ఆంధ్ర ప్రదేశ్ లో ప్రశాంతమైన నగరంగా ఉన్న విశాఖ పట్నం ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అడ్డాగా మారిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. విశాఖ నుంచి ప్రారంభమైన “వారాహి” మూడో విడత యాత్ర సందర్భంగా జగదంబా సెంటర్ లో ఆయన మాట్లాడారు. విశాఖ ప్రస్తుతం కబ్జాదారులు, రాబందుల చేతులోకి వెళ్లిందన్నారు. 150 మంది ఎమ్మెల్యేలతో నీ ఇష్టం వచ్చినట్లు ఆంధ్ర రాష్ట్రం ఏలుతున్నావని, ఐనా నీకు ఎవరూ భయపడరని ముఖ్యమంత్రి జగన్ ని ఉద్దేశించి అన్నారు. ఉత్తరాంధ్ర నేతలను తన్ని తగిలేసి వరకు జనసేన నిరంతరం పోరాటం చేస్తుందని పేర్కొన్నారు.
జగన్ అడ్డాగా విశాఖ…
