశారు. తెలంగాణలో టిడిపి శ్రేణులు, సినీ దర్శకులు రాఘవేంద్ర రావు, నందమూరి రామకృష్ణ…

Read Full News
israil cf

మళ్లీ మొదలైంది…

కొంత కాలంగా స్తబ్దంగా ఉన్న ఇజ్రాయెల్‌ దేశంలో మళ్లీ ఉగ్ర మంటలు చెలరేగాయి. పాలస్తీనాకు చెందిన ఇస్లామిస్ట్ గ్రూపు హమాజ్‌ దక్షిణ ఇజ్రాయిల్‌లోకి చొరబడి ఇష్టానుసారంగా పౌరులపైకి  రాకెట్లను ప్రయోగించింది. దీంతో ఇజ్రాయిల్‌, పాలస్తీనాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.  గాజా స్ట్రిప్‌ ప్రాంతం నుంచి ఇజ్రాయెల్‌ వైపునకు పెద్ద ఎత్తున మిస్సైల్స్‌ దాడులు జరిగాయి. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్‌ సైన్యం గాజా సరిహద్దులో ఎమర్జెన్సీ ప్రకటించింది. గాజా, గ్రేటర్‌ టెల్‌ అవీవ్‌ ప్రాంతం నుంచి పెద్ద…

Read Full News
shrada ranbir

“బెట్టింగ్” సమన్లు…

మహా దేవ బెట్టింగ్ యాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి శ్రద్దా కపూర్ కు  ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్  సమన్లు జారీ చేసింది. ఈ యాప్ కేసులో నటుడు రణ్ బీర్ కపూర్ , హాస్య నటుడు కపిల్ శర్మ, నటీమణులు హ్యుమా ఖురేషి, హీనా ఖాన్ కూ ఈడి నుండీ సమన్లు జారీ అయ్యాయి.  హవాలా కార్యకలాపాలకు పాల్పడుతున్న  మహ దేవ్ యాప్ ప్రమోటర్లు సౌరబ్ చంద్ర శేఖర్, రవి ఉప్పల్ పై ఈడి కేసు నమోదు చేసిన…

Read Full News
100medals

వంద పతకాల భారత్…

చైనాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో నిర్వహిస్తున్న వివిధ విభాగాల్లో భారత్ చరిత్ర సృష్టించింది. ఏషియన్ గేమ్స్ లో వంద పతకాలను సాధించి తొలిసారి రికార్డు నెలకొల్పింది. శనివారం మహిళల కబడ్డీ విభాగంలో చైనీస్ తైపీపై భారత్ ఘన విజయం సాధించడంతో ఇండియా పతకాల్లో సెంచరీ జాబితాలో చేరింది. ఇప్పటి వరకు 25 బంగారు, 35 రజతం, 40 కాంస్య పతకాలు సాధించింది. అన్నివిభాగాల్లో కలిపి 100 పతకాలు సాధించిన భారత్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగవ…

Read Full News
IMG 20231007 WA0022 1

ఇక మంచి రోజులే…

భారత దేశంలో మహిళా రిజర్వేషన్ల చట్టం వల్ల భవిష్యత్తులో మహిళలకు మంచి రోజులు వస్తాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. చట్టసభల్లోకి మరింత మంది మహిళలు ప్రవేశించడానికి మార్గం చూపే విప్లవాత్మక బిల్లును భారత్ ఆమోదించిందని చెప్పారు. ప్రస్తుతం భారత పార్లమెంటులో 78 మంది మహిళా ఎంపీలుగా ఉన్నారని, మహిళా రిజర్వేషన్లతో ఆ సంఖ్య 181కు చేరుతుందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటుకు తీసుకు రావడంలో 1996లో దేవే గౌడ ప్రభుత్వం, 2010లో సోనియా గాంధీ,…

Read Full News
Screenshot 20231006 225206 WhatsApp

ప్రమాదం…

హైదరాబాద్ లోని కెపిహెచ్‌బి మెట్రో స్టేషన్ సమీపంలో అగ్నిప్రమాదం సభవించింది. ఓ ఫర్నీచర్ షాపులో దట్టమైన పొగలతో మంటలు చెలరేగాయి. సమచారం అందుకున్న. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలు అర్పుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read Full News
vote from home

“ఓటు” ఫ్రమ్ హోమ్….!

దేశంలోనే తొలిసారిగా ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలో జరగనున్న శాసన సభ ఎన్నికల నుంచి ఈ వెసులు బాటు అందుబాటులోకి వస్తుంది. అయితే, వయో వృద్ధులు, 40శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలకి రాలేని సీనియర్ సిటిజన్లు పోలింగ్ కేంద్రంలోనే ఓటు వేయడానికి ఇష్టపడితే అటువంటి వారి…

Read Full News
babu pavan

టిడిపి-“సేన”లో పొత్తు చిచ్చు..!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ రాజకీయ పార్టీల పొత్తుల వ్యవహారం గందరగోళంగా మారుతోంది. పెద్ద పార్టీలతో చేతులు కలుపుతున్న పార్టీల వ్యూహాలు సామాన్యులకు అంతు పట్టడం లేదు. గత ఎన్నికలలో అంటకాగిన పార్టీలు ఈ సారి ఎడమొహం పెడమొహంగా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ శత్రువులుగా మారాయి. తెలంగాణ, అంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రాలో బిజెపితో కలిసి తిరిగిన జనసేన ఈ సారి రూటు మార్చింది. మొన్నటి వరకు…

Read Full News
Screenshot 20231004 214801 WhatsApp

సినిమా కాదు పవన్…

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారాహి యాత్రపై రాళ్ల దాడికి ప్లాన్‌ చేశారంటూ పవన్‌ కల్యాణ్‌ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.  ఆ ఆరోపణలకు సాక్ష్యాలు ఏవైనా ఉన్నాయా అని నోటీసులు ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ జాషువా వెల్లడించారు. పవన్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అందుకే నోటీసులు ఇచ్చామని, దాడులు జరగుతాయనే సమాచారం మీకు ఎక్కడి నుంచి వచ్చిందనేది మాకు తెలియజేయలని కోరినట్టు,  నోటీసులకు పవన్‌ నుంచి తిరుగు…

Read Full News
Screenshot 20231004 114252 Gallery 1

రైల్వే స్టేషన్ లో రచ్చ….

సిద్దిపేట – సికింద్రాబాద్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం రచ్చ బండగా మారింది. ఈ రైలుని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ నుంచి వర్చువల్ గా ప్రారంభిస్తే, సిద్దిపేట రైల్వే స్టేషన్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఅర్ ఫోటోలు, ఫ్లెక్సీలు లేకపోవడం వివాదంగా మారింది. మంత్రి హరీశ్ రావు, బా.రా.స. ఎం.పి.కొత్త ప్రభాకర్ రెడ్డిలు సైతం ఆవేశానికి గురవడంతో పరిస్థితి అదుపుతప్పి ఆందోళనకు దారితీసింది.ఒక సందర్భంలో హరీశ్ రావు ప్రధాని ప్రసంగం ప్రసారం అవుతున్న ఎల్.ఇ.డి….

Read Full News