


చాందీ కన్నుమూత..
కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న కేరళ మాజీ ముఖ్యమంత్రి , సీనియర్ కాంగ్రెస్ నేత ఊమెన్ చాందీ కన్నుమూశారు. ఈ విషయాన్ని కేరళ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు కె. సుధాకరన్ వెల్లడించారు. 79 ఏళ్ల ఊమెన్ చాందీ బెంగళూరులోని చిన్మయ మిషన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారు. చాందీ కేరళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. రెండు సార్లు ముఖ్యమంత్రి గా, 4 సార్లు మంత్రిగా, 12 సార్లు ఎమ్మెల్యేగా దాదాపు ఐదున్నర…

దీని కోసమే చూస్తున్నా…
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పొత్తులపై భాజపా నేతలతో చర్చించే అవకాశం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఎన్డీయే భేటీలో పాల్గొనేందుకు దిల్లీ వచ్చిన పవన్ మీడియాతో మాట్లాడుతూ ఈ అవకాశం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఈ భేటీ కోసం భాజపా సీనియర్ నేతలు ఆహ్వానించారని, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి మార్గాలపై చర్చిస్తామని, ఎన్డీయే విధానాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్నదానిపై సమాలోచనలు చేయనున్నాట్టు పవన్ కల్యాణ్ వివరించారు.

ధర్నా షురూ…
ఎన్నో ప్రజా సమస్యలకు పరిష్కారం చూపిన పోరాట స్థలి “ధర్నాచౌక్”. ప్రభుత్వాలతో విసిగి వేసారిన అనేక ఉద్యోగ, ప్రజా సంఘాలు నిరసనలకు నీడనిచ్చిన మహా స్థలం “ధర్నాచౌక్”. ఇక్కడ జరిగిన వేలది కార్యక్రమాలను ప్రజలకు చూపాలనే తపనతో పగలనక ,రేయనక పనిచేశారు కలం వీరులైన విలేకరులు. ఇప్పుడు వారికే సమస్య వచ్చింది. ఆ సమస్య సాధన కోసం చేపట్టిన పోరాటానికి వేదికగా “ధర్నాచౌక్”నే ఎన్నుకున్నారు. అదీ ఈ రోజే.. అంటే జులై 18. న్యాయం కోసం ధర్నాకు…

అన్నీ రెడీ..
దశాబ్ధలుగా వేల సమస్యలపై వివిధ వర్గాలు చేపట్టిన పోరులో భాగంగా సాగిన ధర్నాలను వార్తలుగా మలిచి సమాజానికి అందించిన విలేకరులే అదే “ధర్నాచౌక్” లో నేడు న్యాయం కోసం ధర్నాకు దిగుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్లిప్తత, అహంకార ధోరణికి వ్యతిరేకంగా కలం వీరుల మహా నిరసన రేపే జరగనుంది. సుప్రీం కోర్టు తీర్పును సైతం నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా హైదరాబాద్ లోని జర్నలిస్టులు తమ పోరాటాన్ని మరింత ముమ్మరం చేస్తున్నారు. జవహర్ లాల్ నెహ్రు…

“చిరు” లీక్ చేశారు…
వచ్చే నేలలో విడుదల కాబోతున్న తన తాజా చిత్రం “భోళా శంకర్”పై ఓ లీక్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఆ సినిమాలో తమ్ముడి మ్యానరిజాన్ని “చిరు” అనుసరించారట. వినండి.. పవన్ పాటకు చిరు ఎలా స్టెప్పులు వేశారో చుడండి..

తప్పిన ప్రమాదం..
వందే భారత్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. భోపాల్ నుంచి ఢిల్లీకి వెళుతున్న వందే భారత్ రైలులో మంటలు చెలరేగాయి. రాణి కమలా పాటి స్టేషన్ నుంచి ప్రయాణం మొదలైన తర్వాత కుర్వాయి స్టేషన్ వద్ద సీ-14 కోచ్ నుంచి మంటలు వ్యాపించాయి. వీటిని గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే లోకో పైలట్ కు సమాచారం అందించారు. దీంతో రైలును వెంటనే ఆపేశారు. రైలులో మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక…

రండి..కదలండి..
దశాబ్ధలుగా వేల సమస్యలపై వివిధ వర్గాలు చేపట్టిన పోరులో భాగంగా సాగిన ధర్నాలను వార్తలుగా మలిచి సమాజానికి అందించిన విలేకరులే అదే “ధర్నాచౌక్” లో నేడు న్యాయం కోసం ధర్నాకు దిగుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్లిప్తత, అహంకార ధోరణికి వ్యతిరేకంగా కలం వీరుల మహా నిరసన రేపే జరగనుంది. సుప్రీం కోర్టు తీర్పును సైతం నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా హైదరాబాద్ లోని జర్నలిస్టులు తమ పోరాటాన్ని మరింత ముమ్మరం చేస్తున్నారు. జవహర్ లాల్ నెహ్రు…

డైరెక్ట్ ఫ్లైట్ ప్లీజ్…
భారత్ -అమెరికాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, పర్యాటకం కోసం ప్రపంచ గమ్యస్థానంగా హైదరాబాద్ ఆకర్షణను మరింత పెంచేందుకు హైదరాబాద్ నుంచి నేరుగా అమెరికాకు విమాన సర్వీసులు ఏర్పాటు చేయాలని యూఎస్ఎ ఎన్నారైలు అబిప్రాయపడ్డారు. ఈ మేరకు అమెరికాలో పర్యటిస్తున్న కిషన్ రెడ్డికి తెలుగు ఎన్నారైలు కలిసి తమ విజ్ఞప్తిని లేఖ రూపంలో అందించారు. ఢిల్లీ, ముంబై వంటి అనేక నగరాలు ఇప్పటికే అమెరికాలోని ప్రధాన నగరాలకు నేరుగా విమాన సర్వీసులను కలిగి ఉన్నాయని, అమెరికా నుండి హైదరాబాద్‌కు…
ఆషాఢ శోభ..
లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం తెల్లవారుజామున అమ్మవారికి ఆలయ అర్చకులు అభిషేకం నిర్వహించి తొలి బోనం సమర్పించారు. ఆషాఢమాసం ఆఖరి ఆదివారం కావడంతో మహంకాళికి బోనాలు సమర్పించడానికి తెల్లవారుజాము నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రభుత్వం తరఫున మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రెండు రోజులపాటు జరుగనున్న జాతరలో నేడు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. రెండో రోజైన సోమవారం రంగం కార్యక్రమం నిర్వహించనున్నారు. బోనాల…


చిరుత పులా..ఐతే..
పిల్లిని చూస్తేనే భయపడతారు కొందరు…అదే చిరుత అంటే ఆమడ దూరం పరుగెడతారు. అలాంటిది ఓ యువకుడు ఏకంగా చిరుత పులిపై విరుసుకు పడ్డాడు. దాన్ని కొట్టి పట్టుకుపోయి అధికారులకు అప్పజెప్పాడు. నిజమే.. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం హాసన్ జిల్లా పరిధిలోని అరసీకెరె తాలూకా గండాసి హోబ్లీ బాగివాలు అనే గ్రామంలో జరిగింది. వేణుగోపాల్ అలియాస్ ముత్తు అనే యువకుడు పొలానికి వెళ్తుండగా చిరుతపులి దాడి చేసింది. ఆ యువకుడు ధైర్యం చేసి దానిపై ఎదురు దాడి…

నేనదే..మరి నువ్వూ…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి రోజాకు బాలివుడ్ భామ సన్నీ లియోన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ని విమర్శించేటప్పుడు తనను మధ్యలో ఎందుకు లాగావ్ అంటూ ఫైర్ అయింది. నేను పోర్న్ స్టార్ నే కానీ, నా గతం గురించి అస్సలు నేను బాధపడటం లేదు. మీలా కాకుండా నేను చేయాలనుకున్నది బహిరంగంగానే చేశానని చెప్పేసింది. నీకు నాకు తేడా ఒక్కటే నేను ఇండస్ట్రీని వదిలేశాను, నువ్వు కాదు అంటూ చురకలు పెట్టింది. ఎవరు ఎలా అర్ధం…

ఇవ్వాల్సిందే…
జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్ సొసైటీకి కేటాయించిన స్థలాలను వెంటనే ఆ సొసైటీకి అప్పజెప్పాలని కాంగ్రెస్ పార్టీ శాసన సభ పక్ష నేత మల్లు బట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలకే ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సమస్యను పరిష్కరించడమే కాక ఇంకా అవసరమైతే అధిక స్థలాన్ని కేటాయిస్తామని బట్టి హామీ ఇచ్చారు.

బంధం బలం…
భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ఆర్దిక బంధాలు మరింత మెరుగు పడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశ పర్యటనలో కీలక అంశాలపై చర్చలు, ఒప్పందాలు జరిగాయి. ఇరు దేశాల మధ్య జరిగే వాణిజ్యపరమైన లవదేవిల్లో స్థానిక కరెన్సీలో చెల్లింపులు చేసులోవాలని యుఎఇ అధ్యక్షులు షేక్ మహ్మద్ బిన్ జేయేడ్ తో జరిగిన చర్చలో నిర్ణయించారు.ఇకపై ఎగుమతులు, దిగుమతుల సమయంలో రూపాయి, దిర్హమ్ లను చేల్లిన్సుకోవచ్చు. భారత్ యుపిఐ ఎమిరేట్స్ ఐపిపి ప్లాట్ ఫామ్ లను…