godavari in 2

కదలలేక..మెదల లేక…

కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.హైదరాబాద్, విజయవాడ 65 వ నెంబర్ జాతీయ రహదారిపై  వరద ప్రవాహం ఇంకా కొనసాగుతోంది. కృష్ణా జిల్లా కీసర టోల్ గేటు సమీపంలోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉధృతి అధికం కావడంతో  ఆ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. హైద్రాబాద్ నుంచి ఏపి వెళ్ళే వాహనాలను కోదాడ,హుజూర్ నగర్,మిర్యాలగూడ మీదుగా మళ్లించారు. కోదాడ – హుజూర్ నగర్ రహదారిపై 5 కిలోమీటర్ల…

Read More
iit con

ఇలా చేద్దాం..

ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్ధులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఇండియన్ ఇనిస్టిట్యుట్ అఫ్ టెక్నాలజీ (ఐఐటి), నేషనల్ ఇనిస్టిట్యుట్  టెక్నాలజీ (ఎన్ఐటి)కి చెందిన అధ్యాపకులు అభిప్రాయపడ్డారు. ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ అధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా  రెండురోజుల పాటు జరిగిన సమావేశాల్లో దేశ వ్యాప్తంగా ఉన్న 29 ఐఐటిలు, ఎన్ఐటిలకు చెందినా డీన్ లు పాల్గొన్నారు. ఈ  సమావేశాలను ఐఐటి హైదరాబాద్ బ్రాంచి డైరెక్టర్ బి.ఎస్.మూర్తి ప్రారంభించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం, సమాజ పరిస్థితులకు…

Read More
ANJANI

బీ అలర్ట్ …

రానున్న రెండు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు.మరో 48 గంటలలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై పోలీస్ కమీషనర్లు, ఎస్.పి.లతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ సంజయ్ కుమార్ జైన్ కూడా పాల్గొన్న ఈ వీడియో కాన్ఫరెన్స్ లో…

Read More
Screenshot 2023 07 27 120911

పాము అంటే పట్టించుకోరా…

ఇంట్లోకి వచ్చిన పామును పట్టుకోవాలని చేసిన ఫిర్యాదుకు అధికారులు స్పందించ లేదు. ఎంతసేపు వేచి చూసినా వారి జాడ కనిపించలేదు. అలాంటప్పుడు ఎవరైనా ఏం చేస్తారు నలుగురి సహాయం తీసుకోని పాముని పట్టుకోవడమో, చంపడమో చేస్తారు. కానీ, మహా నగరంలో మాత్రం అలా జరగలేదు. మున్సిపాలిటి అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఆ పాముని పట్టుకొని నేరుగా ఆఫీసుకు కెళ్ళాడు ఓ యువకుడు. హైదరాబాద్ అల్వాల్ లో ఈ సంఘటన జరిగింది. ఆ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి పాము…

Read More
godavari 23

బిరబిరా…గలగలా…

భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద వల్ల భద్రాచలం వద్ద నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది. గురువారం ఉదయానికి 50.50 అడుగులకు చేరుకుంది. దీంతో 3 వ ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంది. ఇప్పటికే పలు కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. భద్రాద్రి దేవస్థానం ముందున్న విస్టా కాంప్లెక్స్, అన్నదాన సత్రంలోకి వరద నీరు చేరింది. గోదావరి ఉధృతిని ముందు నుంచే అంచనా వేస్తున్న…

Read More
cs rain c

అప్రమత్తంగా ఉండండి..

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న 48 గంటలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున అత్యంత అప్రమత్తతతో ఉండాలని జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్.పి లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా సి.ఎస్ మాట్లాడుతూ రానున్న 48 గంటలలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐ.ఎం.డి…

Read More
gadder c

గడ్డర్ కింద కార్మికులు..

తిరుపతి శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మాణంలో అపశృతి చోటు చేసుకుంది. ఫ్లె ఓవర్ కు గడ్డర్ ను అమర్చే సమయంలో ప్రమాదం జరిగి ఆప్కాన్స్ సంస్థకు చెందిన ఇద్దరు కార్మికులు మృతి చెందారు. జెసిబిలతో విరిగిన గడ్డర్ ను తొలగించి మృత దేహాలను బయటికి తీశారు. మరణిచిన కార్మికులు వెస్ట్ బెంగాల్ కు చెందిన అవిజిత్, మరొకరు బీహార్ కు చెందిన బార్థో మాండల్ గుర్తించారు. దీనిపై అధికారులు విచారణ ప్రారంభించారు. గడ్డర్ పడిపోవడానికి కారణాలను తెలుసుకుంటున్నారు.

Read More
Screenshot 2023 07 26 124824

చచ్చి బతికి దహనం…

రాష్ట్రంలో స్మశాన వాటికలను అభివృద్ధి చేస్తామని చెబుతున్న ప్రభుత్వానికి ఆ పనులు ఆచరణలో జరగడం లేదు అనడానికి ఈ సంఘటనే నిలువెత్తు సాక్ష్యం. ఒకవైపు కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ఊరిలో స్మశానం లేక చనిపోయిన అంతిమ సంస్కారాలకు నానా తంటాలు పడ్డారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందిన వృద్దుడి దాహాన సంస్కారాలు చేయాలంటే వాగుదటి పోవలసిన దుస్థితి. శవాన్ని తప్పని సరి స్మశానానికి తీసుకు వెళ్ళాల్సిందే. దీంతో బంధువులు, కొందరు గ్రామస్తులు…

Read More
kcr 4

మేమూ రెడీ..

లోక్ సభలో కేంద్ర ప్రభుత్వంపై భారత రాష్ట్ర సమితి, ఎం.ఐ.ఎం. పార్టీలు కూడా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సభ విశ్వాసాన్ని కోల్పోయిందని, ఆ మేరకు బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వర రావు నోటీసులు ఇచ్చారు. ఆ అవిశ్వాస తీర్మానాన్ని బిజినెస్ లిస్టులో చేర్చాలని కోరారు. లోక్‌సభలో రూల్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్‌లోని 17వ అధ్యాయంలోని రూల్ 198 (బి) కింద, ఈ…

Read More
DURGA

జారిపడ్డ రాళ్లు…

విజయవాడలో కనకదుర్గమ్మ తల్లి కొలువై ఉన్న ఇంద్రకీలాద్రిపై కొండరాళ్లు జారి పడడం ఆందోళనకు గురి చేసింది. ఎడతెరిపి లేకుండా వర్షం వల్ల రాళ్ళ చుట్టు ఉండే మట్టి కొట్టుకుపోయి రాళ్ళు ఘాట్‌ రోడ్‌ మీద పడ్డాయి. దీంతో అప్రమత్తమైన దేవస్థానం అధికారులు వెంటనే ఆ మార్గంలోని టోల్‌గేట్‌ను మూసివేశారు. భక్తులను మల్లికార్జున మహా మండపం మెట్ల మార్గం వైపు మళ్లించారు. ఇంజనీరింగ్‌ అధికారులు, సిబ్బంది ఘాట్ రోడ్డులో పడిపోయిన రాళ్లను యుద్ధప్రాతిపదికన తొలగించారు.

Read More
tg high court

ఫలితాలు ఆపండి…

తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చే సోమవారం వరకు ప్రకటించ వద్దని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రిలిమ్స్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు సర్వీసు కమిషన్ కు ఆదేశాలు జారీచేసింది. అదేవిధంగా కౌంటర్ దాఖలు చేయాలని టీ ఎస్ పి ఎస్ సికి సూచించింది. తమ వాదనలు వినిపించేందుకు సోమవారం వరకు కమిషన్ గడువు కోరగా అయితే…

Read More
praneeti

కృత్రిమ గర్భానికి ఎ.ఐ…!

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఎ.ఐ.) ఆధారిత ఆర్ ఐ విట్ నెస్ సిస్టం వంటి సరికొత్త పరిజ్ఞానంతో సంతాన సాఫల్యం సులభతరమవుతుందని సినీ నటి ప్రణీత అన్నారు. సికింద్రాబాద్ లోని ఫర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్ లో తొలిసారిగా ఏ ఐ ఆధారిత ఆర్ ఐ విట్ నెస్ సిస్టంను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రణీత మాట్లాడుతూ మాతృత్వం ఒక వరమని, మారుతున్న జీవన విధానం, వాతావరణంలో మార్పులు, వృత్తి పరమైన ఒత్తిడి పెరిగడం వల్ల సంతాన లేమి…

Read More
rain

ఇంకా పొంచి ఉంది…

తెలుగు రాష్ట్రాల్లో వాయుగుండం ప్రభావంతో వర్షాలు, వరదలు పొంచి ఉన్నాయి. అనేక జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపటికి వాయుగుండంగా బలపడే అవకాశాలు ఉన్నాయని,దీనివల్ల కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లోని నాలుగు జిల్లాల్లో రెడ్ ఎలర్ట్, మరో నలుగు జిల్లాల్లో ఆరంజ్ ఎలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా తెలంగాణ లోని మూడు జిల్లాలలో…

Read More
kl c

కె.ఎల్.లో ఆత్మహత్య…

గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని కే ఎల్ యూనివర్సిటీ లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ బెంగాల్ కు చెందిన సౌరదీప్ చౌదరి అనే విద్యార్ధి భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చౌదరి ఆత్మహత్య ఉదంతన్ని కాలేజి యాజమాన్యం గోప్యంగా ఉంచిన కొంత సమయానికి విద్యార్ధుల జోక్యంతో బయటికి పొక్కింది. చౌదరి ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడనే వివరాలు తెలియాల్సి ఉంది.

Read More