babu pwn kodi

పందెం “కోళ్ళు”…

ఆంధ్రప్రదేశ్ లోని మందడం గ్రామంలో జరిగిన భోగి వేడుకల్లో టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొని సందడి చేశారు. గంగిరెద్దు కళ్ళాలు పట్టుకొని పవన్ “డూ…డూ…బసవన్న”అనగా ఆ పక్కనే చంద్రబాబు నాయుడు విజయం మనదే అన్నట్టు సంకేతం చూపడం ఆకర్షణగా నిలిచింది.

Read More
tpt drone

భక్తి కాదు..బలుపు…!

భక్తిని చాటుకోవలసిన చోట బలుపు కనిపించింది. పవిత్ర తిరుమల కొండ మలుపుల్లో ఓ జంట అధికారుల కళ్ళు గప్పి డ్రోన్ కెమెరాను చంకన వేసుకుపోయింది. ఇందులో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. తిరుమలలో విజిలెన్స్ నిఘా వైఫల్యానికి సాక్ష్యంగా నిలిచింది. అస్సాం కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఘాట్ రోడ్డు 53వ మలుపు వద్ద నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ సాయంతో తిరుమల కొండలను వీడియో తీశారు. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డు లోని…

Read More
cec andhra

ప్రజాస్వామ్య బద్ధంగా..

పార్లమెంట్ ఎన్నికల కోసం భారత ఎన్నికల కమీషన్ పెద్దఎత్తున సన్నాహాలు చేస్తోందని భారత ప్రధాన ఎన్నికల కమీషనర్ ఎస్ హెచ్ రాజీవ్ కుమార్ అన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికల నిర్వహణకు ఇంకా ఏమి చేయాలనే దానిపై వాటాదారులతో సమీక్ష, సంప్రదింపుల కోసం తొలిగా ఆంధ్రప్రదేశ్ ను సందర్శించామన్నారు. రాష్ట్ర పర్యటనలో ఉన్న భారత ఎన్నికల కమీషన్ బృందం గత 3 రోజులుగా అన్ని రాజకీయ పార్టీలు, కలెక్టర్లు, ఎస్పీలు మరియు సిఎస్, డిజిపితో సహా ప్రభుత్వ సీనియర్…

Read More
ap electn

ఆంధ్రలో కేంద్ర అధికారులు…

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. భారత ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్‌, ఎలక్షన్ కమీషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్‌ విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా, కృష్ణ జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, ఎస్పీ జాషువా, జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్, మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ వారికి స్వాగతం పలికారు. నగరంలోని నోవాటెల్ హోటల్లో 9,…

Read More
IMG 20231222 WA0095

“బాబు” యాగం…

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో చండీయాగం, సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగే శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ది మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమంలో భాగంగా మొదటి రోజు యజ్ఞ క్రతువులు చేపట్టారు. ఉదయం 9 గంటల నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు జరిపారు. ప్రజలందరికీ మేలు జరగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా చంద్రబాబు – భువనేశ్వరి దంపతులు ప్రార్థించారు. గుంటూరుకు…

Read More
jagana review

ఇటీవల తుపాను కారణంగా దెబ్బతిన పంటలపై, రంగుమారిన వరి ధాన్యం కొనుగోలుపై సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌ సమీక్షసమావేశం నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైతులను ఆదుకుంటున్న చర్యలపై చర్చించారు. రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్నిరకాలుగా ఆదుకుంటుందన్న భరోసా వారిలో కల్పించాలన సీఎం ఎమ్మెల్యేలను ఆదేశించారు. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోందని స్పష్టంచేశారు. ప్రతి గింజను కూడా కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని,…

Read More
alla

“ఆళ్ళ”రాజీనామా …!

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీకి షాక్ తగిలింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శికి ఆళ్ల రాజీనామా లేఖ ఇచ్చారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని ఆళ్ళ అసంతృప్తితో ఉన్నారు. అలాగే రూ.1250 కోట్లు నిధులు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని కూడా ఆగ్రహంతో ఉన్నారు. తనను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆళ్ల…

Read More
IMG 20231208 WA0011

ఆంధ్రాలోనూ అహంకార రాజ్యమే..!

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై అంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోరు విప్పారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నేతృత్వం లోని భారత రాష్ట్ర సమితిపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తెనాలి నియోజక వర్గం నందివెలుగులో తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అహంకారం ఉంటే ఏమవుతుందో తెలంగాణలో చూశామన్నారు. ఆంద్రప్రదేశ్ లో కూడా జగన్‌ ప్రభుత్వం అహంకారంతో ఉందని వ్యాఖ్యానించారు.

Read More
nagavani

నో ఛాన్స్…

ఆంధ్రప్రదేశ్ లోని పాలిటెక్నిక్ కళాశాలల్లో డిఫార్మసీ కోర్సుకు సంబంధించిన ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూలు ముగిసిందని, మొత్తం 48 కళాశాలల్లో 3044 సీట్లు ఉండగా, 531 సీట్లు భర్తీ చేసామని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్, ప్రవేశాల కన్వీనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఇంటర్మీడియట్ అర్హతతో పాలిటెక్నిక్ కళాశాలల్లో రెండు సంవత్సరాల డిప్లమో ఇన్ ఫార్మసీ అడ్మిషన్ల కోసం నిర్దేశించగా, సీట్ల కేటాయింపు వివరాలను సోమవారం విడుదల చేసారు. 9 ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో 506 సీట్లు ఉండగా…

Read More
IMG 20231127 WA0027

“మౌని”వత్వం..!

మానవత్వం అంటూ మాట్లాడడం వేరు, దాన్ని చాటుకోవడం వేరు. మాట్లాడే వారు చాలా మంది ఉంటారు, కానీ మానవతావాదులు కొందరే ఉంటారు. అలాంటి ఔదార్యం శ్రీకాకుళం జిల్లాలో కనిపించింది. ఈ ఎచ్చెర్ల మండలానికి చెందిన రైతు గోవిందరావు, ఉమాదేవి దంపతుల కుమార్తె మౌనిక (23) వీఆర్వోగా పనిచేస్తున్నారు. ఈ నెల 23వ తేదీన ఆమె ద్విచక్ర వాహనంపై వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయపడింది. వైద్యులు బ్రెయిన్ డెడ్ అని ప్రకటించడంతో గుండె, కిడ్నీలు, కళ్లు…

Read More
chadalavd 1

మరో 11 పాలిటెక్నిక్ కాలేజీలు…

ఆంధ్రప్రదేశ్ లో రానున్న రెండు నెలల్లో మరో 11 పాలిటెక్నిక్ లకు ఎన్‌బీఏ లభించే అవకాశం ఉందని, ఇందుకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయని సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. నేషనల్ బోర్డు ఆప్ అక్రిడిటేషన్ గుర్తింపు సాధనలో భాగంగా చేస్తున్న కార్యక్రమాలు ప్రభుత్వ పాలిటెక్నిక్ లకు నూతనత్వాన్ని ఆపాదిస్తున్నాయన్నారు. విద్యార్ధులకు ఉపాధి ఏ మేరకు లభిస్తుందన్న దానిని కూడా ఎన్‌బీఏ పరిగణనలోకి తీసుకుంటుదని, ఆక్రమంలో వారికి తక్షణం ఉద్యోగాలు లభించేలా చర్యలు…

Read More
yuvac

మళ్లీ జన”గళం’….!

ఆంధ్రప్రదేశ్ లో  ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ జనగళమే “యువగళం”గా యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 79రోజుల సుదీర్ఘ విరామానంతరం మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టబోతోంది. జగన్మోహన్ రెడ్డి అరాచకపాలన, అవినీతి బాగోతాన్ని ఎండగడుతున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు నైపుణ్య అభివృద్ధి కేసులో  జైలుకు  వెళ్ళడంతో అనివార్య పరిస్థితుల్లో సెప్టెంబర్ 9వ తేదీన కోనసీమలోని రాజోలు నియోజకవర్గం పొదలాడ వద్ద యువనేత లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. తర్వాత దేశ రాజధాని డిల్లీలో జగన్మోహన్…

Read More
sena ycp

నిలకడ లేని “పవన్”…

పవన్ కళ్యాణ్ ని నమ్ముకుంటే అందర్ని రోడ్డునపడేసి నట్టేట ముంచుతాడని జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ కు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పసుపులేటి సందీప్,జనసేన పార్టీ రాయలసీమ రీజియన్ సమన్వయకర్త పసుపులేటి పద్మావతిలు ఆరోపించారు.ఆంధ్రప్రదేశ్ లో వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో వారు వైయస్సార్ సిపిలో చేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వైఖరిపై పలు ప్రశ్నలు కురిపించారు. అందర్ని ప్రశ్నిస్తానని,రాజకీయాలలో మార్పు తెస్తానని చెప్పే పవన్ లో నిలకడలేదని, ధైర్యం…

Read More
murm 3

పుట్టపర్తికి రాష్ట్రపతి…

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 22వ తేదీ శ్రీసత్య సాయి జిల్లా పుట్టపర్తి సందర్శించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ వీడియో సమావేశం ద్వారా సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 22న మధ్యాహ్నం 12.30 గం.లకు బెంగుళూరు నుండి భారత వాయుసేన విమానంలో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి చేరుకుని అక్కడి…

Read More
lift c

ఇక పంట పొలాల”పల్నాడు”…!

ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు ప్రాంత ప్రజల కష్టాలు, కన్నీళ్లు తెలిసిన వ్యక్తుల్లో తాను కూడా ఒకడినని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. కృష్ణా నది ఒడ్డునే ఉన్నప్పటికీ మాచర్లకు కృష్ణమ్మ నీళ్లు అందని పరిస్థితి నెలకొందని చెప్పారు. పల్నాడుకు వరికపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్టు అవసరం ఎంతుందనేది తెలిసిన అతికొద్దిమందిలో తానూ ఒకడినని చెప్పారు. దశాబ్దాలుగా ఈ సమస్యను ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా నెల ముందు గత పాలకులు ఈ…

Read More