ap campan c

ఆధిపత్యమా – ఆస్తి కోసమా..!

అంధ్రప్రదేశ్ ఎన్నికల చదరంగంలో రాజకీయ వ్యవహారాలతో పాటు కుటుంబ తగాదాలు, కక్షలు భగ్గుమంటున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఏ ఎన్నికల్లోనూ ప్రస్తుత పరిస్థితి కనిపించ లేదు. ఏ ఎన్నికల్లో అయినా అధికార, ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ జనాన్ని ఓట్లు అడిగే వారు. కానీ, ఇప్పుడు ఆ ఊసే లేకుండా పోయింది. కొన్ని రోజులుగా సాగుతున్న ప్రచారం మొత్తం కుటుంబాల పరువు, మర్యాదలను  వీధులకు ఈడ్చుకునే  రీతిలో ఉన్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్,…

Read More
viveka c

“వివేకా”హత్య..? సిబిఐకి “మచ్చ”..?

అంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించి, వివాదంగా మారిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య ఉదంతం చిలికి చిలికి గాలి వానగా మారుతోంది. అనేక పరిణామాలు, అనుమానాల మధ్య కేంద్ర నేర పరిశోధన సంస్థ (సిబిఐ) చేతికి వెళ్లిన ఈ సంఘటన విచారణ తీరు పై సైతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సిబిఐ ప్రతిష్ట పై మచ్చ పడే సూచనలు కనిపిస్తున్నాయి. వివేకానంద రెడ్డి హత్య వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే పక్కా పథకం…

Read More
vijaya usa c

ఎవరి కోసం.. ఈ రాజకీయం..!

ఒకే రక్తం, ఒకటే గర్భం కానీ పుట్టిన బిడ్డలు మగ, అడ అదే తేడా. తల్లి “కడప” గడప దాటని గృహిణి. తండ్రిది దేశానికి ఏదో చేయాలనే తపన. అందుకే ఆయన తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని నేతగా ఆధిపత్యాన్ని చాటారు. రాజకీయంగా ఆయన ఆశయం, దూర దృష్టి అమోఘం. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో చేయాలనుకున్న ఆయన అకాల మరణం ఆ కుటుంబానికే కాదు తెలుగు ప్రజలకు, ఆయన్ని నమ్ముకున్న రాజకీయ పార్టీకి తీరని లోటు. వైఎస్ఆర్…

Read More
break c

ప్రజలపై అక్కసు-ప్రభుత్వం పై”కుట్ర”

ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో సత్తా చూపేందుకు ఎన్ని హామీలైనా గుప్పించవచ్చు. ప్రత్యర్థి పార్టీ పై రాజకీయ విమర్శలూ చేయొచ్చు. కొన్నేళ్ల కిందట వరకు ఎన్నికల తెరపై ఇదే తంతు కనిపించేది. రానురానూ అది కాస్తా వ్యక్తిగత వ్యవహారాల్లోకి వెళ్ళింది. దశాబ్ద కాలంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజా సమస్యల ముచ్చట పక్కనపెట్టి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం సర్వ సాధారణమైంది. ఎన్నికల్లో గెలిచిన పార్టీనీ, దాని నాయకులను ఓడిన నేతలు శత్రువులుగా చూడడం పరిపాటైంది. అధికార…

Read More
four c

ఆంధ్రాలో ఆ “నలుగురు”..!

ఆంధ్రప్రదేశ్ లో వడివడిగా మారిన రాజకీయ పరిణామాలు నిజంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కొద్ది రోజుల్లో  అక్కడ జరగనున్న ఎన్నికల తంతు రెండు కుటుంబాల చుట్టూనే తిరిగే విచిత్రమైన  పరిస్థితి కనిపిస్తోంది. అక్కడి రాజకీయ చదరంగంలోకి షర్మిల, పురందేశ్వరి రెండు ప్రధాన జాతీయ పార్టీల పగ్గాలు చేత పట్టు కోవడంతో  ఆంధ్ర రాజకీయాల్లో కొంత కాలం కిందటి  వరకు ఉన్న సమీకరణలు  క్రమేపీ మారుతూ వస్తున్నాయి.  రెండు జాతీయ పార్టీలు, రెండు ప్రాంతీయ పార్టీలు  రెండు కుటుంబాల చేతిలోనే…

Read More
canpn

“బక్కోడు..గుండోడు..నీ అయ్యా..”! ఇదే తీరు…

తెలంగాణలో పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నాకొద్దీ వివిధ రాజకీయ పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. ప్రధానంగా బిఆరేస్, కాంగ్రెస్, బిజెపి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో ఇంత వరకు ఎన్నడూ లేని విధంగా ప్రచార తీరు గాడి తప్పుతున్నట్టు కనిపిస్తోంది. ఈ ఎన్నికల ప్రచార సభల్లో నేతల ప్రసంగాల తీరును పరిశీలిస్తే రాజకీయాల కంటే వ్యక్తి గత విమర్శలు, దూషణలకు దిగుతున్నట్టు స్పష్టం అవుతోంది. ఏ ఎన్నికల్లోనైనా సరే అధికార పార్టీ పై విపక్షాలు,…

Read More
taraluf c

“రాములమ్మ”జాడ లేదు..”శివరంజని”ఊసు లేదు…!

గత రెండు దశాబ్దాలుగా ఎన్నికలు సమీపిస్తున్నాయంటే చాలు వివిధ రాజకీయ పార్టీలు జనాకర్షణ కోసం సినీ నటులపై దృష్టి సారించేవి. ఏదో రకంగా వాళ్ళను రంగంలోకి దించేవి లేదా ఆసక్తి ఉన్న నటులే ముందుకు వచ్చి తమకు నచ్చిన పార్టీల పంచన చేరే వారు. కానీ, ఈ ఎన్నికల్లో ఆ తంతు జాడ లేకుండా పోయింది.గత ఎన్నికల వరకు కూడా సీట్లు, ప్రచారల్లో సందడి చేసిన “వెండి తారలు”ఈ సారి తెలంగాణ శాసన సభ ఎన్నికల తెరపై…

Read More
babu pavan

టిడిపి-“సేన”లో పొత్తు చిచ్చు..!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ రాజకీయ పార్టీల పొత్తుల వ్యవహారం గందరగోళంగా మారుతోంది. పెద్ద పార్టీలతో చేతులు కలుపుతున్న పార్టీల వ్యూహాలు సామాన్యులకు అంతు పట్టడం లేదు. గత ఎన్నికలలో అంటకాగిన పార్టీలు ఈ సారి ఎడమొహం పెడమొహంగా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ శత్రువులుగా మారాయి. తెలంగాణ, అంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రాలో బిజెపితో కలిసి తిరిగిన జనసేన ఈ సారి రూటు మార్చింది. మొన్నటి వరకు…

Read More
she c

మహిళా నేతల పై …

దేశంలోని ముఖ్యమైన మహిళ నాయకురాళ్లపై ప్రముఖ జర్నలిస్టు నిధి శర్మ రచించిన “షి ద లీడర్ విమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్” పుస్తకావిష్కరణ కార్యక్రమం ఢిల్లీలో జరుగుతోంది. దీనికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరవుతున్నారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి ,మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి ఎంపీ మనీష్ తివారి, సిపిఎం ఎం.పీ జాన్ బ్రిటాస్ తో కలిసి కవిత ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.

Read More