roja ramya

రోజా..రమ్య…

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడాశాఖ మంత్రి ఆర్.కె.రోజాని ఆమె స్నేహితురాలు, ప్రముఖ సినీ నటి రమ్య కృష్ణ నగరి లోని ఆమె స్వగృహంలో స్నేహపూర్వకంగా కలిశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి తిరుగు ప్రయాణంలో రోజా స్వగృహంలో కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పుత్తూరు, నగరి మునిసిపాలిటి, నగరి, పుత్తూరు, వడమాలపేట, నిండ్ర, విజయపురం మండలాలకు చెందిన ప్రముఖ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Read Full News
tg high court

ఫలితాలు ఆపండి…

తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చే సోమవారం వరకు ప్రకటించ వద్దని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రిలిమ్స్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు సర్వీసు కమిషన్ కు ఆదేశాలు జారీచేసింది. అదేవిధంగా కౌంటర్ దాఖలు చేయాలని టీ ఎస్ పి ఎస్ సికి సూచించింది. తమ వాదనలు వినిపించేందుకు సోమవారం వరకు కమిషన్ గడువు కోరగా అయితే…

Read Full News
praneeti

కృత్రిమ గర్భానికి ఎ.ఐ…!

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఎ.ఐ.) ఆధారిత ఆర్ ఐ విట్ నెస్ సిస్టం వంటి సరికొత్త పరిజ్ఞానంతో సంతాన సాఫల్యం సులభతరమవుతుందని సినీ నటి ప్రణీత అన్నారు. సికింద్రాబాద్ లోని ఫర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్ లో తొలిసారిగా ఏ ఐ ఆధారిత ఆర్ ఐ విట్ నెస్ సిస్టంను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రణీత మాట్లాడుతూ మాతృత్వం ఒక వరమని, మారుతున్న జీవన విధానం, వాతావరణంలో మార్పులు, వృత్తి పరమైన ఒత్తిడి పెరిగడం వల్ల సంతాన లేమి…

Read Full News
Screenshot 2023 07 25 154029

మై హోమ్.. ఐదుగురు మృతి…

మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మై హోమ్ సిమెంట్ కంపెనీ విస్తరణలో భాగంగా కొత్తగా నిర్మిస్తున్న యూనిట్-4 ప్లాంట్ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ పని చేస్తుండగా లిఫ్ట్ కూలి కింద పడడంతో ఐదుగురు కాంట్రాక్ట్ కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా ఉత్తరప్రదేశ్, బీహార్ కు చెందినట్టు సమాచారం అందింది. గాయపడ్ద వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Read Full News
vanama

“వనమా”ఎన్నిక చెల్లదు….

ఎన్నికలు సమీపించే సమయంలో సీనియర్ లీడర్ వనమా వెంకటేశ్వరరావు కి గట్టి డెబ్భ తగిలింది. గత ఎన్నికల్లో అయన గెలుపు చెల్లకుండా పోయింది. వివరాల్లోకి వెళ్తే, కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు ఎన్నికల చెల్లదంటూ తీర్పు హై కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఎన్నికల సమయంలో తప్పుడు ధృవపత్రాలతో అఫీడవిట్ సమర్ఫించారని వనమా పై ఆ ఎన్నికల్లో ప్రత్యర్ధి , మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కోర్టులో అనర్హత పిటీషన్…

Read Full News
rain

ఇంకా పొంచి ఉంది…

తెలుగు రాష్ట్రాల్లో వాయుగుండం ప్రభావంతో వర్షాలు, వరదలు పొంచి ఉన్నాయి. అనేక జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపటికి వాయుగుండంగా బలపడే అవకాశాలు ఉన్నాయని,దీనివల్ల కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లోని నాలుగు జిల్లాల్లో రెడ్ ఎలర్ట్, మరో నలుగు జిల్లాల్లో ఆరంజ్ ఎలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా తెలంగాణ లోని మూడు జిల్లాలలో…

Read Full News
kl c

కె.ఎల్.లో ఆత్మహత్య…

గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని కే ఎల్ యూనివర్సిటీ లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ బెంగాల్ కు చెందిన సౌరదీప్ చౌదరి అనే విద్యార్ధి భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చౌదరి ఆత్మహత్య ఉదంతన్ని కాలేజి యాజమాన్యం గోప్యంగా ఉంచిన కొంత సమయానికి విద్యార్ధుల జోక్యంతో బయటికి పొక్కింది. చౌదరి ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడనే వివరాలు తెలియాల్సి ఉంది.

Read Full News
iith c

నైపుణ్యం కోసం మార్పులు…

విద్యార్ధుల్లో  నైపుణ్యాన్ని వెలికి తీయడానికి విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకువస్తున్నాట్టు ఐ.ఐ.టి. హైదరాబాద్ సంచాలకులు ప్రొఫెసర్ బి.ఎఎస్. మూర్తి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జాతీయ విద్యా విధానం మూడేళ్ళ లో గణనీయమైన మార్పు తెచ్చిందని పేర్కొన్నారు. ఈ నెల 29 వ తేదిన జరగనున్న జాతీయ విద్యా విధానం మూడో వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర మనవ వనరుల అభివృద్ధి శాఖ దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐ.ఐ.టి.ల ఉప కులపతులతో  నిర్వహించిన…

Read Full News

కెనడాలో హత్య…

కెనడాలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో ఓ భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే, ఒంటారియా ప్రావిన్స్ లో గుర్ విందర్ నాథ్ (24) అనే యువకుడు పిజ్జా డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 9వ తేదీన తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో మిస్సిసాగా అనే ప్రాంతంలో పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో గుర్ విందర్ పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు…

Read Full News
bus flood

కొంచెంలో తప్పింది..

ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఒక ప్రైవెట్ ట్రావెల్స్ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. ఒరిస్సా రాష్ట్రం నుండి ఆంద్రప్రదేశ్ కి బయలుదేరింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం కల్లేరు గ్రామ పంచాయతీ పరిధిలోని కుయుగూరు – నిమ్మలగూడెం గ్రామాల జాతీయ రహదారిపై వరద నీటిలో చిక్కుకుంది. కుయుగూరు వాగు వరద నీరు రహదారిపై చేరడం, తెల్లవారు జామున 4.30 గంటలకు చీకటిగా ఉండడంతో డ్రైవర్ కి వరద నీరు సరిగా కనిపించ లేదు. దీంతో వరద…

Read Full News
station

స్టేషన్ లోనే శవం…

పోలీస్ స్టేషన్ లో శవం బయట పడి కలకలం రేపింది. నిత్యం రద్దీగా ఉండే పోలీస్ స్టేషన్ లోనే శవం ఏంటి అనే సందేహం రావొచ్చు. కానీ ఇది నిజం. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా పుత్తూరు అర్బన్పోలీసు స్టేషన్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్టేషన్ ఆవరణలో ఫిర్యాదుదారుల కోసం నిర్మించిన టాయిలెట్ లో శవం కనిపించే సరికి సిబ్భంది ఒక్కసారిగా విస్తుపోయారు. ఆ వ్యక్తి చనిపోయి మూడు రోజులై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. వ్యక్తి…

Read Full News
Screenshot 2023 07 24 161235

భలే అడ్డా..వేస్కో..

పట్ట పగలు…అత్యంత రద్దీ ప్రాంతం… నిత్యం వేల కొద్ది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ట్రాఫిక్ ని అదుపు చేయడానికి పోలీసులు సతమతమయ్యే ప్రదేశం భాగ్యనగరంలోని హైటెక్ సిటీ జంక్షన్. ఆ సెంటర్ ని పోకిరిలు తాగడానికి అడ్డగా మార్చుకున్నారు. ఏ డివైడర్ పక్కనో, గల్లీ లోనో కాదు ఏకంగా పోలీసులు విధులు నిర్వర్తించే ట్రాఫిక్ బూత్ లోనే కావడం గమనార్హం. ఆ బూత్ నే అడ్డాగా మార్చుకొని ఇద్దరూ వ్యక్తులు కూర్చొని మద్యం తాగుతూ బిర్యానీ తింటున్న…

Read Full News
amit bandi

“షా “తో సంజయ్…

బిజెపి తెలంగాణ శాఖ మాజీ అధ్యక్షులు బండి సంజయ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ని ధిల్లీలో కలిశారు. సంజయ్ అధ్యక్షునిక వైతోలగిన తర్వాత ధిల్లీ వెళ్ళడం రదే మొదటి సారి. అయితే, అమిత్ షా ని మర్యాదపూర్వకంగా కలిసినట్టు సంజయ్ తెలిపారు.

Read Full News
pawan kkd 2

కేసు పడింది…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమపై చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలకు తీవ్ర మనస్తాపం చెందినట్టు విజయవాడ సివిల్ కోర్టులో ఓ మహిళా వాలంటీర్ పవన్ కల్యాణ్ పై పిటిషన్ వేసింది. పవన్ మాటలు మానసిక వేదనకు గురిచేశాయని పేర్కొంది. ఈ మేరకు వాలంటీర్ దాఖలు చేసిన పిటిషన్ కోర్టు విచారణకు స్వీకరించింది.

Read Full News
speaker

మణిపూర్ మంట…

లోక్ సభ వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ మంట రాజుకుంది. విపక్షాల నినాదాలు, ప్లకార్డులతో పార్లమెంట్ హాల్ హోరెత్తింది. ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో  సమావేశాల్లో ప్రతిష్టంభన నెలకొంది. దీనిపై చర్చకు సిద్ధమేనని కేంద్రం ప్రకటించినప్పటికీ ఆ  చర్చకు ముందే ప్రధాని ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుపట్టాయి.సోమవారం సమావేశాలు ప్రారంభం కాగానే విపక్ష పార్టీలు లోక్‌సభలో ప్లకార్డు లతో దర్శనమిచ్చాయి. “ఇండియా ఫర్ మణిపుర్‌” మణిపుర్‌ పై ప్రధాని ప్రకటన…

Read Full News