jagan ys

నాన్నకు నివాళి…

జననేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్.‌రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా, వైఎస్‌ఆర్ జిల్లా, ఇడుపుల పాయలో వైయస్సార్‌ ఘాట్ వద్ద  ముఖ్యమంత్రి వైయస్‌.జగన్, వైయస్‌.భారతి, వైయస్‌.విజయమ్మ, ఇతర కుటుంబసభ్యులు ఘనంగా నివాళులర్పించి, ప్రార్ధన నిర్వహించారు.

Read More
Screenshot 2023 07 08 185100

మీ సహకారం గొప్పది…

దేశాభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం అందించిన సహకారం గొప్పదని, దేశాన్ని ప్రపంచంలోనే 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా  రూపు దిద్దుకోవడంలో తెలంగాణ ప్రజలదే కీలకపాత్ర ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  అన్నారు.  కాజీపేటలో రైల్వే మాన్యు ఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణానికి  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా  ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, రాష్ట్రంలో దాదాపు రూ. 6100 కోట్ల విలువైన అనేక ముఖ్యమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా  తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు…

Read More
modi 1

కెసిఆర్ ఆ నాలుగింటి లోనే…

వరంగల్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఆయన పాలనపై విరుసుకు పడ్డారు. కేవలం తెలంగాణ నాలుగు అంశంలో అభివృద్ధి చెందింది అంటూ ఎద్దేవా చేశారు. వాటిలో ఒకటి ఉదయం నుంచి సాయంత్రం వరకు మోడీని విమర్శించడం పని రెండోది తెలంగాణ ఆర్ధిక పరిస్థితిని నీరుగార్చడం అని వ్యాఖ్యానించారు.

Read More

యాత్రకు బ్రేక్..

ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల అమర్‌నాథ్‌ యాత్ర వరుసగా రెండో రోజు కూడా నిలిచిపోయింది. వర్షాల కారణంగా జమ్ము- శ్రీనగర్‌ హైవేపై కొండచరియలు విరిగిపడటంతో యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. బల్తాల్‌, పహల్గాం రెండు మార్గాల్లోనూ యాత్రను నిలిపివేశారు. ఎడతెరపి లేకుడా కురుస్తున్న వర్షాల వల్ల బల్తాల్‌, నున్వాన్‌ బేస్‌ క్యాంపుల్లోనే వేలమంది యాత్రికులు ఉండిపోయారు.పంచతర్ణి ప్రాంతంలో 1,500 మంది యాత్రికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అందులో 200 మంది వరకూ తెలుగు యాత్రికులు ఉన్నట్లు సమాచారం. ఆగస్టు…

Read More

జననేతకు నివాళి…

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయ లోని ఆయన సమాధి వద్ద షర్మిల, విజయమ్మ నివాళులర్పించారు. వీరితో పాటు షర్మిల కుమారుడు రాజారెడ్డి, కూతురు అంజలి కూడా శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వైఎస్ సమాధి వద్ద నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. షర్మిల, ఇతర కుటుంబ సభ్యులు నిన్ననే ఇడుపులపాయకు చేరుకున్నారు.

Read More

ఆత్మీయ కలయిక…

అమెరికా లోని  ఫిలడెల్ఫియాలో ప్రారంభమైన తానా సభలు అట్టహాసంగా ప్రారంభమైయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు ఫిలడెల్ఫియా నగరంలో ఉన్న పెన్సిల్వేనియా కాన్ఫరెన్స్ హాలులో నిర్వహిస్తున్నారు. ఈ సభలకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్.వి రమణ, సినీనటులు, ఎమ్మెల్యే బాలకృష్ణ , తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Read More

అమ్మవారి పూజలో ప్రధాని….

ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ చేరుకున్నారు. మమునూర్ ఎయిర్ పోర్ట్ లో ప్రధానికి కలెక్టర్లు స్నిక్టా పట్నాయక్, ప్రావీణ్య, మాజీ ఎంపీ బూర నర్సయ్య స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రధాని నేరుగా శ్రీ భద్రకాళి దేవాలయనికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు  పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.

Read More

మీరే చేయాలి…

దేశ అభివృద్ధిలో యువత గొప్ప పాత్ర పోషిస్తుందని, దేశ పురోగమనంతో పాటు  సామాజిక సంస్కరణలను తీసుకురావడంలో యువతదే  ప్రధాన పాత్రని డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. అక్షయ విద్య  స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నగరంలోని పలు బస్తీలకు చెందిన 80 మంది  నిరుపేద విద్యార్థినీ, విద్యార్థులకు లాప్ టాప్ లను  డీజీపీ అందచేశారు. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ, కస్టపడి చదువుకున్న యువత తమ బస్తీలలో ప్రాంతాల్లో చేడు మార్గాలలో పయనిస్తున్న…

Read More
Screenshot 2023 07 07 214619

కిక్కులో…

ఓ యువతి మద్యం మత్తులో అతి వేగంగా కారు నడపడం ప్రమాదానికి దారి తీసింది. ఈ తెల్లవారుజామున బంజారాహిల్స్ లో   బిఎండబ్ల్యూ  కారులో వేగంగా వెళ్తూ స్కూటర్ పై  వెళ్తున్న జిహెచ్ఎంసి  ఉద్యోగిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో  జిహెచ్ఎంసి సర్కిల్ మేనేజర్ బాలచందర్ కు  తీవ్ర గాయాలయ్యాయి.

Read More

నువ్వు అలా చేస్తే… నేను ఇలా..

సంగారెడ్డి జిల్లా ఐడిఎ బొల్లారం లో ఓ పాస్టర్ బండారం బయట పడింది. పరాయి మహిళలతో వ్యవహారం నడుపుతున్న పాస్టర్ జయరాజ్ ను అయన భార్య రెడ్ హ్యాండ్ గా పట్టుకుంది. ప్రతి రోజు చర్చిలో, క్రిస్టియన్ సోదరుల ఇంట్లో ప్రార్ధనలు చేసే ఈ పాస్టర్ వంకర చూపులు చూడడం పై ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయం పై నిఘా పెట్టిన ఆయన భార్య అక్రమ సంబంధాన్ని బట్టబయలు చేసింది. బురఖా ధరించి మారు…

Read More
Screenshot 2023 07 07 141115

ఐదు బోగీలు దగ్ధం …

సికింద్రాబాద్, హౌరా ఫలక్ నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లో  అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. ఈ సంఘటన  భువనగిరి జిల్లాలోని బొమ్మాయిపల్లి- పగిడిపల్లి మార్గంలో చోటు చేసుకుంది.  ముందుగా రైలు నుండి పొగ రావడంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ప్రయాణికులను  అప్రమత్తం  చేశారు. దీంతో ప్రయాణికులను వెంటనే రైలు నుండి దింపేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం రైలును బొమ్మాయిపల్లి…

Read More

తప్పదిక…దంచుడే..

పది రోజులుగా అల్లర్లతో అట్టుడుకుతున్న పారిస్ లో పరిస్థితిని చక్కబెట్టడానికి అక్కడి పోలీసులు  విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటి వరకు భాష్ప వాయువుతో అల్లరి మూకలను చెదరగోట్టిన పోలీసులు చేతులకు పనిచెప్పారు. అల్లర్లకు పాల్పడుతున్న వారిపై విరుసుకుపడ్డారు.

Read More

తప్పు కదా….

నిబంధనలకు విరుద్ధంగా జూనియర్‌ అసిస్టెంట్‌ను ఉద్యోగంలో నుంచి తొలగించిన వ్యవహారంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు నవీన్‌ మిత్తల్‌, వాకాటి కరుణతో పాటు ఇంకొందరు అధికారులకు కోర్టు ధిక్కరణ కింద హైకోర్టు శిక్ష విధించింది. ఒక్కొక్కరు రూ.10 వేల చొప్పున జరిమానా చెల్లించాలని,  ఆ మొత్తాన్ని  4 వారాల్లో చెల్లించకుంటే  నెల రోజుల సాధారణ  జైలుశిక్ష అనుభవించాలని ఆదేశించింది. ఐఏఎస్‌ల తో పాటు . కళాశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు జి.యాదగిరి, కల్వకుర్తి ప్రభుత్వ మోడల్‌ డిగ్రీ…

Read More

ఖబర్దార్ ఖతం చేస్తాం……

హైదరాబాద్ లోని కార్వన్ పరిధిలోని  మెహబూబ్ కాలనీ లో  విచ్చలవిడిగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న వారి  గురించి తెలుసుకోవడానికి వెళ్ళిన  విద్యుత్ శాఖ ఉద్యోగులపై ఆ ప్రాంత వాసులు దాడికి పాల్పడ్డారు. కాలనీలోకి అడుగు పెట్టగానే కొందరు వ్యక్తులు  ఉద్యోగులపై  పిడిగుద్దులతో దాడికి దిగారు. ఆ ప్రాంతంలో ప్రాబల్యం ఉన్న రాజకీయ పార్టీకి చెందినా వారే ఈ దాడికి పాల్పడ్డట్టు సమాచారం. బర్కాస్, కార్వాన్ ప్రాంతాల్లో అనేక  మంది అక్రమంగా విద్యుత్తు వినియోగం చేస్తున్న విషయం తెలిసి…

Read More